Sunday, 15 March 2026

Blog

కామారెడ్డి

స్థానిక సమరంలో ఎన్నికల బహిష్కరణ

కామారెడ్డి, 11 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తండలో స్థానిక సంస్థల ఎన్నికల జోరు మధ్య తండా రాజకీయాలు మండి పడ్డాయి. రెండు తండాల మధ్య సాగుతున్న పంచాయితీ తగాదా చివరికి ఎన్నికల బహిష్కరణ వరకు వెళ్లి, బూథుల వద్ద నిశ్శబ్దం రాజ్యమేలే పరిస్థితి కనిపిస్తోంది. గోకుల్ తండ‌లో బూత్‌లకు తాళం రామారెడ్డి మండలానికి అంచున ఉన్న గూగుల్ తండ గ్రామం, ఈసారి బ్యాలెట్ బాక్సుల కంటే బహిష్కరణ తీర్మానంతో ఎక్కువ హీట్‌ క్రియేట్ చేసింది.గ్రామంలో కింది తండా వాసులు “సమస్య లు తీర్చకుండా, హక్కులు ఇవ్వకుండా ఓటు అడిగే హక్కు మీకెందుకు?” అంటూ ఎన్నికలకు దూరంగా ఉండాలని గ్రామ సభలోనే స్పష్టంగా ప్రకటించినట్లుగా స్థానిక వర్గాలు చెబుతున్నాయి. రెండు తండాల మధ్య పంచాయితీగూగుల్ తండ కు దగ్గరలోని మరో తండాతో కలిసి ఒకే పంచాయ తీగా కలిపిన విధానం పట్ల చిన్న తండా వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల సమయం లోనే తమ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వకుం డా, అభివృద్ధి పేరుతో ఓట్లు మాత్రమే అడిగితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి కంటే బహిష్కరణే బెటరా? చిన్నతండా ప్రాంతంలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, గిరిజన టోలీలకు హౌజింగ్ సదుపాయాలు వంటి కీలక సమస్యలు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని తండా పెద్దలు ఆరోపిస్తున్నారు.ఎన్నికల ముందు రోజుల్లో అధికారులు, నాయకులు తండాకు వచ్చి నా “ముందు G.O. చూపించండి, తర్వాత ఓటు మాట మాట్లాడండి” అంటూ గ్రామస్తులు నేరుగా బహిష్కరణ కార్డు వేసినట్లు స్థానిక సమాచారం. అధికారులు – నేతల పరుగులు వర్చువల్ బహిష్కరణ నిర్ణయం వెనక్కి తీసుకునే లా చేయాలని ఎన్నికల యంత్రాంగం, స్థానిక నేత లు వరుసగా చర్చలు నిర్వహించినా, గోకుల్ తండా వాసులు తమ నిర్ణయాన్ని మార్చే లక్షణా లు కనపర్చలేదని చెబుతున్నారు.వోటు వేసి మళ్లీ ఐదేళ్లు క్యూలో తిరగలేం, ముందుగా హక్కులు… ఆ తరువాతే మీ ఎన్నికలు” అనే భావోద్వేగ నినా దంతో యువత నుంచి పెద్దల వరకు ఒకే స్టాండ్‌లో నిల్చొన్నట్లుగా గ్రామస్థుల వర్గాలు చెబుతున్నా యి. పంచాయతీ ఎన్నికలకు గట్టి హెచ్చరిక గోకుల్ తండ బహిష్కరణ తెలంగాణ గ్రామాల్లో పెరుగుతు న్న అసంతృప్తికి ప్రతీకగా మారుతోంది. ఏకగ్రీవం పేరుతో, ఒత్తిడులతో, వాగ్దానాలతో గ్రామాలను మళ్లీ మోసం చేయొద్దు, సమస్యలు పరిష్కరిస్తే వోటు ఆటోమేటిక్‌గా వస్తుంది” అనే సందేశం ఈ బహిష్కరణ ద్వారా స్పష్టంగా వినిపిస్తోంది.

E-పేపర్

అమ్మ టిఫిన్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ.

ప్రత్తిపాడు, (పున్నమి ప్రతినిధి )డిసెంబర్ 11.. మండలంలోని ప్రత్తిపాడు గ్రామంలో ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన అమ్మ టిఫిన్ సెంటర్ ను పత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి మీద అడుగులు వేయడం చాలా అభినందనీయమని వరుపుల సత్య ప్రభ అన్నారు.

E-పేపర్

తెలంగాణ పంచాయతీ ఎన్నికలో రికార్డు బ్రేకింగ్ ఖర్చు

పున్నమి ప్రతినిధి: తెలంగాణ పంచాయతీ ఎన్నికలో రికార్డు బ్రేకింగ్ ఖర్చు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం నర్కుడ గ్రామంలో ఓటుకు రూ.15000–20000 వరకు పంచుతున్న సర్పంచ్ అభ్యర్థులు గ్రామంలో మొత్తం 4000 ఓట్లు

E-పేపర్

నేడు తెలంగాణలో తొలివిడత సర్పంచ్‌ ఎన్నికలు…

పున్నమి ప్రతినిధి : నేడు తెలంగాణలో తొలివిడత సర్పంచ్‌ ఎన్నికలు… ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు పోలింగ్‌… మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్‌, సాయంత్రం ఫలితాలు… 3,834 గ్రామ పంచాయతీలు, 27,628 వార్డ్‌లకు పోలింగ్‌… బరిలో 12,960 మంది సర్పంచ్‌ అభ్యర్థులు… 37,562 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు… 50 వేల మంది పోలీసులతో భద్రత… 395 గ్రామ పంచాయతీలు, 9,331 వార్డ్‌లు ఏకగ్రీవం…

అన్నమయ్య

ఫలించిన కృషి: NH-716 కడప-తిరుపతి రహదారి అభివృద్ధి పనులు అధికారికంగా ప్రారంభం

రాజంపేట: మన ప్రాంతానికి అత్యవసరమైన కడప-తిరుపతి NH-716 రహదారి దారిలో సంభవిస్తున్న సమస్యలను పరిష్కరించడం కోసం బిజెపి రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ కృషి ఫలించింది. ఈ రోజు ఘనమైన భూమి పూజ కార్యక్రమం, పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లె ఏపీ మోడల్ స్కూల్ వద్ద జరుగగా, రోడ్డు అభివృద్ధి పనులు అధికారికంగా ప్రారంభం అయ్యాయి. మన ప్రాంతపు రహదారులు దారుణ స్థితిలో ఉన్నందున, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను తీర్చడం కోసం సాయి లోకేష్ కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ ఘట్కారి నీ వ్యక్తిగతంగా కలసి,పరిస్థితిని వివరించారు. రాష్ట్రానికి, ప్రజలకు అత్యంత అవసరమైన ఈ రహదారి అభివృద్ధి పనులు కోసం కేంద్రం 100 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. సాయి లోకేష్ దిశానిర్ధేశం, అచంచల కృషి మరియు ప్రజల పట్ల ఉన్న ప్రత్యేక పట్టుదల కారణంగా ఈ ఘన ఫలితం సాధ్యమైంది. భూమి పూజ కార్యక్రమంలో ఆయన నాయకత్వం, శ్రద్ధ, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే సమర్ధత స్పష్టంగా ప్రతిబింబించింది. ఈ రోడ్డు అభివృద్ధి ప్రారంభం, కేవలం ఇసుక మరియు సిమెంట్ మాత్రమే కాదు, ప్రజల జీవన ప్రమాణాలు, సౌకర్యాలు, భద్రతకు కూడా ప్రగతి చిహ్నం.సాయి లోకేష్ వంతు కృషి వల్ల, NH-716 రహదారి భవిష్యత్తులో మరింత సులభమైన, సురక్షితమైన మార్గంగా మారుతుంది అని స్థానికులు సంతృప్తిగా భావిస్తున్నారు. ప్రజలు, విద్యార్థులు, వృద్ధులు, వాణిజ్య వర్గాలు అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో ఈ రహదారి అభివృద్ధి మహత్తర మార్పు తీసుకురాగలదని విశ్వసిస్తున్నారు. ఈ ఘనమైన కార్యక్రమం సాయి లోకేష్ ప్రజల పట్ల అచంచల దృఢనిశ్చయంకి నిలువు సాక్ష్యం.

అన్నమయ్య

హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం

ప్రతి వ్యక్తికి హక్కులు సమానమే వాటిని కాపాడుకోవడం అందరి బాధ్యత అనే సందేశంతో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ వేడుకలను అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి డిఎంసి రోడ్డులో ఉన్న హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కడప అన్నమయ్య ఉమ్మడి జిల్లాల చైర్మన్ డాక్టర్ వి.డేవిడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక సమానత్వం, మానవ విలువలు, హక్కుల పరిరక్షణపై ప్రత్యేక చర్చలు జరిగాయి. ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రతి పౌరుడూ మానవ హక్కుల కాపాడువాడిగా నిలవాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాయలసీమ చైర్మన్ వీరబల్లి జయ కుమార్ రెడ్డి మాట్లాడుతూ “దేశంలోని ప్రతి వ్యక్తి కష్టాల్లో ఉన్నా, పేదైనా, సామాన్యుడైన ఆయనకు జీవించడానికి అవసరమైన మౌలిక హక్కులు ప్రభుత్వం కల్పించాల్సిందే. ఆ హక్కుల కోసం పోరాడడం, వాటి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం మనందరి బాధ్యత” అని అన్నారు. అన్నమయ్య జిల్లా విజిలెన్స్ చైర్మన్ గోపినేని ప్రసాద్ మాట్లాడుతూ “ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అనేక రకాల మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి. వాటిని ఆపడానికి చట్టాలు ఉన్నా… అమలు పటిష్టంగా చేయాలి. మానవ హక్కుల ఉల్లంఘనను ఎవరూ సహించకూడదు” అని నొక్కి చెప్పారు. నందలూరు రైల్వే కన్సల్టెంట్ మెంబర్ రాచూరి మురళి మాట్లాడుతూ “ప్రజలు తమ హక్కులను తెలుసుకుని, వాటిని వినియోగించుకునే దిశగా ముందడుగు వేయాలి. సమానత్వం, న్యాయం, గౌరవం ఇవి మన దేశానికి పునాది” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే స్వచ్ఛంద సేవకులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాగరాజు, సాయి, వెంకటేష్, బన్నీ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అన్నమయ్య

రాజంపేట జిల్లా కేంద్ర సాధన కోసం అన్ని పార్టీల ఏకతాటిపై రిలే నిరాహారదీక్షకు శుభారంభం.నిరాహారదీక్ష శిబిరానికి పూర్తి మద్దతు అందించిన యల్లటూరు శ్రీనివాస రాజు

అన్నమయ్య జిల్లాకు రాజంపేటనే సహజమైన జిల్లా కేంద్రంగా ప్రకటించాలని గళమెత్తుతున్న ప్రజా డిమాండ్ మరింత వేగం అందుకుంది. రాజంపేట జిల్లా కేంద్ర సాధన సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష శిబిరం ఈరోజు రాజంపేట పాతబస్టాండు సర్కిల్ వద్ద ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే ప్రజలు, సంఘ ప్రతినిధులు అక్కడికి తరలివచ్చి, ఉద్యమానికి తమ మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు హాజరై, నిరాహారదీక్ష శిబిరానికి పూర్తి మద్దతు ప్రకటించారు. తన ప్రసంగంలో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించడం మా ప్రజల హక్కు. ఈ ప్రాంతం ప్రజల శ్రేయస్సు, భవిష్యత్తు దృష్ట్యా రాజంపేటనే కేంద్రంగా చేయాలని ప్రభుత్వం తక్షణం నిర్ణయం తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు. ఈ నిరాహారదీక్షకు రాజకీయ పార్టీ పరంగా భేదాభిప్రాయాలు పక్కనపెట్టి అన్ని పార్టీల నాయకులు, ప్రముఖులు ఐక్యంగా హాజరయ్యారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల ప్రతినిధులు అలాగే వివిధ ప్రజా సంఘాలు, విద్యాసంస్థల యజమానులు, వ్యాపారవేత్తలు, యువత, మహిళలతో పాటు ప్రాంతీయ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యంగా,ప్రభుత్వమే ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ జిల్లా కేంద్రం రాజంపేటే కావాలి కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించాలి.అంటూ నినాదాలు మారుమ్రోగాయి. ప్రజలు రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని,తమ న్యాయమైన డిమాండ్ నెరవేరే వరకు శాంతియుతంగా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాజంపేట భౌగోళికంగా, పరిపాలనా పరంగా సహజ జిల్లా కేంద్రమని.ఎన్నో ప్రభుత్వ శాఖలు, సౌకర్యాలు ఇప్పటికే రాజంపేటలోనే ఉన్నాయని ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమం మరింత వేగం రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నాయకులను సందర్శించడం, బహిరంగ సభలు నిర్వహించడం, ఉద్యమాన్ని జిల్లాలో గ్రామాగ్రామానికి విస్తరించేలా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నివేదించారు. అన్నమయ్య జిల్లా ప్రజల ఆశలు, ఆకాంక్షలకు నిలువెత్తు నిదర్శనంగా ఈ రిలే నిరాహారదీక్ష మొదటి అడుగై నిలిచింది. మా జిల్లా కేంద్రం మా హక్కు అన్న నినాదాలతో రాజంపేటలో ప్రజాస్వరం మరింత గట్టిగా వినిపిస్తోంది.

కామారెడ్డి

కామారెడ్డి జిల్లా గ్రామపంచాయతీ ఎన్నికలు: మొదటి విడతలో కలెక్టర్ కఠిన చర్య

కామారెడ్డి, 10 డిసెంబర్,( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లాలో మొదటి విడత గ్రామ పంచా యతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు (10.12. 2025) 10 మండలాల్లో PO/OPO డ్యూటీ అలాట్ అయిన 53 మంది అధికారులు రిపోర్ట్ చేయకపోవడంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.ఎన్నికల నిర్వహణ సడంబరంగా జరగా లంటే అధికారులు సమయానికి హాజరు కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. విధి నిర్లక్ష్యం ఎన్నికల పారదర్శకతకు, నాణ్యతకు ఆటంకం కలిగిస్తుందని హెచ్చరించారు. ఈ చర్య జిల్లా ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేస్తుందని అధికారులు తెలిపారు.కామారెడ్డి జిల్లా ప్రజలు ఈ ఎన్నికల్లో అధిక పోలింగ్ రికార్డు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడతలో 10 మండలాల్లో ఎన్నికలు సజగా జరిగేలా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ షోకాజ్ నోటీసులు ఎన్నికల బాధ్యులందరికీ సమయానికి హాజరు కావాలని గట్టి సందేశం.

నిర్మల్

నేడు గోపాల్ రావ్ డిగ్రీ కళాశాల లో నూతన భవనం నిర్మాణ పనుల నిర్మాణ పనులు సీ పీ డీ సీ పరిశీలన చేయడం జరిగింది.

నేడు గోపాల్ రావ్ డిగ్రీ కళాశాల లో నూతన భవనం నిర్మాణ పనుల నిర్మాణ పనులు సీ పీ డీ సీ పరిశీలన చేయడం జరిగింది…ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చయ్య, సీ పీ డీ సీ అద్యక్షులు డాక్టర్ నాగేష్, కార్యదర్శి మనోజ్ కమార్, నిఖిల్ చెంద్రా భవన నిర్మాణ బాద్యతలు స్వికరించి ఈఈ బార్గవొ, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రఘు నాథ్ద్య అధ్యాపకులు డా పవన్ సార్, పిజి రెడ్డి సార్, భీమ్రావు సార్ ,శంకర్ సార్ , ఆరే రాజు సార్, డాక్టర్ సంతోష్ కుమార్ , రామ్మోహన్, కిషన్, ఇర్ఫాన్, వహీద్ అద్యాపకులు పాల్గొన్నారు..

నిర్మల్

నేడు గోపాల్ రావ్ డిగ్రీ కళాశాల లో నూతన భవనం నిర్మాణ పనుల నిర్మాణ పనులు సీ పీ డీ సీ పరిశీలన చేయడం జరిగింది.

నేడు గోపాల్ రావ్ డిగ్రీ కళాశాల లో నూతన భవనం నిర్మాణ పనుల నిర్మాణ పనులు సీ పీ డీ సీ పరిశీలన చేయడం జరిగింది…ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చయ్య, సీ పీ డీ సీ అద్యక్షులు డాక్టర్ నాగేష్, కార్యదర్శి మనోజ్ కమార్, నిఖిల్ చెంద్రా భవన నిర్మాణ బాద్యతలు స్వికరించి ఈఈ బార్గవొ, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రఘు నాథ్ద్య అధ్యాపకులు డా పవన్ సార్, పిజి రెడ్డి సార్, భీమ్రావు సార్ ,శంకర్ సార్ , ఆరే రాజు సార్, డాక్టర్ సంతోష్ కుమార్ , రామ్మోహన్, కిషన్, ఇర్ఫాన్, వహీద్ అద్యాపకులు పాల్గొన్నారు..

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.