Sunday, 15 March 2026

Blog

ఖమ్మం

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్ రావు

ఖమ్మం డిసెంబర్ (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్ రావు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్వంచ, చంద్రుగొండ, జూలూరు పాడు, తల్లాడ మండలాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రజలతో నేరుగా మమేకమై పార్టీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీత రామ్ నాయక్, దివ్య శ్రీ, చిలుకూరు రమేష్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలపాలని ప్రజలను కోరారు.

ఖమ్మం

స్మార్ట్ కిడ్జ్ పాఠశాలకు మూడు జాతీయ పురస్కారాలు పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్యకు ఘన సత్కారం:

ఖమ్మం డిసెంబర్ (పున్నమి ప్రతినిధి): ఖమ్మం నగరము లోని స్మార్ట్ కిడ్జ్ పాఠశాల జాతీయ స్థాయిలో మరోసారి తన ప్రతిభను చాటుకుంది. హైదరాబాద్ హై టెక్స్ వేదికగా బ్రెయిన్ ఫీడ్ సంస్థ శుక్రవారం నిర్వహించిన ఆరవ జాతీయ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ రిసోర్సెస్ టెక్ ఎక్స్పో–2025 పురస్కారాల ప్రధానోత్సవంలో స్మార్ట్ కిడ్జ్ పాఠశాలకు మూడు జాతీయ పురస్కారాలు దక్కాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మూడు జాతీయ పురస్కారాలను అందుకున్నారు. స్మార్ట్ కిడ్జ్ పాఠశాలకు స్కూల్ ఎక్సలెన్సీ అవార్డు, ట్రయిల్ బ్లేజర్ అవార్డు లభించగా, పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్యకు బెస్ట్ ఎడ్యుకేషన్ నిస్ట్ అవార్డు వరించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు, వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆశిష్ విద్యార్థి చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందుకోవడం విశేషం. ఈ ఘన విజయంతో విద్యా రంగంలో స్మార్ట్ కిడ్జ్ పాఠశాల కీర్తి మరింత విస్తరించింది. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు సర్వత్రా అభినందనలు వెల్లువెత్తాయి.

ఆంధ్రప్రదేశ్

అభివృద్ధికి చిరునామా ఎంపీ బాలసౌరి : పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్

పెడన నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మచిలీపట్నం ఎంపీ బాలసౌరితో కలిసి పాల్గొన్న పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ అభివృద్ధికి చిరునామా మన ఎంపీ బాలసౌరి అని, నియోజకవర్గంలో ఎటువంటి సమస్య ఉన్న సి ఎస్ ఆర్ నిధులు మరియు ఎంపీ లాడ్స్ నుండి నిధులు మంజూరు చేసి అభివృద్ధికై ఆయన చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని కృష్ణ ప్రసాద్ తెలియజేశారు. అనంతరం ఎంపీ బాలసౌరి మాట్లాడుతూ కృష్ణాజిల్లా మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకొని కృష్ణా నది నుండి ఎనిమిది TMC ల వాటర్ ని తాగునీటికై ఉపయోగించుకునేలా సుమారు 6000 కోట్ల రూపాయలకు DPR తయారు చేశారని,మూడు వేల కోట్ల రూపాయలు జలజీవన్ మిషన్ కింద తీసుకువచ్చి మిగిలిన మూడు వేల కోట్ల రూపాయలు ఒక పార్లమెంట్ సభ్యుడిగా నాబార్డ్, ఏషియన్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ లాంటి ఏదో ఒక బ్యాంకుల నుండి తీసుకువచ్చి ప్రతి ఇంటికి పుష్కలంగా నీళ్లు తీసుకువచ్చేలా ముఖ్యమంత్రి మరియు ప్రధానమంత్రి తో చర్చిస్తున్నామని వారు కూడా సానుకూలంగా స్పందించారని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ బండ్రెడ్డి రామకృష్ణ మరియు వివిధ కూటమి నాయకులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు మండలంలోని కనుపూర్ కెనాల్ కాలువను పరిశీలించిన సర్వేపల్లి ఎమ్మెల్యే

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ 13 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని కనుపూరు కాలువకు సంబంధించిన గేట్ వాల్స్, కాలువ నిర్మాణ పనులను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో పనులు సక్రమంగా చేయకుండానే కోట్ల రూపాయల బిల్లులు దండుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఉపయోగపడాల్సిన సాగునీటి పనులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, నాణ్యత లేని పనుల వల్ల ప్రజాధనం వృథా అయిందని పేర్కొన్నారు పనులు చేయకుండా బిల్లులు ఎవరైతే దండుకున్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మనుబోలు, మడమనూరు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భవిష్యత్తులో కాలువ పనులను సమగ్రంగా పూర్తి చేసి రైతులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చార.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు మండలంలోని కనుపూర్ కెనాల్ కాలువను పరిశీలించిన సర్వేపల్లి ఎమ్మెల్యే

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ 13 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని కనుపూరు కాలువకు సంబంధించిన గేట్ వాల్స్, కాలువ నిర్మాణ పనులను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో పనులు సక్రమంగా చేయకుండానే కోట్ల రూపాయల బిల్లులు దండుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఉపయోగపడాల్సిన సాగునీటి పనులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, నాణ్యత లేని పనుల వల్ల ప్రజాధనం వృథా అయిందని పేర్కొన్నారు పనులు చేయకుండా బిల్లులు ఎవరైతే దండుకున్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మనుబోలు, మడమనూరు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భవిష్యత్తులో కాలువ పనులను సమగ్రంగా పూర్తి చేసి రైతులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చార.

విశాఖపట్నం

యువతకు ఉపాధే కూటమి ప్రభుత్వ లక్ష్యం – పల్లా శ్రీనివాసరావు

గాజువాక : డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) ప్రతిభవంతులైన నిరుద్యోగ యువతి-యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆయన సౌజన్యంతో గాజువాకలో నిర్వహించిన మెగా జాబ్ మేళా ఘన విజయాన్ని సాధించిందని తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో వివిధ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థుల ప్రతిభను పరిశీలించి ఉద్యోగాలు కల్పించడంతో వెయ్యి మంది వరకు యువతకు ఉపాధి అవకాశాలు లభించాయని నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు, టీడీపీ–జనసేన–బీజేపీ ప్రతినిధులు, టి.ఎస్.ఆర్ & టి.బి.కె కాలేజీ యాజమాన్యం, పోలీస్ మరియు జీవీఎంసీ అధికారులు, పాత్రికేయులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. మెగా జాబ్ మేళా విజయవంతమైన నేపథ్యంలో గాజువాక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించి, కార్యక్రమానికి సహకరించిన సంస్థలు, అధికారులు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు పొందిన యువతి-యువకులకు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధాంత లక్ష్మి, 65వ వార్డు టీడీపీ అధ్యక్షులు రట్టి వాసు, గాజువాక నియోజకవర్గ టీడీపీ నాయకులు మొలకపల్లి పెంటయ్య, బుట్ట ప్రకాష్, శ్రీనివాస్ పట్నాయక్, వీయ్యపు అప్పలరాజు, గంగరాజు, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఘనంగా ఐఐఏఎం బిజినెస్ స్కూల్‌లో అల్యూమ్ని మీట్‌–2025

విద్యార్థులు తమ ప్రతిభనుచాటి ప్రపంచంలో భారత్ ని ప్రధమస్థానంలో నిలపాలి. తల్లి దండ్రులు, గురువుల ఋణం తీర్చుకోలేనిది. సినీ యాక్టర్ సుమన్ ఘనంగా ఐఐఏఎం బిజినెస్ స్కూల్‌లో అల్యూమ్ని మీట్‌–2025 జీవితకాలం తమ జీవితాన్ని త్యాగం చేస్తూ అన్నీ తామై ముందుకు నడిపించిన తల్లి దండ్రులను, విద్యా బుద్ధులు నేర్పిన గురువుల ఋణం తీర్చు కోలేమని, విద్యార్థులు తమ, ప్రతిభా, ప్రావిణ్యాలని చాటి ప్రపంచ స్థాయిలో భారత్ ను ప్రధమ స్థానంలో నిలపాలని సినీహీరో సుమన్ అన్నారు. ఎంవీపీ కాలనీలోని’ ఇంటిగ్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్’ (ఐ ఐ ఏ ఎం) క్యాంపెస్ లో ఆదివారంనాడు “అల్యూమిని మీట్ 2025 “లో సుమన్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఐఐఎఎం బిజినెస్ స్కూల్ అధినేత డా. ఎస్ పి రవీంద్ర మాట్లాడుతూ అత్యున్నత విలువలు, ఉన్నతాశయాలతో తన తండ్రి ఆళ్వార్ దాస్ స్థాపించిన తమ విద్యాసంస్థలలో విద్యని అభ్యసించి నేడు అత్యున్నత స్థానాలకెదిగిన 38 బ్యాచ్ లు పాల్గొనడం ఆనందనీయమన్నారు. కార్యక్రమంలో ఐఐఎఎం డైరెక్టర్ జనరల్ ఆచార్య కృష్ణ మోహన్,పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు ప్రతిష్టాత్మకంగా రెండు రోజులు ప్రతి ఏడాది నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు “రీ-యునైట్, ఇంట్రాక్ట్ & హావ్ ఫన్” అనే థీమ్‌తో మళ్లీ పూర్వ విద్యార్థులంతా ఒక చోటచేరి వారి ఎదుగుదలను, అనుభవాలను పంచుకుంటూ, కొత్త అవకాశాలపై చర్చిస్తూ ఆనందోత్సాహాలతో గడిపారు. ఈ మీట్ కోసం నిర్వాహకులు ఐఐఎఎం బిజినెస్ స్కూల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తేజ ముత్యం ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో అధికారిక హ్యాండిల్స్ ద్వారా ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలను అందుబాటులో ఉంచారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వైద్య రంగంలో శర్మ సేవలు మహోన్నతం

డా.ఏ.ఎన్.కే. శర్మ వారి జన్మదిన సందర్భంగా ఫ్రెండ్లీ క్లబ్ సభ్యులకు ఆశీస్సులు. కాట్రేనికోన ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా. ఏ.ఎన్.కే శర్మ 80వ జన్మ దిన సందర్భంగా, డా. శర్మ స్వగృహంలో ఫ్రెండ్లీ క్లబ్ సభ్యులు దుశ్శాలువాతో సన్మానించి వారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆశీస్సులు పొందిన వారిలో ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాపకుడు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి, అధ్యక్షుడు గ్రంధి నానాజీ, ఆకొండి ఉమా మహేష్ శర్మ, వేదుల శ్రీనివాస్, తాతపూడి కృష్ణ, ఆణివిళ్ళ బాలా శ్రీనివాసు, ఆణివిళ్ళ ఫణికాంత్ శర్మ తదితరులు ఉన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అటల్–మోదీ యాత్రను విజయవంతం చేయండి

. బీజేపీ నేత డాక్టర్ ఏలూరి పిలుపు. కాట్రేనికోన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగుతున్న “అటల్ – మోదీ సుపరిపాలన యాత్ర” ఈ నెల 15వ తేదీన ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోకి ప్రవేశించనుంది. ఈ సందర్భంగా నిర్వహించనున్న బస్సు యాత్ర కార్యక్రమానికి ప్రజలు, ఎన్డీఏ కూటమి(బీజేపీ, టీడీపీ, జనసేన) నేతలు, కార్యకర్తలు, హింధూ బంధువులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పూర్తి చేసుకున్న బస్సు యాత్ర ద్వారా పీవీఎన్ మాధవ్ గారు.. అటల్ మోదీ సుపరిపాలనను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారని తెలిపారు. ఒంగోలులో జరుగనున్న ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలన్నారు. మాజీ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారి వాజపేయీ గారి సుపరిపాలన దృక్పథాన్ని మరింత విస్తృతంగా కొనసాగిస్తూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందన్నారు. అటల్ – మోదీ ప్రభుత్వాల సంకల్పాలు, ప్రజలకు అందించిన విజయాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని తెలిపారు. అటల్ – మోదీ పాలనలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, గ్రామీణ రోడ్ల నిర్మాణంతో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగయ్యాయని చెప్పారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, భారత్‌మాల, సాగర్‌మాల వంటి పథకాల ద్వారా రవాణా వ్యవస్థ బలోపేతం అయ్యిందన్నారు. అలాగే డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా పరిశ్రమలకు ఊతమిచ్చి, పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయని వివరించారు. వ్యవసాయ రంగంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకం ద్వారా రైతులకు భరోసా కల్పించామని, సామాజిక రంగంలో ఆయుష్మాన్ భారత్, ఉజ్వల, జల జీవన్ మిషన్ వంటి పథకాలతో కోట్లాది మంది పేదల జీవితాల్లో మార్పు తీసుకువచ్చారని తెలిపారు. దేశ రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇచ్చి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు మరింత విస్తరించాయని తెలిపారు. అభివృద్ధి ప్రతీకగా నిలిచే ఈ అటల్ – మోదీ సుపరిపాలన యాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రజల మద్దతుతో దేశాన్ని మరింత శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈ యాత్ర కొనసాగుతోందని ఏపి బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

నారాయణపేట

కున్సి గ్రామంలో కాంగ్రెస్ నాయకుల జోరు ప్రచారం

క్రిష్ణ మండలం కున్సి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నల్లె శ్రీనివాసులు ,కత్తెర గుర్తుకు ఓటు వేయాలని గడప గడపకి ప్రచారం చేయడం జరిగింది ,గ్రామం లో పలు వార్డు వార్డు తిరుగుతూ ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేసిన పథకాల గురించి వివరిస్తూ ,కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది . ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి నల్లె శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ముందుంటానని , ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తానని ఆయన అన్నారు. ప్రచారం లో పార్టీ కార్యకర్తలు, నలే వెంకటేష్, ఖందొడ్ది నారాయణ, బాడీయల్ శరణ్ బస్వ, ప్రభు గౌడ , ఉల్ల సోము,పల్లె సురేష్, చంద్రశేఖర్, బడియల్ నర్సప్ప,వార్డు మెంబర్ సభ్యులు పాల్గొనడం జరిగింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.