Friday, 6 March 2026

Blog

అనకాపల్లి

ముందస్తుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు – పెన్షన్ దారుల ముఖాల్లో చిరునవ్వులు..!

అనకాపల్లి జిల్లా, ఫిబ్రవరి 28 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): మార్చి 1వ తేది ఆదివారం కావడంతో, పెన్షన్ దారులు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యగా ఫిబ్రవరి 28వ తేదీనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. ఏటికొప్పాక ప్రాంతంలో కూటమి నాయకులు మరియు సచివాలయ సిబ్బంది సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. పెన్షన్ దారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముందస్తు పంపిణీతో వృద్ధులు, దివ్యాంగులు సహా లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. “సమయానికి పెన్షన్ అందడం మా కుటుంబానికి ఎంతో ఉపశమనంగా ఉంటుంది” అని పలువురు లబ్ధిదారులు పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల స్థానిక ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు. సామాజిక భద్రత పథకాల అమలులో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ చర్య మరోసారి స్పష్టం చేసింది.

ఖమ్మం

వెలుగు మట్ల భూదాన్ హిస్టరీ

ఆచార్య వినోబా భవే ఆశయాలకి ఆశయాలకి ఆకార్షితులు అయినా భూ స్వామి రాయల కోటేశ్వరరావు ఖమ్మం జిల్లా వెలుగు మట్ల లో 62 ఎకరాలు భూమి ని భూ దాన్ బోర్డు కి అప్పగించారు. కాల క్రమం. లో భూమి విలువ పెరగడం తొ అక్రమార్కులు తప్పుడు పత్రలతో ఆ భూములని అమ్మారు. సొంత ఇంటి కల తొ సామాన్యులు కొని ఇల్లు కట్టుకున్నారు. ప్రభుత్వం కోర్టు కి వెళ్లగా అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు అని స్టే విధించింది. దీంతో అధికారులు నిర్మాణాలని తొలగిస్తున్నారు.

విద్య విజ్ఞానం

నేడు శ్రీనివాస్ రామానుజన్ జయంతి.

సత్యాన్ని తెలుసుకోవాలంటే ప్రకృతిని గమనించాలన్న తత్వవేత్త కాంతి రహస్యాలను ఛేదించిన ప్రఖ్యాత రామన్ ఎఫెక్ట్ సృష్టికర్త భారతీయ శాస్త్రవిజ్ఞానాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్పశాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత, భారతరత్న సర్ సి.వి. రామన్ గారి జయంతి సందర్భంగా మహనీయునికి ఇవే మా నివాళులు.. 🙏🏽

ఖమ్మం

నేడు ఖమ్మం కి బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ రాక :

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం నగరము లో ని వెలుగు మట్ల లొ ఇల్లు కోల్పోయిన బాధితులని పరామర్శించెందుకు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ నాయకులు ఈటెల రాజేంద్ర నేడు ఖమ్మం రానున్నారు. ఈ పర్యటన లొ బీజేపీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్య లొ పాల్గొనాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు విజ్ఞప్తి చేసారు.

కడప

కడప జిల్లా ఎర్రగుంట్ల పోలీసులు వాహనాల తనిఖీల్లో రూ. 2. 52 కోట్ల రూపాయలు స్వాధీనం.

ఎర్రగుంట్ల పోలీసులు వాహనాల తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.2.52 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ముద్దనూరు నుంచి వస్తున్న కారులో 500 రూపాయల నోట్ల కట్టలు గుర్తించారు. నగదు ప్రొద్దుటూరుకు చెందిన బంగారు వ్యాపారిదని తెలిసింది. సరైన బిల్లులు లేకపోవడంతో డబ్బును సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తిరుపతి

కల్తీ పాలపై ‘ఫుడ్ సేఫ్టీ’ పంజా-పాల సొసైటీ కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 27: శ్రీకాళహస్తిలోని స్థానిక పాల సొసైటీ కేంద్రాన్ని శుక్రవారం నాడు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ జగదీష్ తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కల్తీ పాలను అరికట్టేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి పలువురు మృతి చెందిన ఘటన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేసింది. గురువారం నాడు పాల కేంద్రంలోని నిల్వలను పరిశీలించిన అధికారులు, పాల నాణ్యతను పరీక్షించేందుకు కొన్ని నమూనాలను సేకరించారు. ఈ సందర్బంగా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ…. సేకరించిన పాల నమూనాలను విశ్లేషణ కోసం ల్యాబొరేటరీకి పంపనున్నట్లు అయన వెల్లడించారు. పాలను నిల్వ చేసే విధానం, పరిసరాల పరిశుభ్రతపై సొసైటీ కేంద్రం నిర్వహుకులను ఆరా తీశారు. స్టెయిన్‌లెస్ స్టీల్ క్యాన్లలో మాత్రమే పాలను భద్రపరచాలని, ప్లాస్టిక్ లేదా అల్యూమినియం డబ్బాలను వాడవద్దని పాల నాణ్యతలో లోపాలున్నా లేదా కల్తీకి పాల్పడినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జగదీష్ హెచ్చరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కల్తీకి పాల్పడే వారికి కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన పాల కేంద్రాలు, విక్రయ కేంద్రాల్లో ఈ తనిఖీలు కొనసాగుతాయని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానం కలిగితే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ విభాగం సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తిరుపతి

సరస్వతి బాయి పాఠశాలలో సైన్స్ డే సంబరాలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 27: శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక సరస్వతి బాయి పాఠశాలలో నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలని చాటుతూ జాతీయ సైన్స్ దినోత్సవ ముందస్తు వేడుకలు అంబరాన్నంటాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తూ నిర్వహించిన పోటీలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. రంగుల హరివిల్లులో విజ్ఞాన చిత్రాలు సైన్స్ అంటే కేవలం పుస్తకాలు కాదు, అది ఒక కళ అని నిరూపిస్తూ విద్యార్థులు వేసిన సైన్స్ రంగోలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పర్యావరణహిత రంగులతో మానవ శరీర భాగాలు, అంతరిక్ష ప్రయోగాలు మరియు పర్యావరణ రక్షణపై వేసిన చిత్రాలు చూపరులను మంత్రముగ్ధులను చేశాయి. విద్యార్థుల మేధస్సుకు పరీక్షగా నిలిచిన సైన్స్ క్విజ్ పోటీ అత్యంత ఉత్సాహంగా సాగింది. నాలుగు టీంల మధ్య హోరాహోరీగా జరిగిన ఈ పోరులో విద్యార్థిని హర్షిత బృందం ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా సైన్స్ ఉపాధ్యాయులు డి.రమేష్ మాట్లాడుతూ..విద్యార్దులకు వైజ్ఞానిక దృక్పథం ఎంతో అవసరం ఉందని 28 ‘రామన్ ఎఫెక్ట్’ ఆవిష్కరణకు గుర్తుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని కేవలం చదువుకే పరిమితం కాకుండా, ప్రయోగాత్మక విద్య ద్వారానే విద్యార్థులు గొప్ప స్థాయికి ఎదుగుతారని ఆయన ఆకాంక్షించారు. అనంతరం హర్షిత మాట్లాడుతూ.. తమ ఉపాధ్యాయులు అందించిన లోతైన బోధన, ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధించగలిగామని గర్వంగా చాటింది. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

రంగారెడ్డి

*బిజినెస్ పాలసీల్లో తెలంగాణ ప్రభుత్వం భేష్: KLR* ==బిల్డర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు సదస్సు –హైదరాబాద్ కు అంతర్జాతీయ కంపెల క్యూ: కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) ఫిబ్రవరి 27 :బిల్డర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు జరుగుతున్న నేషనల్ మేనేజింగ్ కమిటీ & జనరల్ కౌన్సిల్ మీటింగ్ లో మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ…. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పారిశ్రామిక, నిర్మాణాల నూతన పాలసీలతో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర పద్మజ ఫామ్ గ్రోవ్స్ రిసార్ట్ లో కాసేపటి క్రితం ప్రారంభమైంది. హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ అపార్ట్ మెంట్స్, విల్లా ప్రాజెక్టుల నిర్మాణాలు జరుతున్నాయని లక్ష్మారెడ్డి అన్నారు. బిల్డర్స్ అసోషియేషన్ సైతం మహేశ్వరం నియోజకవర్గం ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని కాంగ్రెస్ నేత KLR కోరారు. ఈ బిజినెస్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెల బిల్డర్స్ & ప్రతినిధులు పాల్గొన్నారు.

తిరుపతి

వాటర్ ప్లాంట్లను ప్రారంభించిన బొజ్జల బృందమ్మ, రిషిత రెడ్డి

తొట్టంబేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 27: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం నాడు తొట్టంబేడు మండలంలోని దయనేడు, చిన్న సింగమల, సంబయపాలెం, ఎల్ఐసి కాలనీ పలు గ్రామాల్లో గ్రీన్ ప్యానెల్ ఆధ్వర్యంలో గ్రామస్తుల భాగస్వామ్యంతో నిర్మించిన ఆర్‌ఓ వాటర్ ప్లాంట్లను బొజ్జల బృందమ్మ, రిషిత రెడ్డిలు పాల్గొని ప్లాంట్లను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా బొజ్జల కుటుంబ సబ్యులు మాట్లాడుతూ…. గ్రామస్తులకు శుద్ధమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే చొరవతో ప్రభుత్వం, గ్రీన్ ప్యానెల్ వారు, గ్రామస్తుల సహకారంతో ఈ ఆర్‌ఓ వాటర్ ప్లాంట్లు నిర్మించబడ్డాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల అధ్యక్షుడు రావిళ్ళ మునిరాజు నాయుడు ఈ కార్యక్రమంలో గ్రీన్ ప్యానెల్ మణికంఠ, ఎంపీడీవో సురేంద్రబాబు, ఆఫీసర్ సౌమ్య నాగరాజ్, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

చంద్రశేఖర్ ఆజాద్ సిద్దాంతాలను అనుసరిద్దాం-జనసైనికులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 27: శ్రీకాళహస్తి పట్టణంలో జనసేన పార్టీ నాయకులు స్వాతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలువేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్బంగా జనసైనికులు మాట్లాడుతూ……భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్లతో అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి దేశంలో ఉన్నటువంటి యువత యొక్క గుండెల్లో ధైర్యాన్ని నింపి, ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా బ్రతకాలనే నినాదంతో అందరిని చైతన్యపరిచి భారతదేశ స్వాతంత్రం కోసం కేవలం 25 సంవత్సరాలకే ప్రాణదానం చేసి అందరిలోనూ ధైర్యాన్ని నింపిన చంద్రశేఖర్ ఆజాద్ ది ఒక గొప్ప చరిత్ర, ప్రతి ఒక్కరు కూడా ఆయనలో ఉన్నటువంటి ధైర్యాన్ని నింపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, తేజ, గంధం శీను, లక్ష్మణ్, కల్లిపూడి వెంకటేష్, ప్రదీప్ కుమార్, మహేష్, నవీన్, నాదెండ్ల రాజేష్, భాను, రాజా తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.