Friday, 13 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

మనెపల్లి జ్యువెల్లర్స్‌లో డిజిటల్ గోల్డ్ యాప్ ప్రారంభం

పున్నమి ప్రతినిధి Manepally Jewellers Pvt. Ltd. వినియోగదారుల సౌకర్యార్థం ‘డిజిటల్ గోల్డ్ యాప్’ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా రోజువారీ బంగారం ధరలను తెలుసుకోవడంతో పాటు 10 గ్రాముల బంగారంపై పెట్టుబడి చేసే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. 24 క్యారెట్ల డిజిటల్ గోల్డ్ కొనుగోలు, భద్రత, పారదర్శకతతో సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతతో పెట్టుబడిదారులకు ఇది అనుకూలమని తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కార్ జోన్ అల్ట్రా కేర్ & డీటైలర్స్‌లో వాహన సంరక్షణ సేవలు

నెల్లూరు — పున్నమి ప్రతినిధి Car Zone Ultra Care & Detailers లో కార్లకు సంబంధించిన ఆధునిక సంరక్షణ సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్ వాషింగ్, ఇంటీరియర్ క్లీనింగ్, పాలిషింగ్, డీటైలింగ్ వంటి సేవలను నిపుణుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నాణ్యమైన మెటీరియల్స్‌తో వాహనాల మెరుపు, రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. వాహన యజమానులు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

అన్నమయ్య

రాజంపేట పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శిగా షేక్ అబ్దుల్ కరీం నియామకం –

తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని మరోసారి నిరూపితమైంది. రాజంపేట పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శిగా ముస్లిం కమ్యూనిటీకి చెందిన అబ్దుల్ కరీం షేక్ నియమించినందుకు పార్టీ అధిష్టానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ​గత కొన్నేళ్లుగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, క్షేత్రస్థాయిలో పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొంటూ, తెలుగుదేశం సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన శాయశక్తులా కృషి చేశారు అని. పార్టీ పట్ల ఆయన చూపిన అంకితభావాన్ని, కష్టాన్ని గుర్తించి ఆయనకు ఈ కీలక బాధ్యతను అప్పగించడం గర్వంగా ఉంది అని తెలిపారు. ​అధిష్టానానికి కృతజ్ఞతలు: నాపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన: ​ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ​రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, యువ నాయకుడు నారా లోకేష్ ను ​రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ జగన్ మోహన్ రాజును ​రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ​ముందుకు సాగే దిశ: ముస్లిం మైనారిటీల గొంతుకగా ఉంటూనే, రాజంపేట పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, రాబోయే రోజుల్లో పార్టీ విజయాల్లో కీలక పాత్ర పోషించేందుకు నిరంతరం శ్రమిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. నాకు అప్పగించిన ఈ బాధ్యతను ఒక సవాలుగ నాయకత్వానికి మరియు కార్యకర్తలకు మధ్య వారధిగా పనిచేస్తానని పేర్కొన్నారు.

E-పేపర్

సనిబోయిన గంగులయ్య తృతీయ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు..

సనిబోయిన గంగులయ్య తృతీయ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు.. రైల్వే కోడూరు మేజర్ న్యూస్ చిట్వేల్ మండలం పోల్లో పల్లె జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ నందు చిల్లావాండ్లపల్లె గ్రామానికి చెందిన కీర్తిశేషులు అయినటువంటి సనిబోయిన గంగులయ్య గారి జ్ఞాపకార్థం కోరకు వారి సతిమని శ నిబోయిన కృష్ణమ్మ భర్త జ్ఞాపకార్థముగా లెటర్ ప్యాడ్స్ ,పెన్సు,బుక్స్ పెన్సిల్స్ ,వివిధ రకాలైన ప్రోత్సాహక బహుమతులు హెడ్మాస్టర్ అమర్నాథ్ వారి మీదుగా పిల్లలకు మరియు కృష్ణమ్మ విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది . అందులో భాగంగా టెన్త్ క్లాసు లో ఫస్ట్ క్లాస్ వచ్చినవారికి మరియు ప్రధమ,ధృతీయ,తృతీయ బహుమతులు అందజేస్తామని వారు కుటుంబ సభ్యులు తెలియజేశారు.ప్రతి ఒక్క విద్యార్థి మెరుగైన మార్కులతో విజయం సాధించాలని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమం కుమారుడు శ నిబోయిన నరసింహులు మరియు కుటుంబ సభ్యులు అధ్వర్యం లోజరిగింది.

నంద్యాల

మహానంది క్షేత్రంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ పూజలు

మహానంది : పరమ పవిత్రమైన మహానంది పుణ్యక్షేత్రం లో శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ జాన్సీ లక్ష్మీ పూజలు నిర్వహించారు. బుధవారం స్వామివార్ల దర్శనార్ధమై వచ్చిన ఆమెకు ఆలయ ఉద్యోగులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీకామేశ్వరీ దేవి సమేత మహానందీశ్వర స్వామివార్ల కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణ మండపంలో వేదపండితులు శాంతారామ్ భట్ వేద మంత్రోత్సరణ మధ్య ఈఓ శ్రీనివాస రెడ్డి స్వామివారి చిత్ర పటం తో పాటు ప్రసాదాలను అందజేశారు. వారివెంట ఏ ఈఓ మధు, తదితరులు వున్నారు.

E-పేపర్

మహానంది క్షేత్రంలో 30 న వైకుంఠ ఏకాదశి వేడుకలు

మహానంది : మహానంది క్షేత్రంలో వెలసిన శ్రీ సీతాలక్ష్మణ హనుమత్సమేత కోదండరామ స్వామి వారికి ఈ నెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ఎన్ .శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ క్షేత్రంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్సవమూర్తులను విశేషాలంకరణతో, ఉత్తరద్వారం వద్ద కొలువుతీర్చి ఉత్తర ద్వార పూజ, ప్రత్యేక అర్చనలు తిరుప్పావై సేవలు నిర్వహిస్తారన్నారు. కోదండరామాలాయంలో 500 కేజీల వివిధ రకాల సుగంధభరిత పుష్పాలతో లోకకళ్యాణార్థం లక్ష పుష్పార్చన వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లోక కల్యాణార్థం చేసే ఈ లక్ష పుష్పోత్సవానికి దాతగా నంద్యాల మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ప్రతియేడాది సహకరిస్తున్నారని అన్నారు. నంద్యాలలో మాజీ ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవాలకు ఆహ్వానించారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో మధు, వేదపండితులు రవిశంకర అవధాని పాల్గొన్నారు.

కాకినాడ

తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షురాలిగా గొల్లు వరలక్ష్మి.

రౌతులపూడి, (పున్నమి ప్రతినిధి)డిసెంబర్ 24: తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షురాలుగా రౌతులపూడి మండలం ఎస్ పైడిపాల గ్రామానికి చెందిన గొల్లు వరలక్ష్మి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా రౌతులపూడి మండల అధ్యక్షులు తమరాల సత్యనారాయణ, రౌతులపూడి మండల అధ్యక్షురాలు గంటి మల్ల రాజ్యలక్ష్మి, రాష్ట్ర బీసీ సెల్ డైరెక్టర్ పైల సాంబశివరావు, మాజీ ఎంపీపీ ఇటం శెట్టి భాస్కర్ బాబు, ఎస్ పైడిపాల మాజీ సర్పంచ్ ఈగల సత్తిబాబు పలువురు నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గొల్లు వరలక్ష్మి మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు ఈ బాధ్యతలు అప్పజెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు ప్రతిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వరలక్ష్మి అన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సేవలో పి.వి సింధు

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్ డిసెంబర్ 24, శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవార్ల దర్శనార్ధం బుధవారం నాడు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి సింధు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వీరికి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు శ్రీ కొట్టే సాయి సాదరంగా స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించారు. అనంతరం వేదపండితులు వేద మంత్రాలతో ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేసి శ్రీ స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలు, చిత్రపటం, శేషవస్త్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

తొట్టంబేడులో సిమెంట్ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన-రావిళ్ల

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 24, తొట్టంబేడు మండల పంచాయతీ అరుంధతి వాడ నుండి పాతఊరు వరకు 284 మీటర్లు 10 లక్షలు సిమెంట్ రోడ్డుకు బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు రావిళ్ల మునిరాజు నాయుడు ఆధ్వర్యంలో భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలతో మండలంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు,తంగేళ్లపాలెం పిఎసిఎస్ బ్యాంక్ చైర్మన్ భాస్కర్ ముదిరాజ్,మనీ అలియార్ సుబ్రహ్మణ్యం,చందు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీ సిధార్థ పాఠశాలల్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 24, శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ సిధార్థ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుధవారం ముందస్తుగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహుకులు మాట్లాడుతూ.. శాంతికి, సంతోషానికి చిహ్నం క్రిస్మస్ పండుగని, జీసస్ శాంతికి ప్రతిరూపమని చెడు చేసినా మంచిని పంచే తత్వా ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలన్నారు. వేడుకల సదర్బంగా పాఠశాల చిన్నారులు మరియమ్మ, ఏసేపు, దేవదూతలు, జ్ఞానులు, హేరోజు రాజు, శ్యాస్తులు, గొల్లలు, క్రిస్మస్ ట్రీ తదితర వేషధారణలతో చిన్నారులను అలరించారు. అనంతరం కేక్ కట్ చేసి చిన్నారులకుపంచడం జరిగియనది. చిన్నారులు వేసిన పలు వేషధారణలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.