Friday, 13 March 2026

Blog

Blog

కర్నూలలో నూతన ఈద్గా పనులకు గ్రీన్ సిగ్నల్ రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ కి ధన్యవాదాలు తెలిపిన ఈద్గా కమిటీ సభ్యులు

నంద్యాల వఖ్ఫ్ జమీన్ బచావో సంఘటన్ ప్రతినిధులు మంత్రి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసి కుర్నూలు నగరంలో నూతన ఈద్గా నిర్మాణ పనులను ప్రారంభించాలని విన్నవించుకోగా స్పందించిన రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పనులు మొదలుపెట్టుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వఖ్ఫ్ జమీన్ బచావో సంఘటన్ నాయకులు మాట్లాడుతూ ముస్లింల చిరకాల కోరికైన ఈద్గా నిర్మాణం పట్ల మంత్రి ఫరూక్ ప్రత్యేక శ్రద్ధ చూపడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈద్గా పనుల ప్రారంభానికి సహకరించినందుకు సంఘటన్ తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘటన్ ప్రతినిధులు షేక్ హుస్సేన్, ఎస్. మహమ్మద్ మెయిన్, షేక్ సుల్తాన్, షేక్ ఖలేందర్ బాషా, షేక్ అన్వర్ బాషా, నంద్యాల ఇమాముల సంఘం అధ్యక్షులు అంజాద్ భాషా సిద్ధికి తదితరులు పాల్గొన్నారు.

Blog

నంద్యాలలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొని క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎన్ఎండి ఫరూక్

నంద్యాల పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయం బుధవారం క్రిస్మస్ వేడుకలతో సందడిగా మారింది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ క్రైస్తవ నాయకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వేడుకల్లో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేక్ కట్ చేసి, అక్కడికి విచ్చేసిన క్రైస్తవ సోదరులకు తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ లోక రక్షకుడు ఏసుక్రీస్తు జన్మించిన రోజైన క్రిస్మస్, శాంతి మరియు కరుణకు చిహ్నమని కొనియాడారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి పండుగలు జరుపుకోవడం సంతోషదాయకమని ఆయన పేర్కొన్నారు. అనంతరం క్రైస్తవ నాయకులు మంత్రి ఫరూక్ ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృపాకర్, ప్రభుదాస్, జోసఫ్, జార్జ్, శరత్, ఎబినేజర్, బుగ్గ రాముడు, నాగేశ్వరావు, ఫిలిప్, సురేష్ పాల్ ,మల్లెల భాస్కర్, స్టీవెన్, చంద్రశేఖర్, దీపక్ మరియు టిడిపి క్రైస్తవ ముఖ్య నాయకులు, క్రైస్తవ మత పెద్దలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

E-పేపర్

రబీకి నంద్యాల జిల్లాలో యూరియా సమృద్ధి : జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు

నంద్యాల జిల్లాలో రబీ 2025–26 సీజన్‌కు అవసరమైన యూరియా ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సీజన్‌కు జిల్లాకు మొత్తం 68,777 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి డిసెంబరు 24 వరకు 30,059 మెట్రిక్ టన్నుల అవసరం ఉండగా, ఇప్పటికే 36,914 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రస్తుతం కోఆపరేటివ్ సొసైటీలు, ఆర్‌ఎస్‌కేలు, మార్క్‌ఫెడ్ గోదాములలో సహా వివిధ కేంద్రాల్లో 13,865 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదని, రాబోయే రోజుల్లో కూడా యూరియా సమస్య ఉండదని స్పష్టం చేశారు. రైతులు ఎరువులు కొనుగోలు సమయంలో ఎంఆర్‌పీ ధర మేరకే చెల్లించి, రసీదు తప్పనిసరిగా పొందాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్లపై ఎరువుల నియంత్రణ చట్టం–1985 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Blog

విద్యార్థులు వినియోగదారుల చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలి: జాయింట్‌ కలెక్టర్‌ కొల్లాబత్తుల రాజేష్‌

నంద్యాల జిల్లా కేంద్రంలో బుధవారం జాతీయ వినియోగదారుల వారోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షులు అమీర్‌బాషా అధ్యక్షతన నంద్యాల పురపాలక బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వారోత్సవాల ముంగిపు కార్యక్రమానికి జాయింట్‌ కలెక్టర్‌ కొల్లాబత్తుల రాజేష్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అలాగే కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డా.వెంకటరమణ, జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి వెంకటరాముడు, లీగల్‌ మెట్రాలజి జిలాని బాషా, డీఈఓ జనార్ధన్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ అధికారి రవిబాబు, డీటఓ శివారెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈసందర్భంగా జేసీ కొల్లాబత్తుల రాజేష్‌ మాట్లాడుతూ సేవలు పొందే సమయంలో, వస్తువులను కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలన్నారు.. ఆన్‌లైన్‌ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని తక్కువ ధరలకు వస్తువులను అందిస్తామన్న వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నాణ్యత కలిగిన వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. అమ్మకాలు జరిపే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నేడు డిజిటల్‌ న్యాయపాలన ద్వారా వినియోగదారుల సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని అందువల్ల విద్యార్థి దశ నుండే డిజిటల్‌ పాలన, ఈ ఫైలింగ్‌పై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు మాట్లాడుతూ కొనుగోలు చేసిన వస్తువుల నాణ్యత, కొలతలలో తేడా ఉన్నట్లయితే అధికారులకు ఫిర్యాదు చేసి పరిష్కారం పొందవచ్చన్నారు. అలా పరిష్కారం కాని ఫిర్యాదులపై వినియోగదారులు జిల్లాస్థాయి వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చన్నారు. అలాగే రంగులు వేసిన, టేస్టెడ్‌ సాల్ట్‌తో తయారు చేసిన ఆహార పదార్థాలు, నాసిరకం పదార్థాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను తినడం ద్వారా రోగాల బారిన పడే అవకాశం ఉందని అటువంటి ఆహార పదార్ధాలను తినకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. వస్తువు కొనుగోలు చేసే సయయంలో ప్యాకింగ్‌పై ఉన్న తయారీ తేది, ఎక్స్‌పైరీ తేది తదితర వివరాలను పూర్తిగా చదివి వస్తువును కొనుగోలు చేయాలని అలాగే తప్పకుండా రశీదు తీసుకోవాలన్నారు. అనంతరం వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు , వినియోగదారుల సంఘం సభ్యులకు జాయింట్‌ కలెక్టర్‌ ప్రశంసా పత్రాలు, జ్జాపికలను అందజేశారు. ఈకార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, వినియోగదారులు సంఘం సభ్యులు శ్రీనివాసులు, రజనీకాంత్‌, మరియదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వింజమూరు మండల సి.పి.యం పార్టీ నూతన కార్యాలయం నిర్మాణం కొరకువేమూరి దొరస్వామి నాయుడు ఆర్థిక సహాయం

వింజమూరు మండల సి.పి.యం పార్టీ నూతన కార్యాలయం నిర్మాణం కొరకు చంద్రపడియ గ్రామ నీటి సంఘం అధ్యక్షుడు వేమూరి దొరస్వామి నాయుడు గారు ఉదయగిరి నియోజకవర్గ సి.పి.యం పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ బయన్న గారి చేతికి పదివేల రూపాయలు అర్థిక సహాయం అందజేసారు ఈ కార్యక్రమంలో సి. ఐ. టి. యూ వింజమూరు మండల కన్వీనర్ భాస్కర్ రెడ్డి, మర్రి శీనయ్య,గంగపట్ల తిరుమలయ్య, బిల్లుపాటి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు

రంగారెడ్డి

*వికలాంగురాలికి ట్రై సైకిల్ అందజేసిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 24:మహేశ్వరం నియోజకవర్గంలోని జిహెచ్ఎంసీ మీర్పేట్ ప్రాంతం లెనిన్ నగర్ మురళీకృష్ణ కళానగర్‌లో నివాసముంటున్న ఏ. చంద్రకళ (భర్త: నరేందర్) అంగవైకల్యంతో బాధపడుతూ మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని అర్జీ ద్వారా సహాయం కోరారు. వారి విజ్ఞప్తికి తక్షణమే స్పందించిన సబితా ఇంద్రారెడ్డి ట్రై సైకిల్ మంజూరు చేసి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా బాధితురాలికి ధైర్యం చెప్పి, అవసరమైన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో మీర్పేట్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీను నాయక్,మదారి రమేష్,జిల్లా విజయ్ కందుకూరు అధ్యక్షులు మన్నే జయేందర్ ముదిరాజ్, మహేశ్వరం నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ సిల్వేరి సాంబశివ తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

* రెక్స్ యూనిక్స్ మెన్ సలూన్ ప్రారంభించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 24:మహేశ్వరం నియోజకవర్గంలోని జిహెచ్ఎంసీ పరిధిలోని గాయత్రీ నగర్ ప్రాంతంలో గణేష్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రెక్స్ యూనిక్స్ మెన్ సలూన్ & పార్లోర్ను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. ఇలాంటి వ్యాపారాలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మీర్పేట్ బిఆర్ఎస్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి అర్కల భూపాల్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి మదారి రమేష్ లక్ష్మణ్ ముదిరాజ్,సిద్దాల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

* పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కాంగ్రెస్ శీతకన్ను –పాలమూరు బిడ్డ”నని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు –కేసీఆర్‌ను విమర్శించడమే కాదు, ముందు మిగిలిన పనులు పూర్తి చేయాలి. —సబితా ఇంద్రారెడ్డి మరియు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక సమావేశం..

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 24:మహేశ్వరం నియోజకవర్గంలోని జిహెచ్ఎంసి మీర్పేట్ సామ యాదిరెడ్డి గార్డెన్ లో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అంశంపై ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై తొలిసారిగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించాం.పాలమూరు ప్రాజెక్టుపై కేసీఆర్ చెప్పిన వాస్తవాలను పక్కన పెట్టి కాంగ్రెస్ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.90 శాతం పనులు పూర్తయినా మిగిలిన 10 శాతం పనులను ఎందుకు పూర్తి చేయడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పాలమూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్ను వేసి, కనీసం చర్చ కూడా చేయలేదు. “పాలమూరు బిడ్డ”నని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు.తెలంగాణ రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం రెండు అతిపెద్ద ప్రాజెక్టులు ప్రారంభించింది — కాళేశ్వరం, పాలమూరు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసుల కారణంగా ఆలస్యం జరిగింది, లేకుంటే ఎప్పుడో పూర్తయ్యేది.అన్ని కేసులు కొట్టివేసిన తర్వాత 30 వేల కోట్ల రూపాయలతో కేసీఆర్ పాలమూరు పనులకు శంకుస్థాపన చేశారు 27 వేల కోట్లతో రిజర్వాయర్ల పనులు పూర్తయ్యాయి. ఇంకా రెండు కిలోమీటర్ల కాలువ తవ్వితే నీళ్లు వస్తాయని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు.పాలమూరు ప్రాజెక్టు పూర్తైతే 7 నియోజకవర్గాలకు సాగునీరు అందేలా ప్రణాళిక రూపొందించాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రూపాయి కూడా కేటాయించలేదు, తట్ట మట్టి కూడా తీయలేదు.45 టీఎంసీలు సరిపోతాయని మంత్రి ఉత్తమ్ ఎందుకు లేఖ రాశారో ప్రజలకు చెప్పాలి.గత 10 ఏళ్లలో కేసీఆర్ రైతులకు ఉచిత కరెంట్, ప్రాజెక్టులు, రిజర్వాయర్ల ద్వారా సాగునీరు అందించారు. కేసీఆర్‌ను విమర్శించడమే కాదు, ముందుగా మిగిలిన పనులు పూర్తి చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా కూలిపోవాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. సీఎం తన సొంత నియోజకవర్గానికి మాత్రమే నీళ్లు తీసుకెళ్లాలని చూస్తున్నారా? మిగతా నియోజకవర్గాలకు నీళ్లు అవసరం లేదా అని ఘాటుగా స్పందించారు. ఇట్టి అంశంపై కెసిఆర్ అధ్యక్షతన మా కార్యచరణ కొనసాగుతుందని తెలిపారు.ఈ సమావేశంలోరంగారెడ్డి జిల్లా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ , మహేష్ రెడ్డి , మెతుకు ఆనంద్ , పైలెట్ రోహిత్ రెడ్డి , ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి , సీనియర్ నాయకులు క్యామ మల్లేష్ , రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

రంగారెడ్డి

* పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కాంగ్రెస్ శీతకన్ను –పాలమూరు బిడ్డ”నని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు –కేసీఆర్‌ను విమర్శించడమే కాదు, ముందు మిగిలిన పనులు పూర్తి చేయాలి. —సబితా ఇంద్రారెడ్డి మరియు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక సమావేశం..

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 24 : మహేశ్వరం నియోజకవర్గంలోని జిహెచ్ఎంసి మీర్పేట్ సామ యాదిరెడ్డి గార్డెన్ లో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అంశంపై ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై తొలిసారిగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించాం.పాలమూరు ప్రాజెక్టుపై కేసీఆర్ చెప్పిన వాస్తవాలను పక్కన పెట్టి కాంగ్రెస్ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.90 శాతం పనులు పూర్తయినా మిగిలిన 10 శాతం పనులను ఎందుకు పూర్తి చేయడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పాలమూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్ను వేసి, కనీసం చర్చ కూడా చేయలేదు. “పాలమూరు బిడ్డ”నని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు.తెలంగాణ రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం రెండు అతిపెద్ద ప్రాజెక్టులు ప్రారంభించింది — కాళేశ్వరం, పాలమూరు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసుల కారణంగా ఆలస్యం జరిగింది, లేకుంటే ఎప్పుడో పూర్తయ్యేది.అన్ని కేసులు కొట్టివేసిన తర్వాత 30 వేల కోట్ల రూపాయలతో కేసీఆర్ పాలమూరు పనులకు శంకుస్థాపన చేశారు 27 వేల కోట్లతో రిజర్వాయర్ల పనులు పూర్తయ్యాయి. ఇంకా రెండు కిలోమీటర్ల కాలువ తవ్వితే నీళ్లు వస్తాయని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు.పాలమూరు ప్రాజెక్టు పూర్తైతే 7 నియోజకవర్గాలకు సాగునీరు అందేలా ప్రణాళిక రూపొందించాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రూపాయి కూడా కేటాయించలేదు, తట్ట మట్టి కూడా తీయలేదు.45 టీఎంసీలు సరిపోతాయని మంత్రి ఉత్తమ్ ఎందుకు లేఖ రాశారో ప్రజలకు చెప్పాలి.గత 10 ఏళ్లలో కేసీఆర్ రైతులకు ఉచిత కరెంట్, ప్రాజెక్టులు, రిజర్వాయర్ల ద్వారా సాగునీరు అందించారు. కేసీఆర్‌ను విమర్శించడమే కాదు, ముందుగా మిగిలిన పనులు పూర్తి చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా కూలిపోవాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. సీఎం తన సొంత నియోజకవర్గానికి మాత్రమే నీళ్లు తీసుకెళ్లాలని చూస్తున్నారా? మిగతా నియోజకవర్గాలకు నీళ్లు అవసరం లేదా అని ఘాటుగా స్పందించారు. ఇట్టి అంశంపై కెసిఆర్ అధ్యక్షతన మా కార్యచరణ కొనసాగుతుందని తెలిపారు.ఈ సమావేశంలోరంగారెడ్డి జిల్లా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ , మహేష్ రెడ్డి , మెతుకు ఆనంద్ , పైలెట్ రోహిత్ రెడ్డి , ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి , సీనియర్ నాయకులు క్యామ మల్లేష్ , రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.