Friday, 6 March 2026

Blog

తిరుపతి

వైకాపాలో నూతన నియమాకలు పొందిన వారికి ఘనసన్మానం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 27: శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంటలెక్చువల్ ఫారం జాయింట్ సెక్రెటరీగా నియమితులైన కొత్తపాటి శ్రీనివాస్ రెడ్డి సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొని నూతన పదవి బాధ్యత చేపట్టిన కొత్తపాటి శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, తిరుపతి శ్రీకాళహస్తి పార్లమెంటు పరిశీలకులు ఓడూరు గిరిధర్ రెడ్డి,కర్నూల్ పార్లమెంట్ పరిశీలకులు సూర్య ప్రకాశ్ రెడ్డి తదితరులు కొత్తపాటి శ్రీనివాస్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ భాష,ఉత్తరాజీ సర్వణ కుమార్, శ్రీవారి సురేష్,తీగల చిన్న, మాతయ్య,మున్నా రాయల్, బుల్లెట్ జయశ్యం రాయల్, పటాన్ ఫరీద్,శివ కుమార్ యాదవ్, చందర్ రాజు, పెరుమాళ్ చౌదరి, కామి వెంకటేశ్వర్లు, గఫూర్, దూదాకుల సంఘం అధ్యక్షుడు బాబు, జూమ్లేష, గుణ,జీవీకే రెడ్డి,కుమార్, సునీత సింగ్, హిమబిందు, సుధాకర్ రెడ్డి, పురుషోత్తం గౌడ్, యోగ, జయ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శివయ్యను దర్శించుకున్న తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 27: శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్ధం తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మీ శుక్రవారం నాడు ఆయలనికి విచ్చేసారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు పాలక మండలి సభ్యులు, టి.డి.పి. మీడియా కోఆర్డినేటర్ కార్తీక్ నాయుడు, ఆలయ అధికారులు, ఆమెకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించి దర్శనానంతరం ఆలయ వెడపండితులచే ఆశీర్వచనం చేయించి శ్రీ స్వామి, అమ్మవార్ల తీర్ధ, ప్రసాదలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు, గుర్రపు శెట్టి, ఆలయ సిబ్బంది, స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.

తిరుపతి

హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని టియుసిసి మంత్రికి వినతి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 27: శ్రీకాళహస్తి హమాలీ ముఠా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏ పీ సీడ్స్ కార్పొరేషన్ విజయవాడ,వ్యవసాయ శాఖ మంత్రి గింజరపు అచ్చం నాయుడుకి మెమోరాండము సమర్పించిన ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ నాయకులు. విజయవాడలోని మంత్రి నివాసము నందు ఆయనను కలుసుకుని గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన కేంద్రం విజయవాడ శ్రీకాళహస్తితో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న అన్ని బ్రాంచులు పూర్తిగా మూత పడిపోతున్న ఈ పరిస్థితులలో వేలాదిగా ఉన్న హమాలీ ముఠా కార్మికుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని, విత్తన ప్రాసెసింగ్ యూనిట్లను వెంటనే తెరవాలని ఏపీ సీడ్స్ కార్పొరేషన్ కి సంబంధించిన అన్ని బ్రాంచీలలో పని విధానాన్ని మెరుగుపరచాలని మంత్రికి టియుసిసి ప్రతినిధి బృందం వివరించడం జరిగింది, వ్యవసాయ శాఖ మాత్యులు స్పందిస్తూ ఏపీ సీడ్స్ ని మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో (టి యు సి సి)ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే,వీ నరసింహామూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులుయు, నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి దొడ్ల గౌరీ, హమాలీ నాయకులు మునయ్య, నంద్యాల గంగాధర్ లు పాల్గొన్నారు.

తిరుపతి

సమాజంలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించండి- మాజీ ఎమ్మెల్యే యస్సీ.వి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 27: శ్రీకాళహస్తి శుక బ్రహ్మ ఆశ్రమం పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూపానంద గిరి స్వామీజీని మాజీ శాసనసభ్యులు నాయుడు శుక్రవారం నాడు ఘనంగా సత్కరించారు. ఆశ్రమ పీఠాధిపతి విద్యా స్వరూపానంద స్వామి పిలుపుమేరకు ఎస్ సి వి నాయుడు పీఠాధిపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆశ్రమ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఏప్రిల్ లో నిర్వహించే ఆశ్రమ వార్షికోత్సవాలు తదితర అంశాలపై చర్చించారు. శుక బ్రహ్మ ఆశ్రమం చేపట్టే ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తామని ఎస్ సి వి నాయుడు హామీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో నైతిక విలువలు పెంపొందించి, ఆధ్యాత్మిక చింతనతో సత్ప్రవర్తనతో ప్రతి వ్యక్తి నడుచుకునేలా చేసే గురుతర బాధ్యతలు ఆశ్రమ పీఠాధిపతులు తీసుకోవాలని, ధార్మిక ప్రచారాలు విస్తృతంగా నిర్వహించాలని ఎస్ సి వి నాయుడు స్వామిజీని కోరారు.

రంగారెడ్డి

* కందుకూరు మండలం విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న – కొండా విశ్వేశ్వర్ రెడ్డి –ఎంపిటిసి జెడ్పిటిసి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి – శ్రీరాములు అందెల*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) ఫిబ్రవరి 27 : మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల బిజెపి అధ్యక్షులు నిమ్మ అంజి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మండల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి బిజెపి రాష్ట్ర కార్యదర్శి కొప్పు బాషా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ లను, ఉప సర్పంచ్ లను, వార్డు మెంబర్లను వారు ఘనంగా సన్మానించారు. అనంతరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని మండలంలోని వివిధ పాఠశాలలో పదవ తరగతిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు జే.కే.యం.ఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రోత్సాహక చెక్కులను అందించారు. అనంతరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కందుకూరు మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీని కాదని మండల ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి అపూర్వ విజయాన్ని అందించి 12 సర్పంచ్లను గెలిపించుకున్నారని…వాళ్ల నమ్మకాన్ని అదేవిధంగా కొనసాగించేలా గ్రామ అభివృద్ధికి కట్టుబడి పని చేయాలని… అభివృద్ధి కొరకు అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు. శ్రీరాములు మాట్లాడుతూ రానున్న ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడారి జంగయ్య యాదవ్ యాదవ్, బిజెపి సీనియర్ నాయకులు సాద మల్లారెడ్డి, లక్ష్మణ్ ముదిరాజ్, అమరేందర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, శక్తి కేంద్ర ఇన్చార్జులు, బూత్ అధ్యక్షులు, వివిధ మోర్చాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

* శ్రీలక్ష్మినర్సింహ ఫాస్ట్ ఫుడ్ అండ్ టిఫిన్ సెంటర్ ను ప్రారంభించిన దేప భాస్కర్ రెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) ఫిబ్రవరి 27 : మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం అమీర్పేట గ్రామం యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు గల్ల శ్రీకాంత్ నూతనంగా ఏర్పాటు చేసుకున్న శ్రీలక్ష్మినర్సింహ ఫాస్ట్ ఫుడ్ అండ్ టిఫిన్ సెంటర్ ను ప్రారంభించిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టిపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సి హెచ్ యాదయ్య సర్పంచ్ చేపంగి ప్రవీణ్ దాంతోజు నర్సింహ చారి, కె జె ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

*ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన శ్రీరాములు అందెల —మొన్న సాయి కిషోర్ పై నేడు క్యాబ్ డ్రైవర్ సురేష్ పై వరుసగా దాడి*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) ఫిబ్రవరి 27 : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరుసగా ఒక వర్గం వారు హిందువులపై దాడులు జరుపుతున్న నేపథ్యంలో ఇటీవల నాగోల్ లో మొబైల్ సెంటర్ నిర్వాహకుడు ఖదీర్ సాయి కిషోర్ పై దాడి చేసిన విషయం తెలిసినదే కాగా నిన్న రాత్రి హిందూ క్యాబ్ డ్రైవర్ సురేష్ తన కారుపై జైశ్రీరామ్ అని రాసుకున్నందుకు కేవలం హిందువు అని టార్గెట్ చేసి ఒక వర్గానికి చెందిన యువకులు దాడి చేసి సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించి నిరసన తెలిపారు. వారి వెంట జిహెచ్ఎంసి మాజీ కార్పొరేటర్లు బిజెపి రాష్ట్ర నాయకులు హిందూ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.

రంగారెడ్డి

* బీజేపీ ప్రశ్నిస్తేనే కదులుతున్న జిహెచ్ఎంసి అధికారులు*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) ఫిబ్రవరి 27 : మహేశ్వరం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బడంగ్‌పేట్ సర్కిల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన నిరసన తర్వాతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) అధికారులు స్పందించి శుక్రవారం సమస్యలపై పనులు ప్రారంభించడం గమనార్హంప్రజల సమస్యలను స్వయంగా పరిష్కరించాల్సిన అధికారులు, ఆందోళన తర్వాతే చర్యలు తీసుకోవడం బాధాకరంమని ప్రజల హక్కుల సాధన కోసం బీజేపీ పోరాటం నిరంతరం కొనసాగుతుంది బడంగ్‌పేట్ బీజేపీ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి తెలిపారు

విశాఖపట్నం

పూర్తి జీతాలు చెల్లించాలి

విశాఖపట్నం, ఫిబ్రవరి 27, పున్నమి ప్రతినిధి. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు పూర్తి జీతాలు చెల్లించాలని స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్య రామ్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. స్టీల్ కార్మికులుకు పూర్తి జీతాలు చెల్లించాలనే ప్రధాన డిమాండ్ తో స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో వేలాదిమంది కార్మికులు తమ నిరసనను తెలియజేస్తూ సంతకాలు చేశారు. ఆపత్తులను నేడు స్టీల్ ఉన్నత యాజమాన్యానికి స్టీల్ సిఐటియు ఉక్కు శిక్షణ కేంద్రం సమావేశ మందిరంలో అందజేశారు. ఈ సందర్భంగా స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్యరామ్ మాట్లాడుతూ నేడు స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి తగ్గడానికి కారణం ఉన్నత యాజమాన్యం అనుసరించిన అనాలోచిత నిర్ణయాలే కారణమని ఆయన తీవ్రంగా విమర్శించారు. కార్మికులకు న్యాయంగా రావలసిన వేతనాలపై కార్మిక ఉన్నత అధికారులు యాజమాన్యాన్ని ఆదేశించిన వైఖరిలో ఎటువంటి మార్పు రాకపోవడం నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆయన వివరించారు. కార్మికులు 2012, అధికారులు 2007 జీతాలను తీసుకుంటున్నారని వాటిలో కూడా కోతలు విధిస్తే కుటుంబ పోషణ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. సహనానికైనా ఒక హద్దు ఉంటుందని ఆ హద్దు మీరి నేడు యాజమాన్యం చట్టాలు ఉల్లంఘిస్తూ నిరంకుశ నిర్ణయాలతో కార్మికులను బానిసలుగా చూడటం మంచిది కాదని ఆయన హితవుపలికారు. ఇప్పటికైనా ఉన్నత యాజమాన్యం తమ వైఖరిని మార్చుకొని పునరాలోచించి కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. స్టీల్ సిఐటియు అధ్యక్షులు యు రామస్వామి మాట్లాడుతూ లేబర్ కోడ్స్ అమలు కాకుండానే స్టీల్ యాజమాన్యం ఇక్కడ వాటి అమలుకు ఒక ప్రయోగశాల గా స్టీల్ ప్లాంట్ ను మారుస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. స్టీల్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను ఉన్నత యాజమాన్యం సకాలంలో అందిస్తే ఉత్పత్తి చేయడానికి స్టీల్ కార్మికులు సంసిద్ధంగా ఉన్నామని నిరూపించామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్మికుల త్యాగాన్ని గాని, అంకిత భావాన్ని గాని గుర్తించని యాజమాన్యం మొండి వైఖరితో పరిశ్రమలో అశాంతిని సృష్టించి కార్మికులను భయాందోళనకు గురి చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూడడం దురదృష్టకరమని ఆయన అన్నారు. యాజమాన్యం తన వైఖరిని మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. స్టీల్ జిఎం (హెచ్ఆర్) మధుసూదన్ గారు మాట్లాడుతూ స్టీల్ ఉత్పత్తికి ఎటువంటి అంతరాయం కలగకుండా మీరు చేసిన ఈ సంతకాల సేకరణ పతులను ఉన్నత యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన అన్నారు. సమస్య తీవ్రతను నేను అర్థం చేసుకున్నానని ఉన్నత యాజమాన్యానికి మీ ఆవేదనను తెలియజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్టీల్ పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారి డాక్టర్ రాధిక గారు, స్టీల్ సిఐటియు నాయకులు పి శ్రీనివాసరాజు, పుల్లారావు, టి వి కె రాజు, బి మహేష్, యు మరిడయ్య, బి ఎన్ మధుసూదన్, బి తౌడన్న, వి ప్రసాద్, అప్పలరాజు, పవన్, రాజు, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణమూర్తి తదితరులతోపాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు మరియు కార్మికులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఏకాదశి సందర్భంగా చెన్నకేశవ స్వామికి హస్త, పాద కవచాల వితరణ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి)మనుబోలు అంబేద్కర్ నగర్‌లోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. బెంగళూరుకు చెందిన నాశిన వెంకయ్య స్వామి, ఆయన సతీమణి స్వప్న దంపతులు రూ.8,000 విలువైన హస్త, పాద కవచాలను ఆలయానికి వితరణగా అందించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు క్షీర పంచామృతాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కోసూరు మస్తానయ్య గౌడ్, అంజమ్మ దంపతులు భక్తితో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.