Friday, 13 March 2026

Blog

రాజన్న సిరిసిల్ల

గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ బాట పట్టిన సర్పంచ్

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం రామచంద్రపురం గ్రామ సర్పంచ్ గంధం శ్రీనివాస్ గారు వార్డు సభ్యులు సత్యం శేఖర్ గంధం రాజు యాదగిరి సత్యపాల్ గారు నేడు కేకే మహేందర్ రెడ్డి గారి సమక్షంలో వారి స్వగ్రామమైన నామాపూర్ లో కాంగ్రెస్ పార్టీలో చేరారు గ్రామ శాఖ అధ్యక్షులు దాకూరి మాధవరెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ తోని గారి ఆధ్వర్యంలో స్పాట్లో చేరారు ఈ సందర్భంగా వారిని కేకే మహేందర్ రెడ్డి గారు వారికి శాలువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలనపై వారికి అండగా ఉంటామని వారికి భరోసా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవీణు గుగ్గిల శ్రీకాంత్ బైరినేని రాము సత్తు శ్రీనివాస్ గారు తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు

కామారెడ్డి

అధికారుల నిర్లక్ష్యం!! దవాఖాన ఆవరణే చెత్త మైదానం

కామారెడ్డి, 26డిసెంబర్, పున్నమి ప్రతినిధి : రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలో మూలన పడి కుళ్ళిపోతున్న శవ పేటిక సామాన్లు కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో శవపేటిక, ఇనుప గరిటెలు, కార్డ్బోర్డు పెట్టెలు గడ్డి మధ్య పడి ఉన్నాయి.రోగుల కోసం ఉండాల్సిన ఆవరణలోనే చెత్త పేరుకుపోయి, దవాఖాన ప్రతిష్టను, పరిశుభ్ర తను తుడిచిపెట్టేస్తోం ది అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగితాలపై మాత్రమే అంబు లెన్స్ సేవరామారెడ్డి మండలానికి 108 అత్యవసర అంబులెన్స్ సేవ అందుబాటులో ఉండాల్సినా, ప్రస్తుతం ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే విధం గా ఆ సదుపాయం కనిపించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 108 అంబులెన్సులు 24 గంటలు ఉచితంగా సేవ లు అందించాలన్నే ప్రభుత్వ నిబంధనలు కానీ అత్యవసర సమయంలో డీజిల్ పేరుతో డబ్బులు అడుగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. అధికారుల కోసమే అంబులెన్స్… అన్న మండిపాటుదవాఖాన ముందు నిలిపిన అంబులెన్స్ సాధారణ పేద రోగికి అందని ద్రాక్షలా మారి, అధికారులు, ప్రభావశీలుల కోసం మాత్రమే కదులుతుందనే మాటలు మండలంలో వినిపిస్తు న్నాయి. మాకు హార్ట్ ఎటాక్ వస్తే పట్టించుకునే వా రు లేరు,పెద్దలకేం అయితే ఈ అంబులెన్స్ స్టార్ట్ అవుతుంది అని ప్రజలు విరుచుకుపడుతున్నా రు. డ్రైవర్ జీతం లక్షల్లో, సేవ మాత్రం బీటల్లో? తెలంగాణలో అంబులెన్స్ డ్రైవర్లకు నెలకు 15 నుండి 25 వేల వరకు జీతాలు ఇస్తున్న ఉద్యోగ ప్రకటనలు కనిపిస్తున్న పరిస్థితిలో, రామారెడ్డి ప్రజలు తమ మండలంలో మాత్రం ఒక అంబు లెన్సు డ్రైవర్ 35 వేల వరకూ ఖర్చు పెడుతూ నిరు పేదలకు సేవ చేయడం లేదని ఆరోపిస్తున్నా రు.పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్న రూపాయలు, ఆరోగ్య బడ్జెట్ ద్వారా వస్తున్న నిధు లు చివరికి శవపేటికల లా మూలన పడిపోవడం చూస్తుంటే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఓపెన్ ఛాలెంజ్108 అంబులెన్స్ సేవ ఉచితం, ఎవరైనా కాల్ చేసుకునే హక్కు ఉందని చెప్పే ప్రభుత్వ నియమాలు అమలు అవుతున్నాయా లేదా స్వయంగా వెళ్లి చూడాలని జిల్లా మెడికల్, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ప్రజల సంఘాలు సవాల్ విసురుతున్నాయి.రా మారెడ్డి సర్విస్ అంబులెన్సు ను విధిగా నూతనం గా ప్రవేశ పెట్టాలి, శవపేటిక సామాన్లు, చెత్త తొల గింపు, అంబులెన్స్ నిజంగా పేదలకు అందుబాటు లోకి వచ్చేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కరంటోళ్ళ జన బాట కార్యక్రమం

ఎస్పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ 26( పున్నమి ప్రతినిధి), కరెంటోళ్ల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే ఉద్దేశంతో నిర్వహించిన జనబాట కార్యక్రమంలో భాగంగా మనుబోలు మండలంలోని వీరంపల్లి గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులు పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఏడిఇ సుబ్రహ్మణ్యంగారు, ఏఈ అనిల్ కుమార్ గారు, జేఈ రాంబాబుగారుతో పాటు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో కరెంటోళ్లకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

కామారెడ్డి

ఘన సన్మాన సభ.. సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు ఒడ్డేర సంఘం గొప్ప గౌరవం!

కామారెడ్డి, 26డిసెంబర్, పున్నమి ప్రతినిధి : కామారెడ్డి జిల్లా, రామారెడ్డిమండలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన నాయకులకు ఘన సన్మానం! ఒడ్డేర సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాత్మక కార్యక్రమం మండల కేంద్రాన్ని ముంచెత్తింది. మహి ళలు, యువకులు, సంఘ సభ్యులు అధిక సంఖ్య లో విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఎన్నికల్లో గెలిచిన గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్ కుమార్, ఉపసర్పంచ్ హన్మోయ్యాల నవీన్, 3వ వార్డు సభ్యుడు పిప్పరి లింబాద్రి, 8వ వార్డు సభ్యుడు చింతకుంట భాస్కర్లకు ఒడ్డేర సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. సంఘం ప్రతి నిధులు ప్రదాతలుగా నిలబడి, గౌరవాలు అందజే శారు.ఈసందర్భంగా సర్పంచ్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల కు ప్రాధాన్యత ఇస్తానని, ప్రజల సమస్యలు త్వర గా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.కాలనీ రోడ్డు సమస్యకు స్పందన.. సర్పంచ్ ధృష్టి, సానుకూల హామీ ఇచ్చారు.ఇదే సమయంలో కాలనీలో రోడ్డు మధ్యలో చెడిపోయిన సమస్యను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సర్పంచ్, దీనిని త్వరలోనే బాగుచేస్తానని హామీ ఇచ్చారు. కాలనీ వాసులు ఈ సానుకూల స్పందనపై సంతోషం వ్యక్తం చేసుకున్నారు. ఇది సర్పంచ్‌ల పాలిటిక్స్ కాకుండా ప్రజాసేవా మనసులో ఉన్నారని స్పష్టం చేసింది. వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక దృష్టి.. లింబాద్రికి జిల్లా నాయకుల సన్మానం మరోవైపు, 3వ వార్డు అభ్యర్థిగా గెలిచిన పిప్పరి లింబాద్రికి వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు చతరబోయిన నరేందర్ ఘన సన్మా నం చేశారు. మాట్లాడిన నరేందర్, “అర్హత గల విక లాంగులకు పింఛన్యాధారాలు సరళంగా అందేలా చూడాలి. గ్రామంలో వికలాంగుల సంక్షే మానికి ప్రాధాన్యత ఇవ్వాలి” అని కోరారు. దీనికి లింబాద్రి సానుకూలంగా స్పందించి, తప్పక చేస్తాన ని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం గ్రామంలో ఐక్యత, అభివృ ద్ధి ఆకాంక్షలతో కలిసి మరింత ఉత్సాహాన్ని నింపిం ది.రామారెడ్డి మండల ప్రజలు తమ నూతన నాయకులపై అపార ఆశలు పెట్టుకున్నారు.

చిత్తూరు

శ్రీవారి సేవలో పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం : 15 టన్నుల కూరగాయలు వితరణ

శ్రీవారి సేవలో పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం : 15 టన్నుల కూరగాయలు వితరణ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే భక్తులకు నిత్య అన్నప్రసాద వితరణకు పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం ఉదారత చాటుకుంది. సంఘం ఆధ్వర్యంలో సుమారు 15 టన్నుల కూరగాయలను టీటీడీ అన్నప్రసాద విభాగానికి విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా బలిజ సంఘం నాయకులు మాట్లాడుతూ.. “శ్రీవారి అన్నదాన సేవలో పలమనేరు బలిజ అభ్యుదయ సేవ సంఘం తరపున భాగస్వాములు కావడం తమ పూర్వజన్మ సుకృతమన్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామని వారు వెల్లడించారు. స్వామివారి భక్తులకు సేవ చేయడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు. కూరగాయలు వితరణలో తమ వంతు సాయం అందించిన బలిజ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. టీటీడీ కూరగాయలు ప్రతినిధులు అందజేసిన సంఘం సభ్యులను అభినందించి, సన్మానించి వారికి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. భక్తిశ్రద్ధలతో వాహనాన్ని ప్రత్యేకంగా పూలమాలలతో అలంకరించి, సంఘ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరుమలకు పంపారు. ఈ కార్యక్రమంలో పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం నాయకులు సుధాకర్, పిజెసి బాబు, రూపేష్, అరుణ్ కుమార్, సుదర్శన్ బాలాజీ, కోటీశ్వరులు, శివకుమార్, మంజునాథ్, అమ్ములు, గణేష్, లక్ష్మీపతి, జయశంకర్, సోమశేఖర్, పుష్పాలు వెంకటేశ్వర్లు, చిట్టి, శంకరప్ప , సుబ్రహ్మణ్యం, నరసింహులు, గోవర్ధన్, ప్రేమ్, దేవా, సుబ్బు, భాస్కర్,చంద్ర, జగ్గా, శ్రీధర్, ఆనంద, రెడ్డప్ప, రమణ, వేణు లతోపాటు బలిజ సంఘం సభ్యులు మరియు టీటీడీ కూరగాయలు ప్రతినిధులు రవీంద్ర రెడ్డి, కిషోర్ స్వామి, భరద్వాజ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

అన్న క్యాంటీన్లు సందర్శించిన ఇంచార్జ్ కమిషనర్ సత్యనారాయణ*

*కాకినాడ జిల్లా కాకినాడ నగరం:* రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన, పౌష్టికాహారం అందిస్తున్నామని కాకినాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ ఎన్.పి.వి. సత్యనారాయణ తెలిపారు.శుక్రవారం ఆయన కాకినాడ జగన్నాధపురం అన్నమ్మఘాటి సెంటర్ వద్ద గల అన్న క్యాంటీన్‌ను సందర్శించి ఏర్పాట్లు, సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నేరుగా ప్రజలతో మాట్లాడి క్యాంటీన్ సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. సిబ్బంది పనితీరును కూడా ఆయన పరిశీలించి సూచనలు చేశారు.అన్న క్యాంటీన్‌లో అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయని, అందుతున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నామని ప్రజలు ఇంచార్జ్ కమిషనర్‌కు తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన, అన్న క్యాంటీన్ సేవలపై ప్రజల్లో మంచి స్పందన ఉందని, భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రజల నుంచి నిరంతరం ఫీడ్బ్యాక్తీ తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృధ్వి చరణ్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

* మహేశ్వరం మండల కేంద్రంలో బంగ్లాదేశ్ జిహాదుల దిష్టిబొమ్మ దహనం –వీహెచ్పీ–బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో నిరసన *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 26 : మండల కేంద్రంలో బుధవారం బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింస, హత్యలు, అవమానాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ వీహెచ్పీ (విశ్వ హిందూ పరిషత్), బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.అంబేద్కర్ విగ్రహం నుంచి పై చౌరస్తా వరకు ర్యాలీగా సాగిన కార్యకర్తలు, బంగ్లాదేశ్‌లో జిహాదులు హిందువులపై చేస్తున్న దౌర్జన్యాలను ఖండిస్తూ నినాదాలు చేశారు. అనంతరం బంగ్లాదేశ్ జిహాదుల దిష్టిబొమ్మను దహనం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యలు, ఆలయాల విధ్వంసం తక్షణమే ఆగాలని డిమాండ్ చేశారు. హిందువుల రక్షణ కోసం అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని, భారత ప్రభుత్వం ఈ అంశంపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ నిరసన కార్యక్రమంలో వీహెచ్పీ, బజరంగ్‌దళ్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక హిందూ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రంగారెడ్డి

* అటల్ బిహారీ వాజ్‌పేయి సేవలు దేశానికి చిరస్మరణీయం – శ్రీరాములు అందెల *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 26 : మహేశ్వరం నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బడంగ్‌పేట్ డివిజన్, నాదర్‌గుల్ గ్రామంలో మాజీ కార్పొరేటర్ నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్‌చార్జ్ అందెల శ్రీరాములు హాజరై, అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేశారు.=ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ, “అటల్ బిహారీ వాజ్‌పేయి భారత రాజకీయాల్లో ఒక అపూర్వమైన నాయకుడు అని కవి హృదయంతో రాజకీయాల్లోకి వచ్చి, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మహానేత అని కొనియాడారు. అణు పరీక్షల ద్వారా భారతదేశానికి ప్రపంచస్థాయిలో గౌరవాన్ని తీసుకువచ్చిన ఘనత వాజ్పేయి దేనని, సువర్ణ చతుర్భుజి రహదారి ప్రాజెక్ట్ ద్వారా దేశ మౌలిక వసతుల అభివృద్ధికి బాటలు వేసిన దూరదృష్టి కలిగిన ప్రధానిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. అలాగే “సర్వధర్మ సమభావం, సమన్వయ రాజకీయాలు, విలువలతో కూడిన పాలన వాజ్పేయి గారి ప్రత్యేకత” అని తెలిపారు. ప్రస్తుత తరం నాయకులు వాజ్‌పేయి ఆదర్శాలను అనుసరించి ప్రజాసేవలో ముందుకు సాగాలని, ఆయన చూపిన మార్గమే దేశానికి శ్రేయస్కరమని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బిజెపి అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు , కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొని అటల్ బిహారీ వాజ్‌పేయి సేవలను స్మరించుకున్నారు.

రంగారెడ్డి

* అయ్యప్ప స్వామి సేవలో ఎలిమేటి అమరేందర్ రెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్26 : మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ అయ్యప్ప సేవ సమితి ప్రాంగణంలో గురుస్వామి వంగేటి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడి పూజ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేసిన టీపీసీసీ సెక్రటరీ ఎలిమేటి అమరేందర్ రెడ్డి ఈ పూజ కార్యక్రమంలో గురుస్వాములు కృష్ణం రాజు గౌడ్ , జూకంటి సురేష్ గౌడ్ , లడ్డు శ్రీకాంత్, గుండోజి వెంకట చారి, బద్దం మల్ల రెడ్డి , అత్తాపురం సీతారాం రెడ్డి , చిరంజీవి లాల్ , కొంతం శ్రీనివాస్ రెడ్డి మాలాద్రి. అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు

Blog

నంద్యాల సెయింట్ మాథ్యూస్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు: ఎన్ఎండి ఫరూక్

నంద్యాల పట్టణం జ్ఞానాపురంలోని సి.ఎస్.ఐ. సెయింట్ మాథ్యూస్ చర్చి (ఫాస్ట్రేట్ -3) నందు క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చర్చి ప్రాంగణంలో మంత్రి ఫరూక్ కి క్రైస్తవ పెద్దలు, సంఘ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి ఫరూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రేమ, కరుణ, శాంతి అనే సుగుణాలను చాటిచెప్పిన ఏసుక్రీస్తు జన్మదినం మానవాళికే పండుగ రోజని మంత్రి కొనియాడారు. నంద్యాల జిల్లా మత సామరస్యానికి ప్రతీక అని, ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో పండుగలు జరుపుకోవడం సంతోషదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మన్నె కృపాకర్, 33వ వార్డు టీడీపీ ఇంచార్జ్ జోసెఫ్, 26వ వార్డు టిడిపి ముఖ్య నాయకులు మల్లెల భాస్కర్, మాజీ కౌన్సిలర్ కొండారెడ్డి, జార్జ్, శరత్, దివాకర్, సందీప్, దేవరాజ్, ఓబులేష్ మరియు పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.