Monday, 16 March 2026

Blog

E-పేపర్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో యాచారం మండలం లో మేడిపల్లి నక్కర్త BRS పార్టీ అభ్యర్థులపై సస్పెన్షన్ వేటు

పున్నమి ప్రతినిధి : BRS పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అభ్యర్థి మొరుగు శివలీల రమేష్ ని ప్రకటించడం జరిగింది దీనికి విరుద్దంగా మక్కపల్లి స్వరూప – శ్రీనివాస్ యాచారం PACS డైరక్టర్ గారు పార్టీకీ వ్యతిరేకంగా నామినేషన్ వేయడం జరిగింది పార్టీ అధిష్టానం ఉపాసంహరించుకోవాలని అదేశించిన ఉపసంహారించుకోలేదు పార్టీ ఆదేశాలను పట్టించుకోనందున వీరిని 1.మక్కపల్లి స్వరూప – శ్రీనివాస్, 2.ఆడాల గణేష్ , 3.వడ్డెమోని కిషన్ (గ్రామ శాఖ అధ్యక్షులు (పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది మండల పార్టీ అధ్యక్షులు కర్నాటి రమేష్ గౌడ్

E-పేపర్

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ పౌర సరఫరాల శాఖ జిల్లా ఉపధికారి 20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన రవీందర్ నాయక్ రాజేంద్రనగర్ ప్రాంతంలో పట్టుబడ్డట్లు విశ్వసనీయ సమాచారం,

*బ్రేకింగ్* పున్నమి ప్రతినిధి *రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ పౌర సరఫరాల శాఖ జిల్లా ఉపధికారి 20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన రవీందర్ నాయక్ రాజేంద్రనగర్ ప్రాంతంలో పట్టుబడ్డట్లు విశ్వసనీయ సమాచారం,* జిల్లా కలెక్టరేట్లో తనిఖీలు చేస్తున్న ఏసీబీ అధికారులు, జిల్లా కలెక్టర్ రేట్ లో ఏడి ల్యాండ్ సర్వేర్ ఘటన మరొక ముందే, వారం రోజుల్లోపే మరొకటి*

విశాఖపట్నం

సచివాలయ సిబ్బందితో పీ-4 సమీక్ష నిర్వహించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు*

*విశాఖపట్నం, డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి:- *సచివాలయ సిబ్బందితో పీ-4 సమీక్ష నిర్వహించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు* *ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజన్–2047 అమలుకు పీ-4 కీలకం* *బంగారు కుటుంబాల గుర్తింపులో పారదర్శకత తప్పనిసరి* *– రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు* *విశాఖపట్నం దివ్యదర్శిని న్యూస్* గాజువాక శాసన సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఈ రోజు గాజువాక జోన్–6 కార్యాలయంలో సచివాలయ సిబ్బందితో నిర్వహించిన P4 సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గంలో బంగారు కుటుంబాల గుర్తింపు పూర్తిగా పారదర్శకంగా, నిజాయితీగా, ఎవరికీ అన్యాయం జరగకుండా జరగాలని ఆయన స్పష్టంగా తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ప్రయోజనం ఆలస్యం లేకుండా చేరేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాల అధికారులను కోరారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజన్–2047 యొక్క ప్రధాన లక్ష్యం పేదరిక నిర్మూలన అని అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో P4 కీలక పాత్ర పోషిస్తుందని, ఇది కేవలం ఒక సర్వే మాత్రమే కాదు… ప్రజల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకువచ్చే చారిత్రాత్మక కార్యక్రమమని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి దీనిని బాధ్యతగా మాత్రమే కాదు, మన ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశంగా తీసుకోవాలని సూచించారు. పేదల కోసం ప్రభుత్వం పథకాలు ఇవ్వడం ఒక భాగమే. కానీ వారిని ఆర్థికంగా నిలబెట్టడం, స్వయంసమృద్ధి దిశగా నడిపించడం చంద్రబాబు గారి అసలు ధ్యేయమని పల్లా గారు అన్నారు. బంగారు కుటుంబాల గుర్తింపు కేవలం ఒక జాబితా తయారు చేయడం కాదని, వారికి అవసరమైన ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్య సహాయం అందించి శాశ్వత పరిష్కారం చూపడమే అసలు లక్ష్యం అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం సొంత ఇంటిలోనా, అద్దె ఇంటిలోనా లేదా ఇతర వసతిలోనా నివసిస్తున్నారో స్పష్టంగా గుర్తించాలని సూచించారు. సొంత ఇల్లు ఉన్నపక్షంలో, ఆ భూమి ప్రభుత్వ భూమా, అసైన్డ్ (జెర్రిబట్టి) భూమా లేదా ఇతర వర్గంలోదా అనేది ఖచ్చితంగా నమోదు చేయాలని అన్నారు. అది ప్రభుత్వ భూమి అయితే, ఆ కుటుంబానికి పట్టా ఉందా లేదా అనే అంశాన్ని నిర్ధారించాల్సిందిగా సూచించారు. సంబంధిత భూమి వుడా భూమా, అభ్యంతర భూమా, ఏపీఐఐసీ భూమా, ప్రైవేట్ వివాద భూమా లేదా కార్పొరేషన్ భూమి కిందకు వస్తుందా అన్న వివరాలను కూడా స్పష్టంగా గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా, పెన్షన్‌కు అర్హులైన వ్యక్తులను, రేషన్ కార్డులకు అర్హులైన కుటుంబాలను వెంటనే గుర్తించి, అర్హత ఉన్న వారు ఎవరూ మిగలకుండా చూడాలని ఆయన ఆదేశించారు. అత్యవసర వైద్య శస్త్రచికిత్సలు అవసరమయ్యే వారి వివరాలను సేకరించి, సీఎంఆర్ఎఫ్ వంటి ప్రభుత్వ పథకాల ద్వారా వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని పల్లా గారు స్పష్టం చేశారు. ప్రతి ఇంటి పరిస్థితిని అర్థం చేసుకుని, వారికి అవసరమైన వనరులు కల్పించడం ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలిపారు. P4 సర్వే పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి పునాది వేస్తోందని, ఈ దశను పూర్తిస్థాయి బాధ్యతతో అమలు చేయాలని పల్లా గారు సిబ్బందిని ప్రోత్సహించారు

విశాఖపట్నం

రి కనక మహా లక్ష్మి అమ్మవారి ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు

అలరించిన భక్తి గీతాలు ★ అమ్మవారి ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు ★ కళాకారులకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేసిన డాక్టర్ కందుల విశాఖపట్నం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి:- శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మెలోడీ క్రియేటర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి గీతాలు ఆలాపన పలువురిని ఆకట్టుకుంది. కార్యక్రమము ఆధ్యాంతం భక్తి పాటలతో అలరించడంతో భక్తులు ఆనంద పరవశంలో మునిగి తేలారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు, విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ చేతుల మీదుగా భక్తి పాటలను ఆలపించిన నిర్వాహకులకు సత్కారం చేస్తే జ్ఞాపకలను, సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ఒక మంచి ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ భక్తి కార్యక్రమం అందరినీ అలరించిందన్నారు. మెలోడీ క్రియేటర్స్ సభ్యులు అందరిని ఆకట్టుకునే విధంగా భక్తి పాటలు ఆలపించి కనువిందు చేశారని కొనియాడారు. ఆలయ ఈవో శోభారాణి ఆధ్వర్యంలో ఈ ఏడాది అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ సహకారం మరువ లేనిది అన్నారు. ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు అందరి మీద ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శోభారాణి, సిహెచ్ వి రమణ, ఏ ఈ ఓ లు నరేంద్ర ,రాజేంద్ర, అలాగేసిహెచ్వి సత్యనారాయణ, మెలోడీ క్రియేటర్స్ అధ్యక్షులు ఎం.వి రాజశేఖర్, కార్యదర్శి కడలి, కన్వీనర్ శృతిలయ, అదేవిధంగా వి ప్రభాకర్ ,కొణతాల వెంకట సురేష్, ఎం శ్రీనివాస్, ప్రణవి సంతోషిని, హర్షిత ,లలిత వరలక్ష్మి, శ్రీనివాస శర్మ, సిహెచ్ జోగిరాజు, కె రామ్ కుమార్, శ్రీకాంత్, వి ఏ నాయుడు, కేదార్ లక్ష్మి, వెంకటలక్ష్మి, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

సదా మీ(ప్రజా) సేవలోడాక్టర్ కందుల నాగరాజు

*విశాఖపట్నం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి* 32, 34వ వార్డులకు చెందిన చలవ తోట ప్రాంతంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య కారణంగా స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అందిన ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ శ్రీ కందుల నాగరాజు గారు సంబంధిత అధికారులతో కలిసి ఘటన స్థలాన్ని సందర్శించారు. ప్రజల సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించి, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడంతో సమస్యను పూర్తిగా పరిష్కరించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎల్లప్పుడూ ముందుండే నాయకుడిగా మరోసారి నిలిచారు డాక్టర్ నాగరాజు గారు.

Blog

అనిల్ అంబానీ కుమారుడిపై సీబీఐ కేసు

అనిల్ అంబానీ కుమారుడిపై సీబీఐ కేసు అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్‌పై సీబీఐ కేసు రూ.228 కోట్ల బ్యాంకింగ్ మోసానికి సంబంధించిన వ్యవహారం యూనియన్ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో జై అన్మోల్ అంబానీ ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అనిల్ అంబానీపై సీబీఐ క్రిమినల్ కేసు నమోదు చేసింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ కు సంబంధించిన బ్యాంకింగ్ మోసం కేసులో ఆయనపై ఈ చర్యలు తీసుకున్నారు. అనిల్ అంబానీ కుమారుడిపై క్రిమినల్ కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ కేసులో జై అన్మోల్‌తో పాటు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, కంపెనీ మాజీ సీఈఓ రవీంద్ర సుధాల్కర్‌లను కూడా నిందితులుగా చేర్చారు. చీటింగ్, నేరపూరిత కుట్ర, నిధుల దుర్వినియోగం ద్వారా బ్యాంకుకు రూ.228.06 కోట్ల నష్టం కలిగించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. సీబీఐకి అందిన ఫిర్యాదు ప్రకారం, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ వ్యాపార అవసరాల కోసం బ్యాంకు నుంచి రూ.450 కోట్ల వరకు రుణ సదుపాయం పొందింది. అయితే, కంపెనీ సకాలంలో వాయిదాలు చెల్లించడంలో విఫలమవడంతో 2019 సెప్టెంబర్ 30న ఈ ఖాతాను నిరర్థక ఆస్తిగా (NPA) వర్గీకరించారు. అనంతరం గ్రాంట్ థార్న్‌టన్ సంస్థ నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో కంపెనీ రుణాలుగా పొందిన నిధులను ఇతర అవసరాలకు దారి మళ్లించినట్లు తేలింది. ప్రమోటర్లు, డైరెక్టర్ల హోదాలో ఉన్న నిందితులు ఖాతాలను తారుమారు చేసి, నిధులను పక్కదారి పట్టించి బ్యాంకును మోసం చేశారని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఫిర్యాదులో ఆరోపించింది. ఈ కేసులో భాగంగా సీబీఐ అధికారులు కంపెనీకి సంబంధించిన పత్రాలు, లోన్ అకౌంట్లను పరిశీలించనున్నారు.

అమరావతి

స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్*

*స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్* *ప్రభుత్వ చర్యలతో 48 శాతం తగ్గిన అంటువ్యాధులు* *డెంగ్యూ 56 శాతం, మలేరియా 11 శాతం, చికున్ గున్యా 46 శాతం తగ్గుదల* *సీజనల్ వ్యాధులను పూర్తిగా కట్టడి చేయాలి* *అపరిశుభ్రతే అసలు జబ్బు…ప్రజల్లో చైతన్యం పెంచాలి* *వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు* *అమరావతి డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి:-* స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనం చేసేందుకు, భవిష్యత్‌లో దీన్ని పూర్తిగా నివారించేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేశించారు. సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ తీవ్రత, దాని బారిన పడినవారికి అందుతోన్న వైద్య సాయంపై సమీక్ష చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,592 మంది స్క్రబ్ టైఫస్ బారిన పడ్డారని సీఎంకు అధికారులు వివరించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 420 కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ వ్యాధి కారణంగానే ప్రాణాలు పోతున్నట్లు ఇప్పటి వరకు నిర్థారణ కాలేదని చెప్పారు. చనిపోయిన 9 కేసుల్లోనూ కాజ్ ఆఫ్ డెత్‌పై పరిశీలన జరిపామని… స్క్రబ్ టైఫస్ వల్లనే చనిపోయారని ఎక్కడా నిర్థారణ కాలేదని అధికారులు వివరించారు. ఇతర ఆరోగ్య సమస్యలు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆ 9 మంది చనిపోయినట్లు అధికారులు సీఎంకు తెలియజేశారు. ప్రజలు స్క్రబ్ టైఫస్ భారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని…వ్యాధి ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలతో పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో స్క్రబ్ టైఫస్ ప్రభావం ఉందని… ఈ వ్యాధికి సంబంధించిన కేసుల్లో ఏపీ 8వ స్థానంలో ఉందని తెలిపారు. తమిళనాడు, ఒడిస్సాలలో 7 వేలు చొప్పున కేసులు ఉన్నాయని వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ…..స్క్రబ్ టైఫస్‌ను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఇదే సమయంలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ టాస్క్ ఫోర్స్ క్షేత్రస్థాయిలో పర్యటన ద్వారా ఇచ్చే నివేదికను అమలు చేయడంతో వ్యాధిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. *48 శాతం తగ్గిన సీజనల్ వ్యాధులు* రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది కాలంగా తీసుకున్న ముందస్తు చర్యలతో సీజనల్ వ్యాధులు 48 శాతం మేర తగ్గినట్లు తెలిపారు. 2024 సంవత్సరంలో 5,555 డెంగ్యూ కేసులు రాగా….ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 2,452 కేసులు మాత్రమే వచ్చాయన్నారు. ఈ మేరకు డెంగ్యూ కేసులు 56 శాతం తగ్గాయని తెలిపారు. గత ఏడాది 7,871 మంది మలేరియా బారినపడగా…..ఈ ఏడాది 7,010కి మలేరియా సోకిందన్నారు. మలేరియా కేసుల్లో 11 శాతం తగ్గుదల కనిపించదని వివరించారు. చికున్ గున్యా గత ఏడాది 266 కేసులు రాగా…ఈ ఏడాది 142 వచ్చాయని, చికున్ గున్యా కేసులు 46.5 శాతం తగ్గినట్లు అధికారులు వివరించారు. జపనీస్ ఎన్సెఫాలిటిస్ (JE) కేసులు 11 నుంచి 2కు తగ్గినట్లు తెలిపారు. పరిశుభ్రత పెంపు, సీజనల్ వ్యాధులపై నిరంతర ప్రచారం, విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించడం, ముందు జాగ్రత్తలు కారణంగా సీజనల్ వ్యాధులు 48 శాతం మేరకు తగ్గినట్లు అధికారులు సీఎంకు వివరించారు. *అపరిశుభ్రతే అసలు జబ్బు….ప్రజల్లో చైతన్యం పెంచాలి* అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ….అన్ని శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులను సున్నా స్థాయికి తీసుకురావాలన్నారు. అంతా కలిసి పనిచేస్తే ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చని సీఎం తెలిపారు. సమాజంలో అతిపెద్ద జబ్బు అపరిశుభ్రతే అని….దీన్ని మార్చగలిగితే అనేక వ్యాధులను దూరం చేయవచ్చని సీఎం అన్నారు. అనేక వ్యాధులకు కారణమైన అపరిశుభ్రతను దూరం చేయాలని, ప్రజల్లో నిరంతరం చైతన్యం నింపాలన్నారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధుల నివారణకు మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. సమీక్షలో వైద్యారోగ్య శాఖ సెక్రటరీ సౌరబ్ గౌర్, వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్, ఎన్టీఆర్ వైద్యసేవ సీఈవో దినేష్ కుమార్, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ గిరీశా పాల్గొన్నారు.

విశాఖపట్నం

ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్*

*ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్* *విశాఖ‌ప‌ట్ట‌ణం డిసెంబర్ 10పున్నమి ప్రతినిధి:- * ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్య‌మంత్రి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో సంబంధిత ఏర్పాట్ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్ ప‌రిశీలించారు. జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్ తో క‌లిసి మ‌ధురువాడ ఐటీ హిల్స్ పై సంద‌ర్శించిన ఆయ‌న అక్క‌డ జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను గ‌మ‌నించారు. కాగ్నిజెంట్ కంపెనీకి శంకుస్థాప‌న చేయనున్న ప్రాంతంలో, వీఈఆర్(వైజాగ్ ఎకనామిక్ రీజియన్) స‌మావేశం జ‌ర‌గ‌నున్న ప్రాంతాల్లో అధికారుల‌తో మాట్లాడారు. ఏర్పాట్లు ఎక్క‌డివ‌ర‌కు వ‌చ్చాయో అడిగి తెలుసుకున్నారు. స‌మ‌యం త‌క్కువ ఉన్నందున అధికారులు, నిర్వాహ‌కులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఏర్పాట్ల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని పేర్కొన్నారు. అనంత‌రం హిల్ నెం.3 వ‌ద్దకు నేరుగా ముఖ్య‌మంత్రి చేరుకోకున్న క్ర‌మంలో అక్క‌డ‌ హెలిప్యాడ్ ను ప‌రిశీలించారు. ఆయ‌న వెంట జేసీతో పాటు ఏపీఐఐసీ అధికారులు, కాగ్నిజెంట్ ప్ర‌తినిధులు, స్థానిక రెవెన్యూ అధికారులు ఉన్నారు.

విశాఖపట్నం

జోన్ – 4 లో ఉన్న విజన్ యూనిట్ యాక్షన్ ప్లాన్

*విశాఖపట్నం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి:-* *జోన్ – 4 లో ఉన్న విజన్ యూనిట్ యాక్షన్ ప్లాన్ కార్యాలయంలో దక్షిణ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు వివిధ వార్డుల వార్డుల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు తెలియపరిచి వెంటనే పరిష్కరించాలని తెలియజేశారు. వెంటనే పరిష్కారం కానీ సమస్యలను సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించాలని తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు*…

విశాఖపట్నం

పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించండి.

పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించండి. జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ ఎన్ వి నరేష్ కుమార్. *విశాఖపట్నం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి:- * ప్రజా ఆరోగ్యపు అధికారులు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ.ఎన్.వి నరేష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో జీవీఎంసీ సహాయ వైద్యాధికారులు, శానిటరీ సూపర్వైజర్లు, పలువురు శానిటరీ ఇన్స్పెక్టర్, తో సమీక్ష నిర్వహించగా జూమ్ యాప్ ద్వారా పలువురు శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయం వార్డు శానిటేషన్ ,ఎన్విరాన్మెంట్ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి మాట్లాడుతూ నగరంలో పారిశుధ్యంలో ఎటువంటి అలసత్వం వహించరాదని, ప్రతిరోజు డోర్ టు డోర్ చెత్త సేకరణ క్లాప్ వాహనాల ద్వారా చేపట్టాలని, అధికారులు సిబ్బంది నిర్ణీత సమయానికే విధుల్లో ఉండి పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. అధికారులు ముందుగా సిబ్బంది హాజరును పరిశీలించి వారికి కేటాయించిన ప్రాంతాల్లో విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డుపై పశు సంచారం లేకుండా చూడాలని, పందులు, కుక్కల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలని వెటర్నరి అధికారులను ఆదేశించారు. నగరంలో దోమలు వృద్ధి చెందకుండా ఎప్పటికప్పుడు ఫాగింగ్, స్ప్రేయింగ్ చేపట్టాలని అలాగే ప్రతి శుక్రవారం డ్రైడే పాటించే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పురమిత్ర యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, పౌర సేవలు పొందేందుకు పురమిత్ర యాప్ పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. నగరంలో ఉన్న పలు దుకాణాలకు ట్రేడ్ లైసెన్సలు వసూలు చేయాలని, కొత్తగా ఏర్పాటుచేసిన దుకాణాలను గుర్తించి వాటికి ట్రేడ్ లైసెన్స్ లను విధించి వాటిని వసూలు చేయాలని ఆదేశించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.