Sunday, 15 March 2026

Blog

కామారెడ్డి

ఎమ్మెల్యే మదన్మోహన్ గెలిచిన సర్పంచ్ వార్డ్ సభ్యులకు ఘన సన్మానం

కామారెడ్డి, 12 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా,ఎల్లారెడ్డి సెగ్మెంట్‌లో కాంగ్రెస్ రామారెడ్డి మండలానికి చెందిన సర్పంచ్‌లకు ఎమ్మెల్యే ఘన సన్మానం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామారెడ్డి మండలం ఎల్లారెడ్డి సెగ్మెంట్‌లో కాంగ్రెస్ జెండా గర్వంగా ఎగురవేసిన పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ఎమ్మె ల్యే మదన్మోహన్‌రావు ఘనంగా సన్మానం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయా న్ని జరుపుకున్న ఈ కార్యక్రమం వైభవంగా జరిగిం ది. ఎమ్మెల్యే మదన్మోహన్‌రావు, ఎల్లారెడ్డి సెగ్మెంట్‌ లో కాంగ్రెస్ జెండా ఎగురవేసి గెలిచిన సర్పంచ్‌లు, సభ్యులు తమ గ్రామాలను అత్యంత వైభవంగా అభివృద్ధి చేసి మోడల్ పంచాయతీలుగా మార్చా లని పిలుపునిచ్చారు. “కాంగ్రెస్ పాలిత పంచాయ తీలు గ్రామాల అభివృద్ధికి ముందంజలో ఉంటా యని ఆశీస్సులు తెలిపారు. మనం కలిసి ఈ సెగ్మెంట్‌ను జిల్లా మోడల్‌గా తీర్చిదిద్దాలి” అని ఆయన స్పష్టం చేశారు.స్థానికులు ఈ సన్మాన కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ, కాంగ్రెస్ నాయకత్వంలో గ్రామీణాభివృద్ధి వేగవంతమవుతుందని ఆశాభా వం వ్యక్తం చేశారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఊపందుకునేలా చేస్తోంది.కాంగ్రెస్ పాలిత పంచాయతీల విజయం ఎల్లారెడ్డి సెగ్మెంట్‌లో గ్రామీణాభివృద్ధికి కొత్త దిశగా మారింది. ఎమ్మెల్యే మదన్మోహన్‌రావు సన్మానం చేసిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు భవిష్యత్‌లో మోడల్ గ్రామాలు రూపొందించేలా కృషి చేస్తారని సంతోషం వ్యక్తం చేశారు.

కామారెడ్డి

ఎమ్మెల్యే మదన్మోహన్ గెలిచిన సర్పంచ్ వార్డ్ సభ్యులకు ఘన సన్మానం

కామారెడ్డి, 12 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా,ఎల్లారెడ్డి సెగ్మెంట్‌లో కాంగ్రెస్ రామారెడ్డి మండలానికి చెందిన సర్పంచ్‌లకు ఎమ్మెల్యే ఘన సన్మానం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామారెడ్డి మండలం ఎల్లారెడ్డి సెగ్మెంట్‌లో కాంగ్రెస్ జెండా గర్వంగా ఎగురవేసిన పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ఎమ్మె ల్యే మదన్మోహన్‌రావు ఘనంగా సన్మానం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయా న్ని జరుపుకున్న ఈ కార్యక్రమం వైభవంగా జరిగిం ది. ఎమ్మెల్యే మదన్మోహన్‌రావు, ఎల్లారెడ్డి సెగ్మెంట్‌ లో కాంగ్రెస్ జెండా ఎగురవేసి గెలిచిన సర్పంచ్‌లు, సభ్యులు తమ గ్రామాలను అత్యంత వైభవంగా అభివృద్ధి చేసి మోడల్ పంచాయతీలుగా మార్చా లని పిలుపునిచ్చారు. “కాంగ్రెస్ పాలిత పంచాయ తీలు గ్రామాల అభివృద్ధికి ముందంజలో ఉంటా యని ఆశీస్సులు తెలిపారు. మనం కలిసి ఈ సెగ్మెంట్‌ను జిల్లా మోడల్‌గా తీర్చిదిద్దాలి” అని ఆయన స్పష్టం చేశారు.స్థానికులు ఈ సన్మాన కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ, కాంగ్రెస్ నాయకత్వంలో గ్రామీణాభివృద్ధి వేగవంతమవుతుందని ఆశాభా వం వ్యక్తం చేశారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఊపందుకునేలా చేస్తోంది.కాంగ్రెస్ పాలిత పంచాయతీల విజయం ఎల్లారెడ్డి సెగ్మెంట్‌లో గ్రామీణాభివృద్ధికి కొత్త దిశగా మారింది. ఎమ్మెల్యే మదన్మోహన్‌రావు సన్మానం చేసిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు భవిష్యత్‌లో మోడల్ గ్రామాలు రూపొందించేలా కృషి చేస్తారని సంతోషం వ్యక్తం చేశారు.

విశాఖపట్నం

రుషికొండ లో నిరుద్యోగయువత సంబరాలు

ఋషికొండ వద్ద నిరుద్యోగ యువత భారీ ఎత్తున చేరి ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. “లాంగ్ లీవ్ చంద్రబాబు… లాంగ్ లీవ్ లోకేష్…” అంటూ జైజైల నినాదాలతో ప్రాంతం మారుమ్రోగింది. ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు రాష్ట్ర విద్య–సాంకేతికశాఖ మంత్రి నారాలోకేష్ ప్రత్యేక కృషితో కాగ్నిజెంట్ సహా తొమ్మిది ప్రధాన సంస్థల శంకుస్థాపన జరగడం యువతకు సంక్రాంతి కానుకగా మారిందని నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేశారు. “విశాఖపట్నం మరొక భారీ సాంకేతిక కేంద్రంగా రూపాంతరం చెందబోతోంది. హైదరాబాద్‌ హైటెక్‌ నగరానికి సమానంగా, విశాఖను నూతన ఆలోచనల నగరంగా తీర్చిదిద్దే పునాది ఇది. శంకుస్థాపన కార్యక్రమాలు భవిష్యత్ భవనాలుగా మారి త్వరలోనే ఉద్యోగాలు అందిస్తాయని ఆశిస్తున్నాం. మా స్వస్థలంలోనే ఉద్యోగాలు లభిస్తే మాకు ఎంతో ఆనందం” అని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ తెలిపారు. గత ప్రభుత్వంలో ఉద్యోగాల గురించి అడిగితే భయభ్రాంతులు, అక్రమ కేసులు మాత్రమే ఎదురయ్యాయని యువత గుర్తుచేసుకున్నారు. “గతంలో జహరిగిన అన్యాయం తెలుసుకున్న చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు” అని హేమంత్ పేర్కొన్నారు. విశాఖను ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేసి, శ్రీకాకుళం నుండి కోనసీమ వరకు ఒక ఆర్థిక మండలి, అమరావతి మరొక మండలి, రాయలసీమ మరో మండలి రూపంలో అభివృద్ధి మార్గం సిద్ధమవుతుండటంపై యువత ఆనందం వెల్లివిరిసింది. అదేవిధంగా, రానున్న ఏడు సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని నారాచంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ప్రకటనతో ప్రాంతమంతా సంబర వాతావరణం నెలకొంది.

తిరుపతి

అఖండ2 చిత్రాన్ని కార్యకర్తలతో వీక్షించిన ఎమ్మెల్యే బొజ్జల

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 12, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ2 చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నటసింహం బాలకృష్ణ నటన అసామాన్యం, తెలుగు సినిమా స్థాయిని పెంచిన అఖండ టీమ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

తిరుపతి

ప్రజా సమస్యల పట్ల అలసత్వం వద్దు… ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 12, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి పట్టణంలోని పంచాయతీరాజ్ అతిధి గృహంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్.) కార్యక్రమంలో ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజల అర్జీలను తానే స్వయంగా స్వీకరించి ప్రజల సమస్యలను పూర్తిగా ఆలకించిన అనంతరం సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ సేవలను మరింత వేగవంతం చేయడానికి సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశిస్తూ.. ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహించిన, నిర్లక్ష్యం చూపినా సహించేది లేదని ప్రజలకు జవాబుదారీగా ఉండటమే మా ప్రభుత్వ సిద్ధాంతంమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

తిరుపతి

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 12, శ్రీకాళహస్తిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం నాడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఆసుపత్రి పైభాగాన నూతనంగా నిర్మాణమైన 50 పడకల గదులను పరిశీలించారు. నూతనంగా అత్యాధునిక పరికరాలతో రోగులకు మరింత వైద్యశాల అందించేందుకు వచ్చిన పరికరాలను పరిశీలించి అవి ఏ విధంగా రోగులకు ఉపయోగపడతాయో ప్రభుత్వ ఆసుపత్రి ఏరియాస్ సూపర్డెంట్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ..శ్రీకాళహస్తిలోని ఏరియా ఆసుపత్రిలో 150 పడకల ఆసుపత్రిగా జిల్లాలోని రెండవ అతిపెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన ఈ ఆసుపత్రికి కొన్ని వస్తువులు లేకపోవడం బాధాకరంగా ఉందని, గతంలో దాతల సహాయంతో దాదాపు కోటిన్నర రూపాయలతో కొన్ని పరికరాలను ఈ ఆసుపత్రికి అందజేశామని ఎంజిఎం హాస్పిటల్ అధినేత మయూర్ ఈ ఆసుపత్రికి 15 లక్షల రూపాయలు విరాళంగా అందజేస్తూ ఈ ఆస్పత్రికి కావలసిన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తానని చెప్పడం హర్షించదగ్గ విషయమని దాతలు ఎవరైన ముందుకు వచ్చి శ్రీ కాళహస్తి ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి తోడ్పడి రోగులకు మెరుగైన సేవలు అందించే అందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం ఎంజిఎం హాస్పిటల్ అధినేత, డాక్టర్ మయూర్ మాట్లాడుతూ.. గతంలో శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి అనేక పర్యాయములు తమ హాస్పిటల్ తరఫున తాము కొన్ని పరికరాలను అందజేశామని అదేవిధంగా కరోనా సమయంలో ఆసుపత్రికి కావాల్సిన మౌలిక సదుపాలతో పాటు కొన్ని విలువైన మందులను ప్రభుత్వ ఆసుపత్రికి అందజేశామని నేడు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పిలుపుమేరకు ఈ ఆసుపత్రికి 15 లక్షల రూపాయల వ్యయంతో కొన్ని మౌలిక సదుపాయాలని కల్పిస్తున్నామని రానున్న రోజుల్లో మరిన్ని సేవలు కూడా ఆస్పత్రికి అందజేస్తామని ప్రాణం విలువ తెలిసిన వ్యక్తిగా తాను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తన వంతు సేవలు ఎప్పుడు అందజేస్తానని శ్రీ కాళహస్తిలో ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి దినధనాభివృద్ధి చెందుతు రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్యం అదే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేస్తామని ఆయన తెలియజేశారు.

తిరుపతి

13న శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ అధ్యక్షునిగా రంగినేని ప్రమాణ స్వీకారం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 12, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజా సేవకు కట్టుబడి, రైతుల అభ్యున్నతిని ధ్యేయంగా పెట్టుకున్న నాయకుడిగా పేరుగాంచిన రంగినేని చెంచయ్య నాయుడు డిసెంబర్ 13న ఉదయం 9 గంటలకు శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, కమిటీ డైరెక్టర్లుగా సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ వేడుకను శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ యార్డ్‌లో అంగరంగ వైభవంగా జరుగనుంది ఇప్పటికే మార్కెట్ యార్డ్ పరిసరాలు వేడుకకు సంబంధించిన ఏర్పాట్లతో మొదలైయిన సందడి. రైతులు,కార్యకర్తలు,ప్రజలు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. రైతు మార్కెట్ అభివృద్ధి, పారదర్శక పాలన, రైతులకు మెరుగైన సేవలందించడమే తన ప్రధాన లక్ష్యమని చెంచయ్య నాయుడు ఇటీవల పేర్కొన్న విషయం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. కార్యక్రమం ప్రత్యేకత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, రాష్ట్ర స్థాయి నేతలు, పార్లమెంట్ సభ్యులు హాజరవ్వడం ఈ వేడుకకు మరింత ప్రతిష్టను తెచ్చింది. ప్రజలందరికీ ఆహ్వానం ఈ ప్రత్యేక సందర్భానికి తెలుగుదేశం కార్యకర్తలు, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, రైతులు, మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నట్లు రంగినేని చెంచయ్య నాయుడు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, రైతు సంక్షేమం, మార్కెట్ నడతలో కొత్త మార్పుల దిశగా ఈ నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని ప్రజలు ఆశాభావంతో ఉన్నారు. ఒక కొత్త ప్రస్థానo డిసెంబర్ 13న జరగబోయే ఈ ప్రమాణస్వీకారం కేవలం ఓ కార్యక్రమమే కాదు శ్రీకాళహస్తి మార్కెట్ వ్యవస్థలో కొత్త దిశ, కొత్త ఆశలు, కొత్త నాయకత్వం ప్రారంభమయ్యే క్షణంమని ఈ చరిత్రాత్మక వేడుకలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని చెంచయ్య నాయుడు అందరినీ ఆహ్వానిస్తున్నారు.

తిరుపతి

రాష్ట్ర వైఎస్ఆర్సిపి యువజన అధ్యక్షునికి ముక్కంటి ప్రసాదాలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 12, శ్రీకాళహస్తి నియోజవర్గ వైకాపా అధ్యక్షులు సురా వారి సురేష్, వైసీపీ పట్టణ యువజన అధ్యక్షులు మల్లెంబాకం ముని కృష్ణారెడ్డిలు శుక్రవారం నాడు వైయస్సార్సీపి కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ ఆత్మీయ సమావేశ కార్యక్రంలో సంయుక్తమగ పాల్గొని సమావేశనంతరం రాష్ట్ర వైఎస్ఆర్సిపి యువజన అధ్యక్షులు జక్కంపూడి రాజా భూమన అభినయ్ రెడ్డిని కలంకారి వస్త్రముతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసన్నాంబికా సమేత శ్రీ వాయు లింగేశ్వర స్వామి తీర్థప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు యువజన విభాగ అధ్యక్షులు గరటారెడ్డి పుదురు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

భూమి అన్యక్రాంతమైందని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యేకి ఫిర్యాదు

తొట్టంబేడు పున్నమి న్యూస్ డిసెంబర్ 12, శ్రీకాళహస్తి నియోజికవర్గ ఎమ్మేల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మా భూమిని ఆక్రమించి మాపై దౌర్జన్యం చేస్తున్నారు న్యాయం చేయండి అంటూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యేకు చోడవరం గ్రామస్తులు ఫిర్యాదు చేస్తూ…ప్రభుత్వం పేదవాళ్లకు పంపిణీ చేసిన భూ పంపిణీలో ఇద్దరు బీసీ మహిళలకు పట్టా పాస్ పుస్తకాలు అందజేశారని అన్ని రికార్డులు తమ పేరు మీద ఉన్నప్పటికీ అదే గ్రామ దళితవాడకు చెందిన సుధాకర్ అనే వ్యక్తి ఆ భూమిని ఆక్రమించుకుని ఇది తన భూమంటూ దౌర్జన్యానికి దిగుతున్నాడని తెలియజేసి వినతి పత్రాన్ని శుక్రవారం నాడు ఎమ్మెల్యేకి అందజేశారు. వేదికలో బాదితులు తెలిపిన వివరాలు తొట్టంబేడు మండలం చోడవరం గ్రామానికి చెందిన బి సుజాత భర్త నాగరాజు పేరుమీద సర్వేనెంబర్ 250/2 లో విస్తీర్ణం 1:50 సెంట్లు, కే వెంకటసుబ్బమ్మ భర్త కే. అంకయ్య పేరుమీద సర్వే నెంబర్ 250/5లో విస్తీర్ణం 1:50 సెంట్లు చొప్పున భూ పంపిణీలో వీళ్ళ పేర్ల మీద ప్రభుత్వం డీకే టీ భూమి పంపిణీ చేశారు. వాళ్లు ఈ పాస్ పుస్తకాలపై బ్యాంకులో రుణాలు కూడా తీసుకుని ఉన్నారు. ప్రభుత్వం అందజేసే పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ వంటి పథకంలో కింద వచ్చే నగదు కూడా వారి బ్యాంకు ఖాతాల్లోని పడుతుంది. అన్ని రికార్డులు ఉన్నప్పటికీ కులం అడ్డం పెట్టుకుని తమ భూమి లోకి రానీయకుండా దౌర్జన్యం చేస్తున్నాడని ఎమ్మెల్యే ముందు వారు మొరపెట్టుకున్నారు. 15 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి రెవెన్యూ అధికారులకు అర్జీలను అందజేసి పరిశీలించాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

తిరుపతి

ఘనంగా స్వాతంత్ర సమరయోధులు సర్దార్ పసుపులేటి సుబ్బరామదాసు జయంతి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 12, శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ పసుపులేటి సుబ్బరామ దాసు 123 వ జయంతి సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీకాళహస్తి ఎండీవో శివ ప్రసాద్, పాల్గొని సంక్షేమ భవనములోగల స్వతంత్ర సమరయోధులు సర్దార్ పశువులేటి సుబ్బరామ దాసు విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్బంగా సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోలా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. సుబ్బరామ దాసు యొక్క విరోచిత పోరాట పటిమ గురించి స్వతంత్ర సమరయోధులను రేపటి తరాలకు వారి ప్రతిభను తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం సంస్థ సభ్యులు ఎం జి బాలాజీ, సిద్ధులు గారి ప్రసాద్, ఉప్పు కృష్ణయ్య, పోలీ సుజాతమ్మ, కోలా సంగీతారావు, వరలక్ష్మి, నరేంద్ర, గిరిరాయల్, చైతన్య, జనార్ధన్, మాధుసూధన్, అనసూయ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.