Saturday, 14 March 2026

Blog

తిరుపతి

నేడు వైయస్. జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆద్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఉదయం 09:00 గంటలకు శ్రీకాళహస్తి పట్టణం, రామసేతు బ్రిడ్జి (పాత బ్రిడ్జ్, రవి మెస్) వద్ద నుండి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించుబడునని వైకాపా నాయకులు ప్రకటన ద్వార తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి పట్టణ, మండల,ఏర్పేడు మండలం, రేణిగుంట టౌన్, మండలం, తొట్టంబేడు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు,కార్యకర్తలు అనుబంధ విభాగాల సభ్యులు ప్రతి ఒక్కరూ తప్పక పాల్గొనవలసిందిగా వారు పిలుపునిచ్చారు.

తిరుపతి

పోలియో రహిత సమాజ కోసం అందరు కృషి చేయాలని…. డాక్టర్ బాలు

శ్రీకాళహస్తి పట్టణంలోని, శ్రీరామ్ నగర్ కాలనీ యు పి హెచ్ సి హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలు పోలియో రహిత సమాజ కోసం అందరు కృషి చేయాలన్నారు. ఈనెల 21వ తేదీ నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంపై ఆయన మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని పోలియో తీవ్రమైన వైరల్ వ్యధని అది పిల్లల్లో వికలాంగతకు దారితీస్తుందన్నారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో, దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, అంగన్వాడి కేంద్రాల్లో, బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రభుత్వం నిర్దేశించిన ప్రాంతాలలో పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఐదు సంవత్సరాలలో తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజం కోసం కృషి చేయాలన్నారు. తల్లిదండ్రులు మీ సమీప పోలియో బూత్ కేంద్రాలకు వెళ్లి పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. రెండు చుక్కలు_ మీ జీవితానికి రక్షణ అనే నినాదంతో 22,23వ తేదీలలో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నట్లు ఆయన తెలిపారు.

తిరుపతి

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

శ్రీకాళహస్తి మండలంలోని అక్కుర్తి గ్రామంలో శుక్రవారం నాడు శ్రీకాళహస్తి MGM హాస్పిటల్స్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరంలో దాదాపు 150 మంది అక్కుర్తి గ్రామ మహిళలు, ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న 9,10 వ తరగతి విద్యార్ధినులు పాల్గొని వారికి సంబంధించిన స్త్రీ సంబంధిత, ఋతు క్రమ సమయంలో వారు ఎదుర్కొనే సమస్యలు, పరిశుభ్రత పాటించాలనే విషయంపై MGM హాస్పిటల్స్ డాక్టర్ లను అడిగి తెలుసుకున్నారు. ఈ వైద్య శిబిరానికి విజయవాహిని చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు సహాయ సహకారాలు అందించి వైద్య శిబిరం విజయవంతం కావడానికి ప్రత్యేక శ్రద్ద చూపించారు. MGM హాస్పిటల్స్ డైరెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డాక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ…శ్రీకాళహస్తి, చుట్టుప్రక్క గ్రామాల ప్రజలు ఆరోగ్యం కోసం అత్యాధునిక వైద్యసదుపాయాలతో MGM హాస్పిటల్స్ స్థాపించామని ప్రజలు సద్వినియోగ పరచుకొవాలని ఆయన తెలిపారు. ఈ శిబిరంలో MGM హాస్పిటల్స్ స్త్రీ సంబంధిత వైద్యురాలు లక్ష్మి ప్రస, చిన్నపిల్లల సంబంధిత వైద్యులు డాక్టర్ ఉమా మహేశ్వర్ రావు, MGM హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

బాదితులకు సి.యం.ఆర్.యఫ్.చెక్కులు అందజేసిన బొజ్జల బృందమ్మ

శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బొజ్జల బృందమ్మ ఆధ్వర్యంలో తొట్టంబేడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావెళ్ళ ముని రాజా నాయుడు అధ్యక్షతన బాదితులకు CMRF చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయనిధిని అందుకున్నావారు చిన్న కనపర్తి P. రోషన్, రి గుర్రప్ప నాయుడు కండ్రిగ C.రామానాయుడు, శేషమ్మ నాయుడు కండ్రిగ G. జ్ఞాపిక, పూడి చెరుకు నరసింహనాయుడు, గంప మాధవి, వారలకు బొజ్జల బృందమ్మ చేతులమీదుగా అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో యూనిటీ ఇన్చార్జులు లెక్కల మురళి నాయుడు గారు, బాలాజీ, అడ్వకేట్ కమల్, కనపర్తి వాసు నాయుడు, వ్యవసాయం మార్కెట్ కమిటీ డైరెక్టర్ చలపతి, భూతి ఇన్చార్జులు శంకర్ నాయుడు, గుత్తా విజయ నాయుడు, సుశేఖర్ నాయుడు, ఎస్సీ సెల్ నాయకులు కొత్త కండ్రిక రాము, వినోదు, గుర్రప్ప , నందిపాటి పరుశురాం, మెరిమి వెంకటసుబ్బయ్య, చీకటి వేణు, ఈడూరు రామయ్య, ఉప సర్పంచ్ కంచిపల్లి రాజేష్, సీనియర్ నాయకులు చోడవరం చంద్రారెడ్డి ,కాసరం భాస్కర్ నాయుడు, దారపునేని ప్రభాకర్ నాయుడు , రమణారెడ్డి, మంగారెడ్డి , మహిళా అధ్యక్షురాలు కనపర్తి రమాదేవి ,రేణుకమ్మ ,సర్పంచ్ మాధవి ,గోగినేని కుమారి, గ్రామ ప్రజలు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు గౌll శ్రీ పవన్ కళ్యాణ్ గారితో దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు భేటీ*

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు గౌll శ్రీ పవన్ కళ్యాణ్ గారితో దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు భేటీ* *అమరావతి డిసెంబర్ 19విశాఖ పున్నమి ప్రతినిధి* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు గౌll శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మంగళగిరిలోని తన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా ‘వన్ టూ వన్’ సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి గౌll శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. *నియోజకవర్గంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను , ఇప్పటివరకు నెరవేర్చిన హామీలను డి సిఎం గారికి వివరించిన ఎమ్మెల్యే వంశీ గారు* *నియోజవర్గంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని అభ్యర్థన* *సమావేశంలోని ముఖ్య అంశాలు:* *అభివృద్ధి పనుల సమీక్ష* : దక్షిణ నియోజకవర్గం లోఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరును ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎంకు వివరించారు. * *పనుల పురోగతి* : నియోజకవర్గంలో కొనసాగుతున్న పలు మేజర్ పనుల ప్రస్తుత స్థితిగతులు, వాటిని సత్వరమే పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు మరియు సహాయ సహకారాలపై చర్చించారు. *స్థానిక సమస్యలు* : నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లగా, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. వాటిలో ముఖ్యంగా ఎండోమెంటు సమస్యను వివరించారు. **పార్టీ బలోపేతం* : నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ మరియు క్యాడర్‌ను సమన్వయం చేసుకునే అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ రోజు మొత్తం తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు సూచించారు.

విశాఖపట్నం

ఆహార పరిశుభ్రత, నాణ్యతపై తయారీదారులకు శిక్షణ ఇస్తాం.

ఆహార పరిశుభ్రత, నాణ్యతపై తయారీదారులకు శిక్షణ ఇస్తాం. *విశాఖ పట్నం డిసెంబర్ 19పున్నమి ప్రతినిధి*. ఆహార పరిశుభ్రత, వాటి నాన్యాతలపై ఆహార తయారీ దారులకు అవసరమైన శిక్షణ ఇస్తామని విశాఖ పట్నం జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కల్యాణ చక్రవర్తి తెలిపారు. ఇటీవల అమరావతి దరి మంగళగిరిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆహార భద్రతాధికారులకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వీర పాండ్యన్ ఆధ్వర్యంలో ఆహార పరిశుభ్రత, నాణ్యత, భద్రత అనే అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించా రన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో తమకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షకుడు డాక్టర్ దినేష్ ఆహార భద్రతకు సంబంధించిన పలు విషయాలపై శిక్షణ ఇచ్చారన్నారు. నగరంలో ఉన్న హోటల్స్, క్యాటరింగ్ నిర్వాహకులు, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్, పానీ పూరీ బండ్లు, కర్రీ పాయింట్స్, టిఫిన్ సెంటర్స్ తదితర ఆహార తయారీదారులకు పరిశుభ్రత, ముడి పదార్థాల నాణ్యత, ప్యాకింగ్ జాగ్రత్తలు తదితర విషయాలపై త్వరలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తా మన్నారు. ఆహార తయారీ దారులు ఆహార పదార్థాలను తయారు చేసేటప్పడు తలకు క్యాప్, నోటికి మాస్క్ ధరించడం, గోర్లు కత్తిరించు కోవడం, అంటు వ్యాధులు, గాయాలు లేకుండా చూసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం తదితర జాగ్రత్తలు తీసుకోవా లన్నారు. వీటన్నింటి నిర్వహణపై ఆహార తయారీ దారులకు త్వరలో సమగ్ర శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తా మన్నారు. ఆహార తయారీ దారుల ఆధార్ నంబర్స్, ఫోన్ నంబర్స్ తీసుకుని వాటిని తమ వెబ్సైట్ లో నమోదు చేస్తామన్నారు. అనంతరం వారికి శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ కూడా ఇస్తామన్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను వచ్చే నెల విడుదల చేస్తా మన్నారు. గతంలో ప్రైవేట్ వ్యక్తులు కొంత అమౌంట్ తీసుకుని ఇటువంటి శిక్షణ ఇచ్చే వారని, ప్రస్తుతం తామే ఉచితంగా ఈ శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ కూడా ఇస్తామన్నారు. సీనియర్ ఫుడ్ సేఫ్టీ అధికారి జి.వి.అప్పారావు మాట్లాడుతూ ప్రజారోగ్యానికి అవసరమైన ఈ ఆహార భద్రతా శిక్షణను ప్రతి ఆహార తయారీ దారుడు విధిగా తీసుకుని, తామిచ్చే ధృవీకరణ పత్రం పొందాలన్నారు.

విజయనగరం 

అటల్ మోడీ సుపరిపాలన యాత్ర సభ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

*విజయనగరం డిసెంబర్ 19విశాఖ పున్నమి ప్రతినిధి* అటల్ మోడీ సుపరిపాలన యాత్ర సభ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నన్ను ఉఫ రాష్ట్రపతిగా ప్రకటించిన సమయంలో నేను కంటినీరు పెట్టుకున్నాను మంత్రిగా తొలగించి ఉపరాష్ట్రపతి ఇస్తున్నందుకు బాధ పడుతున్నా అని అందరూ అనుకున్నారు చిన్నతనంలో నా తల్లి చనిపోయారు.. కష్టంతో రాజకీయాల్లోకి వచ్చాను బీజేపీ నన్ను తల్లిలా పెంచి పెద్దవాడిని చేసింది.. ఉపరాష్ట్రపతి అయితే.. ఆతర్వాత పార్టీని వీడాలనే ఆలోచన ఆవేదన కలిగించింది ఆతర్వాత నేను ఏపార్టీ కార్యక్రమాలకు వెళ్లలేదు.. మాధవ్ నేతృత్వంలో అటల్ మోడీ సుపరిపాలన యాత్రకు రావాలని నన్ను కలిసి కోరారు నేనే శ్రీకాకుళం, విజయనగరం వంటిప్రాంతాలలో జరిగే సభలకు వస్తా అని చెప్పాను ఏ నాయకుడు అయినా విశాఖ వరకే వచ్చి మీటింగ్ లు పెడతారు. ఓడిపోతారు.. వెళ్లిపోతారు విజయనగరం జిల్లా చాలా మంచి జిల్లా.. ఇక్కడ నుంచి చాలా మంది దేశ నేతలుగా ఎదిగారు ప్రజల్లో ఉంటూ.. ప్రజామోదం కోసం పని చేసే నాయకులు ఉన్నారు రాజకీయాల్లో పదవుల కోసం పోటీ చేయవచ్చు కానీ.. మచ్చ రాకుండా రాజకీయాలుచేసే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు అటువంటి వారిలో అశోకగజపతిరాజు కూడా ముందు వరుసలో ఉంటారు నేను, ఆయన కలిసి పని చేశాం.. ఎటువంటి మచ్చ లేకుండా ఆయన రాజకీయాలు చేశారు నేటు అటల్ జీ సుపరిపాలన దినంగా డిసెంబర్ 25న భారీ కార్యక్రమం చేస్తున్నారు దేశానికి అవసరమైన మంచి పాలన సురిపాలన.. అట్టడుగున ఉండే వ్యక్తికి అవకాశం కల్గించే పాలన సుపరిపాలన ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా వారి సంక్షేమం గురించి ఆలచన చేయడం మహిళలపై అత్యాచారు లేకుండా, అరాచకాలు, దౌర్జన్యాలులేకుండా ఉండటం సుపరిపాలన వేదింపులు లేకుండా ఉండే ప్రభుత్వాన్ని సుపరిపాలన అంటారు దేశం కోసం సర్వతోముఖాభివృద్ది కోసం పని చేయడాన్నిసుపరిపాలన అంటారు ఇటువంటి సుపరిపాలనకు వాజ్ పేయ్ శ్రీకారంచుట్టారు కాంగ్రెస్ యేతర తొలి ప్రధానిగా, విలువతో రాజకీయాలు చేశారు ఒక్క అవినీతి మచ్చ లేకుండా పాలన సాగించిన ఏకైక నేత వాజ్ పేయ్ ఈ దేశం మొత్తం ఒక్కటే అని భావన కలిగించేలా పాలన సాగించారు జాతీయ రహదారుల నిర్మాణాలను ప్రవేశ పెట్టిందీ వాజ్ పేయ్ గోల్డెన్ క్వాడిలేటర్లు మనకు పరిచయం చేసిన నేత వాజ్ పేయ్ టెలికం, పోర్టు, పొటిలికల్, హైవేల కనెక్టివీటీలు తెచ్చిన మహనీయుడులు దేశంలో 32 పార్టీలను ఏకం చేసి.. ఒకతాటిపైకి తెచ్చి దేశాన్ని పాలించారు ఆయన చూపించిన ఐకమత్యం, పరస్పర విశ్వాసం, ప్రజల కోసం చేసిన మంచిని గుర్తు చేసుకోవాలి మనం చేసే పని, వేసే అడుగు.. అట్టడుగు వారికి మేలు జరిగేలా ఉండాలి ప్రజలపై దాడులు, దారుణాలు, అత్యాచారాలు జరగకుండా ఉండటమే సుపరిపాలన అంటారు ఆయన విగ్రహాలుపెట్టి నమస్కారం పెట్టడం కాదు.. ఆయన చూపిన సుపరిపాలనను మన పదవుల ద్వారా అమలు చేసి చూపాలి బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు తప్పకుండా వాజ్ పేయ్ గురించి తెలుసుకుని.. ఆ విలువలను ఆచరించాలి ఈ మూడు పార్టీల నేతలు నేడు చాలా చక్కగా మాట్లాడుతున్నారు.. సంతోషం అనిపించింది నేను రాజకీయాల్లో లేను.. నేను వాజ్ పేయ్ తో ఉన్న అనుబంధం కారణంగా వచ్చాను నేను పదవీ విరమణ చేశాను.. పెదవీ విరమణ చేయలేదు కాబట్టి మాట్లాడుతూనే ఉంటాను నేను 16వ యేట రాజకీయాల్లోకి వచ్చాను.. పోల్స్ ఎక్కి జెండాలు కట్టేవాడిని ఆరోజు జట్కా బండి ఎక్కి అభ్యర్దులను గెలిపించాలని ప్రచారం చేసే వాడిని వాజ్ పేయ్ గురించి గోడల మీద రాసి, మైకుల్లోప్రచారంచేసి, ఆయనకు సహాయకుడిగా ఉన్న వ్యక్తి.. అదే వాజ్ పేయ్, అద్వానీ మధ్య అధ్యక్షుడి హోదాలో కూర్చునే అవకాశం నాకు మాత్రమే వచ్చింది అదీ బీజేపీ గొప్పతనం.. పని చేసేవారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలకు ముందు క్రమశిక్షణ ఉండాలి, తర్వతా సమయ పాలన పాటించాలి, ఆలస్యంగానే వస్తేనే గొప్ప అనుకునే నాయుకులు కూుడా మన దగ్గర ఉన్నారు మన వ్యక్తిగత జీవితంలో ఇతరులకు ఆదర్శంగా ఉండేలా పని తీరు ఉండాలి అప్పర్ క్యాస్ట్, లోయర్ క్యాస్ట్ అని వేర్వేరుగా చూడటం మానుకోవాలి రాజకీయ పార్టీ కార్యకర్తలు బెదిరింపులకుపాల్పడ కూడదు, ఆక్రమణలకు పాల్పడకూడదు అటల్ బీహారీ వాజ్ పాయ్ సాదారణ వ్యక్తి నుంచి ప్రధానిగా అయ్యారు శ్యాంప్రసాద్ ముఖర్జీతో కలిసి కాశ్మీర్ ఉద్యమంలో వాజ్ పేయ్ పాల్గొన్నారు ప్రతిపక్ష నేతగా, ప్రధానిగా, బీజేపీకి అఖిలభారత అధ్యక్షుడిగా ఏపదవి చేపట్టినా.. దానికి వన్నె తెచ్చాడు నేడు ఏపార్టీ నాయకులైనా వాజ్ పేయ్ చూపిన నీతి, నియమాలు, విలువలను పాటించాలి ఆయన ప్రధాని అయ్యాక మెజారిటీ కి ఒక్క ఓటు తక్కువ అయ్యిందని మేము మాట్లాడుకుంటున్నాం ఏదొక రకంగా అనేది వద్దు.. నేరుగా మద్దతు ఇస్తే ఓకే..లేదంటే పదవి వదిలేస్తానని వాజ్ పేయ్ చెప్పారు ఆయన దార్శనికుడు, కవి, సమున్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఆయన కృత్వం, మితృత్వం, తో అందరినీ ఆశ్చర్యపరిచేవారు బీజేపీని అంచలంచెలుగా నిర్మాణం చేసిన వ్యక్తి వాజ్ పేయ్ సుపరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిన వ్యక్తి వాజ్ పేయ్ ఎకౌంట్ బులిటీని అమలు చేసిన వ్యక్తి వాజ్ పేయ్ నేడు ఉన్న పాలకులు కూడా జనాలకు ఏం చెప్పాం.. ఏం చేస్తున్నామనే ఎకౌంట్ బులిటీ ఉండాలి ఆఖరి ఫంక్తలో ఉన్న వ్యక్తికి సాయం అందుతుందా లేదా అనేది చూడాలి డిపీటీ పధకాన్ని మోడీ తీసుకు వచ్చి.. నేరుగా ఎకౌంట్లలో వేస్తున్నారు గతంలో నిధులు ఇస్తే.. చేతులు మారే లోపు సగం అన్యాక్రాంతం అయ్యేవి మీకు రావాల్సిన పెన్షన్, స్కాలర్ షిప్, సాయం అన్నీ కూడా ఇప్పుడు మోడీ ఖాతాల్లో వేస్తున్నారు విశాఖతో నాకు సంబంధం ఉంది.. ఈ ఊర్లో 17 నెలలు జైల్లో ఉన్నాను చలపతిరావు ఎమ్మెల్సీగా నిలబడితే.. నేను ఆయన విజయానకి కృషి చేశాను నేను ఇప్పుడు వాకింగ్ చేస్తుంటే.. ఎవరూ వచ్చి డిస్టబ్ చేయరు అంత చక్కని సంప్రదాయంకలిగిన ఉత్తరాంధ్ర జనాలకు నా అభినందనలు సర్పంచ్ నుంచి ప్రధాని వరకు ఏ లెవల్ ఉన్న వారైనా చివరి లబ్దిదారుడి వరకు సాయం అందాలి రాజకీయాల్లో ఉన్న వారు తెల్ల బట్టలు వేసుకున్నంత స్వచ్చందంగా ఉండాలి ఇసుక, మైనింగ్, వంటివాటిలో ఎమ్మెల్యే కు ఏంటి సంబంధం మనం ఇల్లు కట్టుకుంటే స్థానిక కార్పోరేటర్ అనుమతి ఎందుకు నిబంధనల మేరకు నిర్మాణాలు ఉంటే అనుమతి ఇస్తారు జనం చేత మాట పడకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి రాజకీయాల్లో మనకు శత్రువులు ఉండరు.. మన ప్రత్యర్దులు మాత్రమే మంచి భాషను ఉపయోగించాలే తప్ప… నోటికొచ్చినట్లు దూషించకూడదు ఈ మధ్య కొంతమంది పచ్చి బూతులు మాట్లాడుతున్నారు.. అటువంటి వారికి బూత్ లలోనే సమాధానం చెప్పాలని మహిళలకు చెప్పా మొన్న ఎన్నికలలో ఆ బూతులు మాట్లాడే వాడు ఒక్కడు కూడా గెలవలేదు వారి బూతులు చూసి ప్రజలే అసహ్యించుకుంటున్న పరిస్థితి వాజ్ పేయ్ ప్రధానిగా,ప్రతిపక్ష నేతగా ప్రత్యర్దులను గౌరవించేవారు కాబట్టే అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు ఈ మధ్య రాజకీయాలలో కొత్త ఫ్యాషన్.. నీతో పాటు, నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లు, అమ్మలను తిడుతున్నారు ఇంత దౌర్భగ్యానికి ఎందుకు దిగజారుతున్నారో నాకు అర్దం కావడం లేదు ఇది ఏమాత్రం మంచిది కాదు.. దీనిని అందరూ మార్చుకోవాలి వాజ్ పేయ్ కు సహాయకుడిగా ఉన్న నేను.. వారి మధ్యలోకూర్చున్నా అంటే.. పని చేసే వారిని ఎలా పైకి తెస్తారో నేనే ఉదాహరణ దేశంలో ఎటువంటి కనెక్టివీటిలకు అయినా అద్యుడు వాజ్ పేయ్ నేను గ్రామీణ అభివృద్ది శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జాతీయ రహదారులఅభివృద్ది చేశారు నేను గ్రామాలలో కూుడా రోడ్డులు వేస్తే బాగుంటుందని వాజ్ పేయ్ ను కోరా ఆర్ధిక మంత్రితో మాట్లాడాలని సూచిస్తే.. నేను వెళ్లి ఆయనకు వివరించా జాతీయ రహదారులకు టోల్ ఉంటుంది.. గ్రామాలలో టోల్ పెడితే టోల్ తీస్తారని చెప్పారు నేను మళ్లీ వాజ్ పేయ్, అద్వానీ దగ్గరకు వెళ్లి గ్రామాలలో రోడ్ల గురించి అడిగా క్యాబినెట్ లో ఈ అంశం చర్చకు పెడతా.. అప్పుడు నీదోరణలో చెప్పు అని వాజ్ పేయ్ సూచించారు ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కు ఆనాడు క్యాబినెట్ లో ఆమెదం లభించింది రోడ్లు లేకపోతే అధికారి నుంచి ప్రజాప్రతినిధుల వరకు యాక్టర్, డాక్టర్ కూడా రారని చెప్పా నా రాజకీయ జీవితంలో ఈపధకం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది ఐదు వేలు జనాభా తర్వతా రెండు వేల జనాభా ఉన్న గ్రామాలకు రోడ్లు వేశాం ప్రజలకు ఏది అవసరమో.. అత్యంత ప్రాధాన్యమో నేతలు ఆపనులు ముందు చేయాలి వాజ్ పేయ్ ప్రసంగాలు చాలా అద్బుతంగా ఉండేవి.. ప్రతి కార్యకర్త చక్కగా మాట్లాడే దోరణిని అలవాటు చేసుకోవాలి రాజకీయాల్లో వ్యక్తిత్వ వైరంపెట్టుకోకూడదు.. వాజ్ పేయ్ ఎప్పుడు అపశబ్దాలకు పాల్పడలేదు అందుకే ఆయన అందరికీ అజాత శత్రువుగా పేరు గాడించారు రాజ్యంగం పట్ల అంకిత భావం, అందరినీ కలుపుకుని వెళ్లడం లో వాజ్ పేయ్ ను ఆదర్శంగా తీసుకోవాలి పార్లమెంట్ లో ఆయన ప్రదర్శిచిన తీరు, విమర్శలను కూడా చిరునవ్వుతో స్వీకరించడం వాజ్ పేయ్ గొప్పతనం ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని.. గెలుపుకు బాటలు నిర్మించుకోవాలి ఒక్క ఓటు తో పదవి పోయినా.. హుందాగానే వ్యవహరించారు.. అధికారంకోసం అడ్డదారులు తొక్కకూడదు విలువలతో రాజకీయాలు చేయాలనేది వాజ్ పేయ్ ను చూసి తెలుసుకోండి వాజ్ పేయ్ జీవితాన్ని పాఠ్య పుస్తకాల్లో ఒక అంశంగా చేర్చాలి నేటి తరం, భవిష్యత్ తరం కూడా వాజ్ పేయ్ జీవిత చరిత్రను తెలుసుకోవాలి అప్పుడే మంచి రాజకీయ నేతలు సమాజం నుంచి వస్తారు వాజ్ పేయ్ చూపిన దారిలోనే దేశంలో, రాష్ట్రంలో పాలన సాగుతుంది 2047 కి వికసిత భారత్ సాధనకు ప్రధాని, సీఎంతో అయ్యేది కాదు ప్రజలంతా వారికి అండగా ఉంటే..

విజయనగరం 

అటల్ మోడీ సుపరిపాల యాత్ర ద్వారా ఏపీలో 26జిల్లాల్లో వాజ్ పేయ్ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నాం

*విజయనగరం డిసెంబర్ 19 విశాఖ పున్నమి ప్రతినిధి* *బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవియన్ మాధవ్* అటల్ మోడీ సుపరిపాల యాత్ర ద్వారా ఏపీలో 26జిల్లాల్లో వాజ్ పేయ్ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నాం ఆయన గొప్పతనంతో పాటు, మోడీ అందిస్తున్న సుపరిపాలను వివరించేలా సభలు ఏర్పాటు చేశాం వాజ్ పేయ్ గురించి అన్ని విధాలా తెలిసిన వ్యక్తి.. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉంటూ శభాష్ అనిపించుకున్న వ్యక్తి మన తెలుగు వారు వెంకయ్యనాయుడు వాజ్ పేయ్, వెంకయ్యనాయుడు, మోడీలకు సారూప్యత ఉంది వారంతా సామాన్య కుటుంబం నుంచి వచ్చి తమ కృషితో ఎదిగిన వ్యక్తులు వాజ్ పేయ్ కోసం పని చేసిన వెంకయ్యనాయుడు.. ఆతర్వాత కేంద్రగ్రామీణ అభివృద్ది శాఖ మంత్రిగా వాజ్ పేయ్ కలలను నెరవేర్చారు మోడీ ఆలోచనలను కూడా ఆతర్వాత వెంకయ్యనాయుడు ముందుకు తీసుకు వెళ్లారు ఈ కార్యక్రమానికి రావడానికి వెంకయ్యనాయుడు ఎంతో శ్రమ తీసుకున్నారు మా నాన్న గారు చలపతిరావుగారు, వెంకయ్యనాయుడుగారు కలిసి పని చేశారు ఈ యాత్రలో సభలో వెంకయ్యనాయుడు పాల్గొనడం నిండుదనాన్ని ఇచ్చింది అటల్ జీ సామాన్య కుటుంబంలో పుట్టి… స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని జైలుకు వెళ్లారు ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా.. తన జీవితాన్ని భారతదేశ సేవకు అంకితం చేశారు దేశ విభజన మరోసారి జరగకూడదని భారతీయ సంఘ్ ఏర్పాటు చేశారు 1962 లో చైనా యుద్దానికి రావడంతో.. మనం కొంత వెనుక బడాల్సి వచ్చింది మన దేశం అణుశక్తిగా ఎదగాలని చెప్పినా.. ఎవరూ వినలేదు వాజ్ పేయ్ చెప్పిన అంశం నిజమని… నెహ్రూ కూడా ఆతర్వాత మద్దతు ఇచ్చారు 1998 లో వాజ్ పేయ్ ప్రధాని అవగానే అణు విస్పోటనం చేసి.. భారతదేశాన్ని అణుబాంబు శక్తిగా మార్చారు మన దేశం నేడు సురక్షింతగా ఉందంటే అది వాజ్ పేయ్ ముందు చూపే కారణం మధుర లో తన ఓటమిని కూడా పాజిటీవ్ గా తీసుకున్నారు. రాజా ప్రతాప్ సింగ్ చేతిలో ఓడినందుకు గర్విస్తున్నా అని చెప్పారు నిన్న వికసిత్ భారత్ గ్రామీణ రోజ్ గార్ పధకాన్ని మోడీ పార్లమెంట్ లో తీసుకువచ్చి, 125రోజుల పని దినాలు కల్పిస్తున్నారు అనేక అభివృద్ది పనులకు గ్రామీణ ఉపాధి హామీ పధకాన్ని అనుసంధానం చేస్తున్నారు వాజ్ పేయ్ ఆనాడు ప్రారంభించిన ఈ పధకాన్ని మరింత ముందుకు మోడీ తీసుకు వెళ్లారు వాజ్ పేయ్ చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పధకాలను మోడీ అమలు చేస్తున్నరాు వాజ్ పేయ్ జయంతిని గుడ్ గవర్నెన్స్ గా ప్రకటించి కార్యక్రమాలు చేస్తున్నారు 70 యేళ్లా సామాజిక జీవితంలో 60 యేళ్లు పార్లమెంటెన్ గా ఆయన జీవితం ఆదర్శం ఆయన ఆలోచనలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా సుపరిపాలన యాత్ర చేపట్టాం డిసెంబర్ 25న జయంతి సందర్భంగా అమరావతి వాజ్ పేయ్ స్మృతి వనాన్ని ప్రారంభిస్తున్నాం సీఎం చంద్రబాబు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు దేశంలో పొలిటికల్ కనెక్టివిటీ ఏర్పాటుచేసిన నేత వాజ్ పేయ్ మోడీ సారధ్యంలో కూడా యన్డీఎ పక్షాల సారధ్యంలో దేశం, రాష్ట్రం అబివృద్ది చెందుతుంది

విశాఖపట్నం

ఢిల్లీలో ఒక మాట – గల్లీలో ఇంకో మాట..పీపీపీపై జగన్ రాజకీయ నాటకం*

*ఢిల్లీలో ఒక మాట – గల్లీలో ఇంకో మాట..పీపీపీపై జగన్ రాజకీయ నాటకం* *కమీషన్లు పోతాయనే పీపీపీపై జగన్ ఉలిక్కిపాటు* *పీపీపీకి మద్దతిస్తే అరెస్టులా? జగన్ రెడ్డి బెదిరింపులపై ఘాటు గా స్పందించిన టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు* *విశాఖపట్నం డిసెంబర్ 19పున్నమి ప్రతినిధి* పీపీపీ విధానానికి మద్దతిచ్చిన వారిని అధికారంలోకి వచ్చిన వెంటనే అరెస్టు చేస్తామని జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రత్యక్ష దాడి అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఘాటుగా మండిపడ్డారు. మనం డా.బీఆర్ అంబేడ్కర్ గారు రచించిన రాజ్యాంగంలో జీవిస్తున్నాం. నీ తాత రాజారెడ్డి రాసిన రాజ్యాంగంలో కాదు అంటూ జగన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్–ప్రైవేట్ కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ప్రపంచం మొత్తం అంగీకరిస్తుంటే, పీపీపీకి మద్దతిచ్చిన వారిని జైలుకు పంపుతామని బెదిరించడం నియంతృత్వ ఆలోచనలకు పరాకాష్ట అని విమర్శించారు. ప్రజల చేతిలో ఇప్పటికే గుణపాఠం నేర్చుకున్నప్పటికీ జగన్ ఇంకా మారలేదని, అదే అహంకారంతో మళ్లీ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. పీపీపీకి మద్దతిచ్చిన వారిని అరెస్టు చేస్తామని భయపెట్టడం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నవారిని జగన్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. గత వైసీపీ పాలనలోనే అనేక పరిశ్రమలు రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయని గుర్తు చేశారు. జగన్ తాటాకు చప్పుళ్లకు ఎవరు జడిచేది లేదని, చట్టాలు ఎవరు అతిక్రమించినా జైలు ఊసలు లెక్కించాల్సిందేనని పల్లా గారు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో జగన్‌కు బుద్ధి చెప్పారని, రానున్న ఎన్నికల్లో మరోసారి గట్టి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. గవర్నర్ వద్దకు తీసుకెళ్లిన ఒక కోటి సంతకాలు నిజమైతే, వాటికి సంబంధించిన ఆధార్ కార్డు వివరాలను మీడియాకు ఎందుకు బహిర్గతం చేయడం లేదని పల్లా గారు ప్రశ్నించారు. ఢిల్లీలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు వైసీపీ ఎంపీలు పీపీపీ మోడల్‌కు మద్దతు ఇచ్చి, రాష్ట్రానికి వచ్చాక దానికే వ్యతిరేకంగా ఫేక్ ఉద్యమాలు చేయడం డిల్లీలో ఒక మాట – గల్లీలో ఇంకో మాట అనే జగన్ రాజకీయ నాటకానికి నిదర్శనమన్నారు. పీపీపీ విధానం ప్రైవేటీకరణ కాదని, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేస్తున్న విధానమని పల్లా గారు స్పష్టం చేశారు. పీపీపీ విధానంలో నిర్మించే మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల పేరుతోనే నడుస్తాయని, వాటి యాజమాన్యం, పరిపాలన, పర్యవేక్షణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయని తెలిపారు. అడ్మిషన్లు, ఫీజు నిర్మాణం, సేవల ప్రమాణాలు అన్నీ ప్రభుత్వమే నిర్ణయిస్తుందని, ప్రైవేట్ భాగస్వామికి ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశం లేదన్నారు. ఈ కాలేజీల్లో 70 శాతం పడకలు ఎన్టీఆర్ వైద్య సేవలు, ఆయుష్మాన్ భారత్ పథకాల లబ్ధిదారులకే కేటాయిస్తారని, దీని ద్వారా పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జగన్ పాలనలో మెడికల్ కాలేజీల పేరుతో కేవలం రూ.1,400 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అవి కూడా కేంద్ర నిధులేనని పల్లా గారు గుర్తు చేశారు. ఇప్పుడు రూ.3,000 కోట్లు ఖర్చు చేశామని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. రూ.450–500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించినప్పుడు పేదల ఆరోగ్యం, సంక్షేమం ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. అదే డబ్బుతో కనీసం రెండు మెడికల్ కాలేజీలు నిర్మించవచ్చని, కానీ ప్రజలకు ఉపయోగం లేని వైట్ ఎలిఫెంట్‌గా రుషికొండ ప్యాలెస్ మిగిలిందని విమర్శించారు. మీ సాక్షి పత్రికే రుషికొండకు రూ.450 కోట్లు ఖర్చయిందని రాసిందని, ఇప్పుడు రూ.230 కోట్లు అని ఎందుకు అబద్ధాలు చెబుతున్నారని నిలదీశారు. మిగిలిన డబ్బు ఎవరికి కమీషన్లుగా వెళ్లిందో చెప్పాలని డిమాండ్ చేశారు. నీ పాలనలోనే 104, 108 సేవలను ప్రైవేటైజ్ చేశావని, ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయినప్పుడు ప్రజల ఆరోగ్యం గుర్తుకు రాలేదా జగన్ రెడ్డి? అని ప్రశ్నించారు. 2014–19లో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అమరావతి, పోలవరం, పరిశ్రమలను అక్కసుతో నాశనం చేసిన నువ్వు ఇప్పుడు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిదని పల్లా గారు మండిపడ్డారు. రుషికొండపై చూపిన ప్రేమను నర్సీపట్నం మెడికల్ కాలేజీపై చూపి ఉంటే అది ఇప్పటికి పూర్తయ్యేదని అన్నారు. 30 ఏళ్లు పట్టే మెడికల్ కాలేజీలను కేవలం రెండేళ్లలో పూర్తి చేసే పీపీపీ విధానాన్ని ఎందుకు అడ్డుకుంటున్నావని ప్రశ్నించారు. మీ వాటాదారులకు కమీషన్లు పోతాయనే భయమే దీనికి కారణమా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదల సంక్షేమమే లక్ష్యంగా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వేగవంతం చేశారని పల్లా గారు తెలిపారు. ఈ విధానంతో అదనంగా 220 మెడికల్ సీట్లు రాష్ట్రానికి వస్తాయని, అందులో 110 సీట్లు ప్రభుత్వ (కన్వీనర్) కోటాలోనే ఉంటాయని చెప్పారు. రెండేళ్లలోనే కాలేజీలు పూర్తై 2,500 ఎంబీబీఎస్ సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు. జగన్ విధానంలో అయితే ఇదే ఫలితం సాధించడానికి 15–20 ఏళ్లు పట్టేదన్నారు. పీపీపీ విధానానికి కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు, నేషనల్ మెడికల్ కమిషన్, నీతి ఆయోగ్, హైకోర్టు కూడా పూర్తి మద్దతు ఇచ్చాయని పల్లా గారు గుర్తు చేశారు. వైద్య విద్య ఖర్చులు విపరీతంగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో పీపీపీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని కేంద్రం స్పష్టంగా చెప్పిందన్నారు.

విశాఖపట్నం

ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన రోజునే పెన్షన్ ప్రయోజనాలు అందేలా చర్యలు*

*ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన రోజునే పెన్షన్ ప్రయోజనాలు అందేలా చర్యలు* *రాష్ట్ర ప్రిన్సి పల్ అకౌంటెంట్ జనరల్ ఎస్. శాంతిప్రియ* *విశాఖపట్నండిసెంబర్ 19పున్నమి ప్రతినిధి: ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన వెంటనే పెన్షన్ ప్రయోజనాలు అందజేయాలనే కృతనిశ్చయంతో ఉన్నామని రాష్ట్ర ప్రిన్సి పల్ అకౌంటెంట్ జనరల్ ఎస్. శాంతిప్రియ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం బిఎంఆర్డిఏ చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించిన పెన్షన్ అదాలత్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల నుంచే కొన్ని విభాగాల ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ పెన్షన్ చెల్లింపు ఆర్డర్ పత్రాలను ఆన్లైన్ ద్వారా అందజేస్తామని, .అదే విధంగా ఆన్లైన్ దరఖాస్తు విధానంపై అవగాహన కల్పించేందుకు ఒక ప్రత్యేక వీడియోను అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నామని. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. నేరుగా పెన్షనర్లతో మాట్లాడి డీడీవోల సమక్షంలోనే వారి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశామని, డీడీవోలు, పెన్షనర్ల సమన్వయంతో తక్షణ పరిష్కారం సాధ్యపడుతుందని అన్నారు. పెన్షనర్లకు డాక్యుమెంటేషన్ ను స్వయంగా ఆన్లైన్లో చేసుకునే సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ఆర్బీపీఎస్ ప్రక్రియ ద్వారా ఏజీ కార్యాలయానికి చేరుకున్న పెన్షన్ పత్రాలను పరిశీలించి పదవీ విరమణ బెనిఫిట్స్ ను త్వరగా అందిస్తున్నామని ఆమె తెలిపారు*. *ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్. శాంతిప్రియ పెన్షన్ గ్రీవెన్స్ రెడ్రస్సెల్ పేజ్ ను ప్రారంభించారు. దీని ద్వారా పెన్షన్ దారులు వ్యక్తిగత ప్రయోజనాలను పరిష్కరించుకోవచ్చు అన్నారు.* *ఖజానా శాఖ డైరెక్టర్ ఎస్.మోహనరావు మాట్లాడుతూ గతంలో పెన్షన్ దారుల ప్రయోజనాలకు సంబంధించి కొంత మేరా జాప్యం జరిగేదని, డిజిటలైజేషన్ చేయుట ద్వారా పనులను త్వరితగతిన చేయడం జరుగుతుందన్నారు. పెన్షన్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని ప్రయోజనం పొందాలని పెన్షన్దారులకు పిలుపునిచ్చారు.* *ఈ కార్యక్రమంలో ఆ శాఖ రాష్ట్ర, జిల్లా అధికారులు పాల్గొన్నారు.*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.