Saturday, 14 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దుత్తలూరు మండల కేంద్రంలోనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పోలియో నిరుమూలన కార్యక్రమంలో ఐదు సంవత్సరాల చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో వంటి ప్రమాద కరమైన వ్యాధిని పూర్తిగా నిర్ములిం చాలంటే ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు బాధ్యతగ ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు పోలియో చుక్కలు పిల్లలకు శాశ్వత రక్షణ కల్పించి వారి భవిష్యత్ ను సురక్షితంగా మారుస్తామని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దుత్తలూరు తహశీల్దార్ యనమల నాగరాజు ఎ స్ ఐ ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

విశాఖపట్నం

పోలియో రహిత సమాజమే లక్ష్యంగా పల్స్ పోలియో కార్యక్రమం — డాక్టర్ కందుల నాగరాజు

పోలియో రహిత సమాజమే లక్ష్యంగా పల్స్ పోలియో కార్యక్రమం — డాక్టర్ కందుల నాగరాజు *విశాఖపట్నండిసెంబర్ 21పున్నమి ప్రతినిధి* పోలియో రహిత సమాజమే లక్ష్యంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైనట్లు విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డ్ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు. ఆదివారం అల్లిపురంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి బంగారు జీవితాన్ని ఇవ్వాలని పేర్కొన్నారు.పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచి పోలియో రహిత సమాజం నిర్మించడం మనందరి బాధత్య అని పేర్కొన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఇందు కోసం గర్భిణులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్డు, పౌష్టికాహారం అందచేస్తున్నారు. ప్రభుత్వాలు అందజేసే వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భార‌త‌దేశం పోలియో ర‌హిత దేశం అయిన‌ప్ప‌టికీ, మ‌ళ్లీ పోలియో రాకుండా ఉండేందుకు త‌గు ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల్ని తీసుకోవాల‌ని రాష్ట్రాల‌కు కేంద్రం సూచించింద‌ని తెలిపారు. పోలియో మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవతో పనిచేస్తున్నాయన్నారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు వైద్యారోగ్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. పిల్లల భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండాలంటే పోలియో నుండి సంపూర్ణ రక్షణ అవసరమని 0-5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలన్నారు. ప్రతిసారి రెండు చుక్కలు-పిల్లల ఆరోగ్యానికి సంపూర్ణ రక్షణ అని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొబ్బరి తోట పిహెచ్సి డాక్టర్ అక్ష పర్వీన్, ఎ. ఎన్. ఎం. కే. విజయలక్ష్మి,ఎ. ఎస్.హెచ్ సి ఎల్.నాగలక్ష్మి, అంగన్వాడి టీచర్ టి. పార్వతి,వాలంటరీ ఎల్. ప్రసన్న అక్షయ,కే. అప్పారావు, వై ఆది బాబు, సిపిఐ బుజ్జి, కే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

గౌరవనీయులైన శ్రీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గోపీనాథ్ జెట్టి గారి ఆదేశాలు

*విశాఖపట్నండిసెంబర్ 21పున్నమి ప్రతినిధి* గౌరవనీయులైన శ్రీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గోపీనాథ్ జెట్టి గారి ఆదేశాల మేరకు, శ్రీ అడిషనల్ ఎస్పీ G.B.V.R మధుసూదన్ రావు గారి పర్యవేక్షణలో, పోర్టు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ S. రమేష్, రుషికొండ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మరియు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ గారి ఆధ్వర్యంలో, తేదీ 17.12. 25 నుండి కైలాసగిరి ఆర్మడు రిజర్వ్ హెడ్ క్వార్టర్ గ్రౌండ్ నందు మత్స్యకారుల యూత్ క్రికెట్ మ్యాచ్ జరుగుతువుంధి. రేపు అనగా తేదీ 22.12.25 న క్రికెట్ మ్యాచ్ తుది ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ నందు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు మరియు మ్యాచ్లో పాల్గొన్న ప్రతి క్రికెట్ జట్టుకు క్రికెట్ కిట్లు అందరికీ శ్రీ గౌరవ గోపీనాథ్ జెట్టి గారి చేతుల మీదుగా క్రికెట్ ట్రోపీలు మరియు క్రికెట్ కిట్లు అందజేయడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంనకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ మధ్యాహ్నం 2:30 గంటలకు హాజరుఅయి కార్యక్రమం ను కవర్ చేయవలసినదిగా కోరుచున్నాము. మీడియా మిత్రులకు భోజనం ఏర్పటు చేయడం జరిగింది

విశాఖపట్నం

పోలియో చుక్కలు వేసిన గంటా*

*పోలియో చుక్కలు వేసిన గంటా* *విశాఖపట్నం డిసెంబర్ 21పున్నమి ప్రతినిధి*_ జీవీఎంసీ 8 వ వార్డులోని సాగర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పల్స్ పోలియో శిబిరంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొని, 5 ఏళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 నుంచి దేశంలో పోలియో జాడ లేనప్పటికీ.. ప్రతీ ఏడాది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం ద్వారానే ఆ వ్యాధి ఆనవాళ్లు లేకుండా చేయగలమని పేర్కొన్నారు. బిడ్డలకు పోలియో చుక్కలు వేయించడంలో తల్లిదండ్రులది కీలక పాత్రని తెలిపారు. నూరు శాతం లక్ష్యాన్ని సాధించాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఇంచార్జ్ జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, స్థానిక కార్పొరేటర్ లొడగల అప్పారావు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, చెట్టిపల్లి సన్యాసిరావు, శాఖారి శ్రీనివాస్, చెట్టిపల్లి గోపీ, సారిపల్లి శ్రీనివాస్, దొరబాబు, ఎ.రాంబాబు, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. *దసపల్లా పార్క్ అభివృద్ధికి ఆదేశం* వార్డులో తుప్పలతో నిండిపోయిన దసపల్లా లే అవుట్ పార్క్ లో తక్షణమే జంగిల్ క్లియరెన్స్ చేయాలని గంటా ఆదేశించారు. చుట్టూ అపార్ట్మెంట్లు ఉన్న ఈ ప్రాంతంలో పార్క్ అభివృద్ధికి కాలనీ అసోసియేషన్ ముందుకు రావాలని కోరారు. చుట్టుపక్కల పిల్లలు, పెద్దలు వినియోగానికి వీలుగా పార్క్ లో ఆట వస్తువులు.. వాకింగ్ ట్రాక్ వంటివి ఏర్పాటు చేయాలన్నారు. జోన్ 2 పరిధిలోని మెజారిటీ పార్క్ లు ఇదే స్థితిలో ఉన్నాయని స్థానిక నాయకులు ఫిర్యాదు చేయగా.. మొత్తం పార్క్ లు, వాటి ప్రస్తుత పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని అధికారులకు చెప్పారు. అలాగే పార్క్ లోపల నుంచి పారుతున్న మురుగునీరు సమస్య పరిష్కారానికి డ్రెయిన్ ప్రతిపాదించాలన్నారు.

విశాఖపట్నం

విశాఖపట్నంలోని ప్రముఖ ప్రాంతాలలో విశాఖ పుస్తక మహోత్సవం ప్రచార కార్యక్రమాలు

*విశాఖపట్నం డిసెంబర్ 21పున్నమి ప్రతినిధి* ఈరోజు విశాఖపట్నంలోని ప్రముఖ ప్రాంతాలలో విశాఖ పుస్తక మహోత్సవం ప్రచార కార్యక్రమాలు నిర్వహించాము. ఈ సందర్భంగా విశాఖ ప్రజలకు విశాఖ పుస్తక మహోత్సవం లక్ష్యాలు, ఉద్దేశాలు వివరించాం. ఈ పుస్తక మహోత్సవంలో 100కు పైగా ప్రచురణకర్తల పుస్తకాలు, 1 లక్షకు పైగా పుస్తక శీర్షికలు ఒకే వేదికపై ప్రదర్శనకు రానున్నాయని తెలియజేశాం. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో సాహిత్యం, నవలలు, కథలు, కవిత్వం, చరిత్ర, విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, బాల సాహిత్యం, ప్రాచీనా గ్రంథాలు తదితర విభాగాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయని ప్రజలకు వివరించాం. ప్రచార కార్యక్రమాలకు విశాఖ ప్రజలు సానుకూలంగా స్పందించారు. పుస్తక పఠనాన్ని ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు తరచుగా జరగాలని, సమాజానికి ఇవి ఎంతో అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో కిరణ్ – విజయవాడ బుక్ ఫెస్టివల్ కోఆర్డినేటర్, భరత్ సాయి పాల్గొన్నారు.

విశాఖపట్నం

విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు

సోమవారం జివిఎంసి లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం . -విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు. -జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్. *విశాఖపట్నండిసెంబర్ 21పున్నమి ప్రతినిధి * : మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోను, అన్ని జోనల్ కార్యాలయాలలోనూ “ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( Public Grievance Redressal system-PGRS )కార్యక్రమం” 2025 డిసెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించబడునని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ పత్రికా ప్రకటన ద్వారా ఆదివారం తెలిపారు. కావున, నగరంలో పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం, నీటి సరఫరా, వీధి దీపాలు,హారికల్చర్, రెవిన్యూ, యు సి డి, ఇంజినీరింగ్ మొదలగు జీవీఎంసీ విభాగాలకు సంబంధించిన సమస్యలపై డిసెంబర్ 22 వ తేదీ సోమవారం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో నగర ప్రజలు అర్జీల ద్వారా సమస్యలను తెలియపరుచుకోవచ్చునని నగర ప్రజలకు విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ తెలియచేశారు.

ఆంధ్రప్రదేశ్

ప్రజా సేవకు ముందంజలో ముత్తూట్ ఫిన్ కార్ప్… – ముత్తూట్ పాప్చన్ ఆశయాలకు అనుగుణంగా సేవలు – 135 సంవత్సరాలు దాటిన చరిత్ర

కాకినాడ జిల్లా,పున్నమి ప్రతినిధి: ప్రజా సేవలో బ్యాంకులకు దీటుగా సేవలందిస్తున్న సంస్థ ముత్తూట్ ఫిన్ కార్ప్ (బ్లూ ముత్తూట్) అని జోనల్ హెడ్ అర్ మణి కిరణ్ అన్నారు. స్థానిక కాకినాడ బానుగుడి కూడలి చార్మినార్ టీ సెంటర్ వద్ద ఉన్న ముత్తూట్ ఫిన్ కార్ప్ కాకినాడ 3 బ్రాంచ్ నందు ఖాతాదారులకు లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. ఈ లక్కీ డ్రా లో కరణం రామ కిషోర్ రిఫ్రిజిరేటర్ గెలుపొందారు.దీనికి ఏరియా మేనేజర్ బత్తుల చంద్ర శేఖర్ అధ్యక్షత వహించగా, కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ముత్తూట్ ఫిన్ కార్ప్ జోనల్ హెడ్ అర్ మణి కిరణ్ మరియు రీజినల్ మేనేజర్ శ్రీనివాస్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జోనల్ హెడ్ అర్ మణి కిరణ్ మాట్లాడుతూ లక్కీ డ్రాలో రిఫ్రిజిరేటర్ గెలుపొందిన కరణం రామ కిషోర్ కు శుభాకాంక్షలు తెలిపారు, ముత్తూట్ ఫిన్ కార్ప్ లిమిటెడ్ నందు అనేక సేవలు అందుబాటులో ఉన్నాయని గోల్డ్ , వ్యాపారం, వాహనం , ఈ స్వర్ణ సేవింగ్స్ 50 రూపాయల నుండి ఎంతైనా చేసుకోవచ్చు అని అన్నారు. అతి తక్కువ వడ్డీ తో అన్నీ రకాల సేవలు ఒకే చోటు ఉండటం అది ముత్తూట్ ఫిన్ కార్ప్ నందు ఉండటం గర్వకారణం గా ఉంది అని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో దాదాపు ముత్తూట్ ఫిన్ కార్ప్ 68 బ్రాంచ్ లు ఉన్నాయని అందులో లక్కీ డ్రా కాకినాడ 3 బ్రాంచ్ కు లభించిందని తెలిపారు. అనంతరం ఏరియా మేనేజర్ బత్తుల చంద్ర శేఖర్, కాకినాడ 3 బ్రాంచ్ మేనేజర్ ఎస్ ఎన్ ఎస్ శ్రీ లక్ష్మీ లు సంయుక్తంగా మాట్లాడుతూ ముత్తూట్ ఫిన్ కార్ప్ సేవలను పొందిన వినియోగదారులకు ప్రత్యక కృతఙ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏరియా మేనేజర్ బి.చంద్ర శేఖర్,మార్కెటింగ్ హెడ్ చైతన్య, బ్రాంచ్ మేనేజర్ ఎస్. ఎన్. ఎస్. శ్రీలక్ష్మి, మరియు కాకినాడ 3 బ్రాంచ్ సిబ్బంది కట్టమూరి సంతోష్ కుమార్, రాయవరపు లక్ష్మీ, కె. సాయి బాబు, ఎస్. లోకేష్, జి. హారిక మరియు కాకినాడ 3 బ్రాంచి వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన నగర మేయర్

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన నగర మేయర్ *విశాఖపట్నం డిసెంబర్ 21పున్నమి ప్రతినిధి* పోలియో రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నగరంలో 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన 8 వ జోన్ పెందుర్తి రాజచెరువు అంగనవాడి కేంద్రం, పాత పెందుర్తి జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో ఉన్న అంగన్వాడి కేంద్రాలలో డిసెంబర్ 21 పోలియో ఆదివారం సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ నిండు జీవితానికి రెండు చుక్కలని, పోలియో ఆదివారం సందర్భంగా 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలియో రహితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా కృషి చేస్తున్నారని తెలిపారు. నేడు పోలియో చుక్కలు వేసేందుకు వీలుకాని చిన్నారులకు డిసెంబర్ 22, 23 వ తేదీల్లో ఏ.ఎన్.ఎంలు ఇంటింటికి వచ్చి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. అలాగే పోలియో చుక్కలు వేయించుకునేందుకు వచ్చిన చిన్నారుల తల్లిదండ్రులతో ఆప్యాయతగా పలకరించి పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని మేయర్ తెలిపారు. నేడు నగరంలో ప్రతి అంగన్వాడి కేంద్రం వద్ద పాఠశాలల్లో, బస్టాండ్లో , రైల్వే స్టేషన్, రైతు బజార్లు లో పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు . ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్లు రాజేంద్రప్రసాద్, పీలా జితేంద్ర, డాక్టర్లు, శానిటరీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, అంగన్వాడి సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన నగర మేయర్

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన నగర మేయర్ *విశాఖపట్నం డిసెంబర్ 21పున్నమి ప్రతినిధి* పోలియో రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నగరంలో 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన 8 వ జోన్ పెందుర్తి రాజచెరువు అంగనవాడి కేంద్రం, పాత పెందుర్తి జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో ఉన్న అంగన్వాడి కేంద్రాలలో డిసెంబర్ 21 పోలియో ఆదివారం సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ నిండు జీవితానికి రెండు చుక్కలని, పోలియో ఆదివారం సందర్భంగా 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలియో రహితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా కృషి చేస్తున్నారని తెలిపారు. నేడు పోలియో చుక్కలు వేసేందుకు వీలుకాని చిన్నారులకు డిసెంబర్ 22, 23 వ తేదీల్లో ఏ.ఎన్.ఎంలు ఇంటింటికి వచ్చి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. అలాగే పోలియో చుక్కలు వేయించుకునేందుకు వచ్చిన చిన్నారుల తల్లిదండ్రులతో ఆప్యాయతగా పలకరించి పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని మేయర్ తెలిపారు. నేడు నగరంలో ప్రతి అంగన్వాడి కేంద్రం వద్ద పాఠశాలల్లో, బస్టాండ్లో , రైల్వే స్టేషన్, రైతు బజార్లు లో పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు . ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్లు రాజేంద్రప్రసాద్, పీలా జితేంద్ర, డాక్టర్లు, శానిటరీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, అంగన్వాడి సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి 53 వ జన్మదిన వేడుకలు

*విశాఖపట్నండిసెంబర్21పున్నమి ప్రతినిధి* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి 53 వ జన్మదిన వేడుకలు విశాఖ మాజీ మేయర్ శ్రీమతి శ్రీ గొలగాని హరి వెంకట కుమారి శ్రీనివాస్ క్యాంప్ ఆఫీస్ లో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో మహా విశాఖ నగర మాజీ మేయర్ కేక్ కట్ చేసి వృద్ధులకు మరియు పేద మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం చేశారు. అనంతరం మాజీ మేయర్ మాట్లాడుతూ పేద ప్రజలకు ఇంటింటి పెన్షన్ కార్యక్రమం గానీ గవర్నమెంట్ సేవలు ప్రజలకు చేసారువచేయటమే కాకుండా, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన సంక్షేమ ప్రదాత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అని తెలిపారు*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.