Sunday, 15 March 2026

Blog

ఎన్ టి ఆర్ జిల్లా

హిందూ సమ్మేళనానికి ఆహ్వానం మూలాలకు తిరిగి రావాలంటూ పిలుపు – శాంతి, సేవే హిందూ ధర్మ లక్షణాలు

హిందూ ధర్మం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన జీవన విధానమని, అది హింసపై కాదు శాంతి, సహనం, సేవలపై ఆధారపడిందని హిందూ సమ్మేళన నిర్వాహకులు తెలిపారు. వివిధ కారణాల వల్ల తమ మూల ధర్మానికి దూరమైన వారు తిరిగి హిందూ ధర్మాన్ని అర్థం చేసుకుని, ఆచరించేలా ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. సేవల రూపంలో గానీ, చదువుల రూపంలో గానీ ప్రజలను బలవంతంగా చేర్చుకోవడం ధర్మ లక్షణం కాదని, హిందూ ధర్మం వ్యక్తిగత ఆత్మపరిశీలన, సత్యాన్వేషణకు మార్గం చూపుతుందని వారు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా ఆలోచించే అవకాశం ఇచ్చే ధర్మమే హిందూ ధర్మమని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న హిందూ సమ్మేళనంలో సంస్కృతి, సంప్రదాయాలు, ధార్మిక విలువలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. యువత తమ చరిత్రను, సంస్కృతిని తెలుసుకుని గర్వంగా జీవించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. హిందువుగా జీవించు – హిందువుగా గర్వించు అనే నినాదంతో ఈ సమ్మేళనం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే డా.మొండితోక జగన్ మోహన్ రావు

నందిగామలో శనివారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నందిగామ మాజీ ఎమ్మెల్యే డా. మొండితోక జగన్ మోహన్ రావు ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “చంద్రబాబు ప్రభుత్వం నూటికి నూరు శాతం పిచ్చి ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రజా ప్రయోజనాలు కాదు, కేవలం ప్రైవేట్ ప్రయోజ నాలకే పాలన సాగుతోంది” అని అన్నారు.నందిగామలో ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరో కూడా ప్రజలకు తెలియని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలు, ఆవేదన, పత్తి కొనుగోళ్ల సమస్యలపై ప్రస్తుత ఎమ్మెల్యేకు కనీస అవగాహన లేదని విమర్శించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం ప్రారంభించిన తర్వాతే ప్రభుత్వం కదిలిందని తెలిపారు. కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిధిలో ఇప్పటివరకు మినుములు, పెసలు, అపరాలు ప్రభుత్వం కొనుగోలు చేయలేదని ఆరోపించారు. కపాస్ యాప్ ద్వారా దళారుల దోపిడీపై ప్రశ్నించాకే ప్రభుత్వం నిద్రలేచిందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే రెండు సంవత్సరాల పాలనలో నందిగామకు సాధించింది ఏమిటని ప్రశ్నించారు. గత వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంజూరు చేసిన 100 పడకల ఆసుపత్రిని తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అక్రమ ఇసుక, గ్రావెల్ తవ్వకాల పై ఎమ్మెల్యే–ఎంపీలకు ఉన్న శ్రద్ధ రైతుల సమస్యలపై లేదని విమర్శించారు. రాఘవపురంలో అక్రమ గ్రావెల్ తవ్వకాల వల్ల రెండు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. గత ఐదేళ్ల వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి, మిర్చి, పప్పుధాన్యాల కొనుగోళ్లు జరిగాయని గుర్తుచేశారు. కానీ నేటి కూటమి పాలనలో రైతులకు పట్టించుకునే నాథుడే లేడన్నారు. తమపై గతంలో చేసిన అవినీతి ఆరోపణలను ఇప్పుడు అధికారంలో ఉన్నవారే నిరూపించాలని సవాల్ విసిరారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించ డమే కూటమి ప్రభుత్వలక్ష్యమా అని ప్రశ్నించారు. పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేయడానికే ఈ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజా వ్యతిరేక విధానాల పై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

విశాఖపట్నం

లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభంముఖ్య అతిధి సినీ నటి అనసూయ:

లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభం – ముఖ్య అతిధి సినీ నటి అనసూయ: విశాఖపట్నం డిసెంబర్ 13 పున్నమి ప్రతినిధి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం పరిధి ప్రకాశ రావు పేట లో నూతనంగా ఏర్పాటు చేసిన లక్కీ షాపింగ్ మాల్ ను శనివారం ప్రముఖ సినీ నటి అనసూయ ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో ప్రభుత్వ విప్, పశ్చిమ ఎమ్మెల్యే గణ బాబు, భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాస రావు డిప్యుటీ మేయర్ దల్లి గోవింద రెడ్డి, పైడా విద్యా సంస్థల అధినేత కృష్ణ ప్రసాద్ సి ఎం ఆర్ అధినేత మాఊరి వెంకట రమణ లక్కీ శాపింగ్ మాల్ అధినేతలు స్వామి, శ్రీనివాస్, రత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో శనివారం ఉదయం జిల్లా ఇన్ఛార్జి మంత్రి డా.డోలా శ్రీ‌ బాల వీరాంజనేయ స్వామి, శాసన సభ్యులతో కలసి మీడియా సమావేశం.

*విశాఖపట్నం డిసెంబర్ 13పున్నమి ప్రతినిధి* స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో శనివారం ఉదయం జిల్లా ఇన్ఛార్జి మంత్రి డా.డోలా శ్రీ‌ బాల వీరాంజనేయ స్వామి, శాసన సభ్యులతో కలసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ మంత్రి డా.డోలా శ్రీ‌ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ….విశాఖ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు తొమ్మిది జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రను ఆర్ధికంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారని చెప్పారు. నిన్న విశాఖ పర్యటన కు వచ్చిన ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఇతర మంత్రులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. వచ్చే నెలలో వైజాగ్ బీచ్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నామన్నారు. తొమ్మిది జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సుదీర్ఘంగా చర్చించారని పేర్కొన్నారు. భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ…ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో విశాఖ ముందంజలో ఉందన్నారు. నిన్న తొమ్మిది ఐటీ కంపనీలకు శంకుస్థాపన చేసుకున్నాము. మార్చి నెలలో గూగుల్ కు శంకుస్థాపన చేయబోతున్నామని, గూగుల్ విశాఖ ముఖ చిత్రం మార్చబోతుందని తెలిపారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు విశాఖ వైపుచూస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి రాని పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయి. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి కి సీఎం చంద్రబాబు విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేశారు. గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ… విశాఖ ఎకనామిక్ రీజియన్ తొలి సమావేశం నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిందని తెలిపారు. 36 వేల చదరపు కిలోమీటర్లు పరిధిలో విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటయిందన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ మూలం నీతిఅయోగ్ లక్ష్యాలని, 2031 నాటికి 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిలో ఏడూ గ్రోత్ సెక్టర్లు, 49 ప్రాజెక్టులు, ప్రతి మూడు నెలలకు ఒకసారి విశాఖ ఎకనామిక్ రీజియన్ సమీక్ష ఉంటుందని అన్నారు. రాజకీయాలు ప్రక్కన పెట్టి అభివృద్ధికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను కచ్చితంగా సాధిస్తామన్నారు. కేంద్రాన్ని ఒప్పించి స్టీల్ ప్లాంట్ కు నిధులు తీసుకువచ్చామని, రాష్ట్రం నుంచి నిధులు ఇచ్చామని పేర్కొంటూ, స్టీల్ ప్లాంట్ బలోపేతం చేయడానికి ఈ ప్రభుత్వం ముందుంటుందన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో యజమాన్యం, కార్మికులు బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. విశాఖ ఉత్తర శాసనసభ్యులు విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ…ఎవరు ఊహించని విధంగా విశాఖ అభివృద్ధి చెందుతోందన్నారు . వి ఈ ఆర్ లో 2031 నాటికి 135 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ….విశాఖకు రైల్వే జోన్ వచ్చింది. ప్రేవేటికరణ అవుతుందనుకున్న స్టీల్ ప్లాంట్ కు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఐటీ సంస్థలకు 99 పైసలుకె ఎకరం భూమి ఇస్తున్నారని వ్యాఖ్యలు చేసేవారు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఎకరం భూమి ఒక రూపాయి కె కేటాయించారని తెలిపారు. తక్కువ ధరకు భూములు కేటాయించడం కొత్త కాదు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. ఈ సమావేశంలో ఏపీ గ్రోవర్స్ ఆయిల్స్ సీడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గండిబాబ్జీ, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఒకేరోజు 9 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చరిత్రలో సువర్ణ అధ్యాయం*

*ఒకేరోజు 9 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చరిత్రలో సువర్ణ అధ్యాయం* *విశాఖ ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ* *కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేకనే వైసీపీ నేతల పిచ్చి ప్రేలాపనలు* *విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి* *విశాఖపట్నం డిసెంబర్ 13 పున్నమి ప్రతినిధి * నిన్న విశాఖలో ఒకేరోజు 9 ఐటీ కంపెనీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి లోకేశ్ శంకుస్థాపనలు చేశా రని, ఇది రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో శనివారం ఉదయం జిల్లా ఇన్ఛార్జి మంత్రి డా.డోలా శ్రీ‌ బాల వీరాంజనేయ స్వామి, నగర శాసన సభ్యులతో కలసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా శ్రీ‌ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….విశాఖ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు తొమ్మిది జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రను ఆర్ధికంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారని చెప్పారు. నిన్న విశాఖ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , ఇతర మంత్రులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. వచ్చే నెలలో వైజాగ్ బీచ్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నామన్నారు. తొమ్మిది జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సుదీర్ఘంగా చర్చించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని అన్నారు. ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసినా బుద్ధి రాలేదన్నారు. వైసీపీ నేతలకు చేతనైతే ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలి తప్ప తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి హితవు పలికారు.

విశాఖపట్నం

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం*

*రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం* *ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు చెప్పనవి కూడా అమలు చేస్తున్నాం* *మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి* *విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డా.స్వామి* *విశాఖపట్నం డిసెంబర్ 13పున్నమి ప్రతినిధి* రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం నాడు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తో కలిసి ఇల్ల పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……సెంటు భూముల్లో ఆప్షన్-3 గృహాలు స్వాధీన పత్రాలు అందజేయడంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కృషి అభినందనీయం. మీరు వెళ్లే ప్రాంతాలు కూడా భవిష్యత్తులో అభివృద్ధి చెందుతాయి. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ పై సీఎం చంద్రబాబునాయుడు 9 జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయటానికి సంసిద్ధంగా ఉన్నారు. కేంద్రం ఇచ్చిన ఇల్లు కూడా గత వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. నేడు కూటమి ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణం కోసం అదనంగా ఎస్సీ, బీసీలకు రూ. 50 వేలు, ఎస్టీలకు రూ. 75 వేలు, మరీ వెనుకబడిన వారికి రూ.1 లక్ష చొప్పున సాయం చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నాం. వృద్ధులకు పింఛను రూ. 200 నుంచి రూ. 2 వేలు, రూ.2 వేల నుంచి రూ. 4 వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుదే. పింఛన్ రూ.1000 పెంచడానికి జగన్ కి 5 ఏళ్లు పట్టింది. ఆడపడుచులకు స్త్రీ శక్తి పధకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. దీపం -2 పథకం కింద ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలెండర్ల చొప్పన ఉచితంగా ఇస్తున్నాం. ఇచ్చిన హామీలను అమలుపరుస్తున్నాం. అన్నా క్యాంటిన్లల్లో ఎవరైనా సరే 5 రూపాయలకే భోంచేసే సదుపాయం కల్పించాం. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం. ఆరుగురు పిల్లలున్నవారికి కూడా డబ్బులొచ్చాయి. ఇలా చెప్పినవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. రేపు ఎస్సీ, బీసీలందరికి ఇళ్లపై సోలార్ కరెంటు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.

విశాఖపట్నం

మెగా డీఎస్సీ 2025 లో 52 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు*

*ఏయూ తెలుగు విభాగం ఆల్ టైం రికార్డ్* ,*మెగా డీఎస్సీ 2025 లో 52 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు* *నూతన టీచర్లకు ఆచార్య *జెర్రా అప్పారావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం* *విశాఖపట్నం డిసెంబర్ 13 పున్నమి ప్రతినిధి* ఆంధ్ర విశ్వ కళా పరిషత్ తెలుగు విభాగం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ 2025లో ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 52 మంది ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు దక్కించుకున్నారు.. శనివారం ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా తాజాగా కొలువులు పొందిన 52 మందిని తెలుగు విభాగం శాఖ అధ్యక్షులు ఆచార్య జెర్రా అప్పారావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎ నరసింహారావు పాల్గొని మాట్లాడుతూ 100 ఏళ్ల పండుగ జరుపుకుంటున్న ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న వారంతా ఎంతో ధన్యజీవులు అన్నారు.. యూనివర్సిటీ ప్రారంభించేటప్పుడు తొలుత ఆర్ట్స్ గ్రూపులతోనే ప్రారంభించారన్నారు.. ఆ తర్వాత దశల వారీగా ఏయుని ఎంతోమంది అభివృద్ధి చేశారన్నారు.. నేడు ప్రపంచంలోనే ఆంధ్ర విశ్వ కళాపరిషత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచిందన్నారు.. సభకు అధ్యక్షత వహించిన తెలుగు శాఖ అధ్యక్షులు.. కార్యక్రమం నిర్వాహకులు ఆచార్య జెర్రా అప్పారావు మాట్లాడుతూ ఎంతో మందిని ఈ సమాజానికి అందించిన ఘనత ఏయూకే దక్కుతుందన్నారు.. తన హయాంలో ఏకకాలంలో ఒకే డీఎస్సీలో 52 మంది టీచర్ ఉద్యోగాలు సాధించడం తనకు చిరస్థాయిగా మధురానుభూతిని మిగిలిస్తుందన్నారు.. నూతనంగా కొలువులు పొందిన టీచర్లు అందర్నీ తాను సత్కరించడంతో పాటు భవిష్యత్ తరాలకు మార్గదర్శకత్వం చేయాలని సూచించానన్నారు… ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని అంతకు మించిన గౌరవం లభించేది అన్నారు కాబట్టి ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరు సమాజానికి ఉపయోగపడే రీతిలో విద్యార్థులను తీర్చిదిద్దాలని అప్పారావు కోరారు….. గౌరవ ఆచార్యులు పర్వతనేని సుబ్బారావు.. బహు గ్రంథకర్త.. లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డు గ్రహీత.. గౌరవాచార్యులు వెలమల సిమ్మన్న.. బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ సత్యనారాయణ లు మాట్లాడుతూ తెలుగు విభాగానికి వెలుగులు నింపిన ఘనత ఆచార్య అప్పారావు కే దక్కుతుందన్నారు.. దేశానికి ఎంతోమంది ప్రముఖులు అందించిన ఘనత ఏయు చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నారు.. ఈ కార్యక్రమంలో పద్మాలయ యూనివర్సిటీ తెలుగు విభాగం ప్రొఫెసర్ ఆచార్య మధుజ్యోతి. .. ఏయ్ సీనియర్ ఆచార్యులు గజ్జ యోహాను బాబు.. అంబేద్కర్ యూనివర్సిటీ అధ్యాపకురాలు అన్నం రెడ్డి ఈశ్వరమ్మ..మరో అధ్యాపకురాలు ప్రవీణ.. పలువురు పరిశోధక విద్యార్థులు.. పూర్వ విద్యార్థులు పాల్గొని సందడి చేశారు.. ఏయూ పరిశోధక విద్యార్థి జాతీయ జర్నలిస్టులు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు

విశాఖపట్నం

వైసీపీ దక్షణ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్* మత్స్య కారులకు సహాయం

*చెరలో ఉన్న మత్స్యకారులపై కూటమి నిర్లక్ష్యం*.. *తొమ్మిది కుటుంబాలకు అండగనిలిచిన వాసుపల్లి* *బాధిత కుటుంబాలకి రూ. 45,000 లు, రైస్ బ్యాగ్లు అందజేత* *చెర నుండి విడుదలయ్యే వరకు అండగా ఉంటాం*! *వైసీపీ దక్షణ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్* *విశాఖపట్నం డిసెంబర్ 13 పున్నమి ప్రతినిధి * బంగ్లాదేశ్ లో చిక్కుకుపోయిన నెల్లిమర్ల కు చెందిన 9 మంది మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే రూ.5లక్షలు నష్టపరిహారం ఇచ్చి దైర్యం, భరోసా కల్పించాలని మాజీ ఎమ్మెల్యే, దక్షణ వైసీపీ సమన్వయ కర్త వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఆశీలమెట్ట కార్యాలయంలో 9 మత్స్యకార బాధిత కుటుంబాలకు వాసుపల్లి గణేష్ కుమార్ సొంత నిధులతో ఒక్కో కుటుంబానికి రూ.5000లు చొప్పున రూ.45,000లు అందించడంతో పాటు 25 కేజీల రైస్ బ్యాగ్ ను ఇచ్చి దాతృత్వం చాటుకున్నారు. సాధక బాధలు తెలిసిన తోటి మత్స్యకారుడిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్ననన్నారు. మిత్ర దేశంలో బందీగా ఉన్నవారిని విడిపించడానికి చంద్రబాబుకి మా మత్స్యకారులంటే నిర్లక్ష్యమా? చేతకాని తనమా? అని వాసుపల్లి సూటిగా ప్రశ్నించారు. వైసీపీ హయంలో శత్రుదేశంలో బంధిగా ఉన్న 20మంది మత్స్యకారులను పాకిస్తాను చెర నుండి విడిపించి ఫ్లైట్ లో తీసుకుని వచ్చి.. తీసుకువచ్చి ఒక్కో కుటుంబానికి రూ.5లక్షలు తక్షణ సాయం అందించిన మత్స్యకార పక్షపాతి జగన్ మోహన్ రెడ్డి అని వాసుపల్లి గుర్తుచేశారు. కనీసం నెల్లిమర్ల జనసేన ఎంఎల్ఏ నిస్సిగ్గుగా మాటాడటం సరికాదన్నారు. జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అసలు మత్స్యకారులు ఇంత కష్టంలో ఉంటే కనీసం నోరుమెదపక పోవడం సిగ్గుచేటు అన్నారు. కూటమి లో ఉన్న భాగస్వామ్యం గా ఉన్న బీజేపీ కేంద్ర మంత్రికి చంద్రబాబు ఒక ఫోన్ చేస్తే సమస్య కదిలిఉండేది. కనీసం వారిపై కదలిక లేకపోవడం చంద్రబాబు మత్స్యకారులపై చిన్న చూపుకి నిదర్శనం అన్నారు. 950 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉన్న మనకీ ఎందుకింత దౌర్భాగ్యమన్నారు. బోర్డర్ దాటకుండా అలెర్ట్ చేసే అడ్వాన్స్ టెక్నాలజీ మనదేశంలోని మాత్రమే లేకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైన మత్స్యకారులకు మౌలిక వసతులతో పాటు ఇటువంటివి పునరావృతం కాకుండా కేంద్రం వారికి అండగా నిలవాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ద్వారా 9మంది మత్స్యకార కుటుంబాలకి న్యాయం జరిగేలా వైసీపీ అండగా ఉంటుందని వాసుపల్లి స్పష్టం చేశారు. చెర నుండి విడుధలయ్యే వరకు వారికి రేషన్ కూడా అందిస్తాననని వాసుపల్లి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏరినమ్మ గుడి చైర్మన్ లండ రమణ, జిల్లా జనరల్ సెక్రటరీ గంగళ్ల రామరాజు, జిల్లా సెక్రటరీ బొడ్డు ఆనంద్, బర్రి కొండలరావు, 37 వార్డ్ ప్రెసిడెంట్ ఆకుల యెషు, జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ గుంటూ ఆనంద్, చోడిపిళ్లి శివ, వాసుపల్లి ధనరాజు, జిల్లా వాలంటరీ విభాగం వైస్ ప్రెసిడెంట్ దూడ అప్పారావు, జిల్లా బీసీ సెల్ సెక్రటరీ దూడ తాతారావు, చేపల నూకరాజు(బుడ్డి ),వేణు, కంటుముచ్చు సాగర్,చేపల ప్రసాద్,చేపల సతీష్,30 వ వార్డ్ మహిళా ప్రెసిడెంట్ సూరని రాము,దూడ అప్పలరాజు, 38 వ వార్డ్ ప్రెసిడెంట్ గురజాపు రవి,39వ వార్డ్ ప్రెసిడెంట్ ముజీబ్ ఖాన్,స్టేట్ మేధావుల విభాగం సెక్రెటరీ ఈతలపాక విజయ్, చేపల రాజు,సారిపిల్లి అరుణ,చింతకాయల వాసు జిల్లా సౌత్ మత్స్యకారులు నాయకులు పాల్గొన్నారు

విశాఖపట్నం

సిఐటియు అఖిలభారత మహాసభలు విజయవంతం చేయండి*

*సిఐటియు అఖిలభారత మహాసభలు విజయవంతం చేయండి* *సిఐటియు బీచ్ వాక్* *విశాఖపట్నం డిసెంబర్ 13 పున్నమి ప్రతినిధి * సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) అఖిలభారత మహాసభలు 2025 డిసెంబరు 31 నుండి 2026 జనవరి 4 వరకు విశాఖలో జరుగుతున్న 18వ అఖిలభారత మహాసభలు విజయవంతం చేయాలని విశాఖ జిల్లా సిఐటియు పూర్వ కార్యదర్శి ఎ.అజశర్మ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 6.30 గంటలకు రామకృష్ణబీచ్ ఖాళీమాతా టెంపుల నుండి వైఎంసిఎ వరకు బీచ్వాక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టారు.. ఈ బీచ్వాక్ నుద్దేశించి అజశర్మ పాల్గొని మాట్లాడుతూ ఐక్యత పోరాటం నినాదంతో ఏర్పడిన సిఐటియు దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులను, కార్మిక సంఘాలను ఐక్యం చేసి పోరాటాలు చేపట్టిందన్నారు. దేశంలో కార్మికవర్గ సమస్యలపై నిఖరంగా పోరాడి అనేక విజయాలు సాధించి భారతదేశంలోనే అతిపెద్ద సంఘంగా ఏర్పడిందన్నారు. సిబటియు ఏర్పడి 55 ఏళ్ళ తరువాత ఆంధ్రరాష్ట్రంలో అఖిలభారత మహాసభలు జరుగుతున్నాయన్నారు. విశాఖలో, ఆంధ్రరాష్ట్రంలో కార్మికుల సమస్యలపై ఉద్యమిస్తుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్, డిసిఐ, షిప్యార్డు, బిహెచ్పివి వంటి అనేక ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు కట్టబెట్టే ప్రయత్నాలు అడ్డుకున్న ఏకైక సంఘం సిఐటియు అని అన్నారు. అసంఘటితరంగ కార్మికులు, స్కీం వర్కర్లు వంటి సమస్యలపైన, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలకు నాయకత్వం వహించడమే కాకుండా దేశంలో ఉండే కార్మిక సంఘాలను, మేధావులను, మధ్యతరగతి, ఎన్జిఓ సంఘాలను సైతం ఐక్యవేదికపై తెచ్చి పోరాడుతోందన్నారు. ఎన్నోపోరాటాలు, త్యాగాలు చేసిన సిఐటియు నాయకత్వం విశాఖపట్నానికి రావడం, ఇక్కడ 5రోజులు పాటు మహాసభలు జరపడం విశాఖ కార్మికవర్గానికి ఒకవరం. ఈ మహాసభలను విశాఖ కార్మికవర్గం, ప్రజానీకం సహాయ, సహాకారాలు అందించి విజయవంతం చేయాలని, 2026 జనవరి 4న విశాఖలో వేలాదిమందితో జరిగే ప్రదర్శన, బహిరంగసభలలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.ఎం. శ్రీనివాస్, ఆర్.కె.ఎస్.వి.కుమార్, నాయకులు కె.ఎం.కుమార్ మంగళం, ఎం.జగ్గునాయుడు, కె. లోకనాధం, బి.జగన్, జె. అయోధ్యరామ్, పి.వెంకటరావు, ఎం.సుబ్బారావు, అరుణ్, శ్రీనివాస్, కె.చంద్రశేఖర్, బి. వెంకటరావు నమ్మి రమణ, మాధవి, పద్మ, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

విద్యాశాఖాధికారి (DEO), అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (APC) సమీక్ష

*విశాఖపట్నం డిసెంబర్ 13 పున్నమి ప్రతినిధి* విద్యాశాఖాధికారి (DEO), అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (APC), సమగ్ర శిక్షా విభాగంలోని సెక్టోరియల్ ఆఫీసర్లు, మండల విద్యాశాఖాధికారులు (MEOలు), క్లస్టర్ ప్రధానోపాధ్యాయులతో కలిసి విశాఖపట్నం జిల్లా స్పెషల్ ఆఫీసర్ & KGBV సెక్రటరీ శ్రీ డి. దేవానంద రెడ్డి గారు శనివారం (13-12-2025) వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో Foundational Literacy and Numeracy (FLN) కార్యక్రమంలో భాగంగా అమలవుతున్న 75 రోజుల యాక్షన్ ప్లాన్, 6వ నుండి 9వ తరగతి విద్యార్థుల కోసం సమ్మరీ వీడియోల వినియోగం, అలాగే 10వ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలుపై సమీక్ష నిర్వహించి, పలు కీలక సూచనలు చేశారు. విశాఖపట్నం జిల్లాలోని 506 ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న 1వ నుండి 5వ తరగతి వరకు 25,170 మంది విద్యార్థులకు FLNపై బేస్‌లైన్ టెస్ట్ నిర్వహించగా, వారి అభ్యాస స్థాయిని ఆధారంగా తీసుకుని విద్యార్థులను Sky, Mountain, Stream అనే మూడు విభాగాలుగా వర్గీకరించినట్లు తెలిపారు. అలాగే జిల్లాలోని ప్రతి మూడు ప్రాథమిక పాఠశాలలకు ఒక అడాప్షన్ ఆఫీసర్‌ను నియమించి, ఆయా అధికారులు ప్రతి 20 రోజులకు ఒకసారి మొత్తం మూడు సార్లు పాఠశాలలను సందర్శించి 75 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు విధానాన్ని పర్యవేక్షించాలని సూచించారు. అదేవిధంగా ప్రతి 20 రోజులకు ఒకసారి మొత్తం మూడు సార్లు 20 మార్కులకు డిక్టేషన్ టెస్ట్ నిర్వహించి, విద్యార్థులందరూ మార్చి 2026లో నిర్వహించనున్న ఎండ్‌లైన్ టెస్ట్‌లో FLN లక్ష్యాలను సాధించే విధంగా సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఇంకా మండల స్థాయిలోని హైస్కూళ్లను MEO–I మరియు MEO–IIలకు విభజించి కేటాయించి, 6వ నుండి 9వ తరగతి విద్యార్థులకు సమ్మరీ వీడియోల ప్రదర్శనను సమర్థవంతంగా అమలు చేసే బాధ్యతను MEOలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలోని 10,520 మంది 10వ తరగతి విద్యార్థుల కోసం అమలులో ఉన్న 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా, ప్రతి రోజు సాయంత్రం పరీక్షలు నిర్వహించి, మరుసటి రోజు మధ్యాహ్నం లోగా మూల్యాంకనం పూర్తి చేసి, విద్యార్థుల మార్కుల వివరాలను తప్పనిసరిగా LEAP యాప్‌లో నమోదు చేసే బాధ్యతను సంబంధిత MEOలు స్వీకరించాలని శ్రీ డి. దేవానంద రెడ్డి గారు ఆదేశించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.