Friday, 13 March 2026

Blog

చిత్తూరు

నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి* *ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే అమర్*

నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి* *ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే అమర్* నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పలమనేరు శాసనసభ్యులు ఎన్. అమరనాథ రెడ్డి ఆకాంక్షించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం జనసందోహంగా మారింది. గురువారం ఉదయం నుంచే నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు, ప్రభుత్వ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలోని ప్రముఖ ఆలయాల నుండి విచ్చేసిన అర్చకులు ఎమ్మెల్యేకు వేదాశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రజలందరూ అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తనను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, వారికి నూతన సంవత్సరంతో పాటు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. నాయకులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

E-పేపర్

మండల అధ్యక్షుడు ఆలంపల్లి నరసింహ 9వ వార్డు నెంబర్ ఆలంపల్లి మహేష్ కి ఘనంగా సన్మానం

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని మేడిపల్లి నక్కర్త గ్రామంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన 9వ వార్డు నెంబర్ ఆలంపల్లి మహేష్ కి ఈరోజు ఘనంగా సన్మానం ప్రజా సమస్యలపై గ్రామపంచాయతీలో గలమెత్తి ప్రశ్నించే ప్రజా గొంతుక కావాలని తమ్మునికి చిన్న సన్మానం చేస్తున్న ఆలంపల్లి నరసింహన్న వారి మిత్రబృందం

అన్నమయ్య

రైల్వే కోడూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి

– ప్రభుత్వానికి ఏపీ సమగ్ర అభివృద్ధి అధ్యయన వేదిక డిమాండ్ – ఐదు మండలాల ప్రజలకు పరిపాలన చేరువ కావాలి: తుంగా లక్ష్మీనారాయణ చిట్వేలు, జనవరి 1పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలను కలుపుతూ ప్రత్యేకంగా రైల్వే కోడూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్ తుంగా లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం చిట్వేలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -తిరుపతిలో కలపడం హర్షణీయం రైల్వే కోడూరు శాసనసభ నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలుపుతూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం సముచితమైనదని ఆయన పేర్కొన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు బాలాజీ జిల్లాను ప్రతిపాదించినప్పుడే, కోడూరును అందులో కలపాలని ప్రజలు కోరుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. -దూరభారం తగ్గించడమే లక్ష్యం ప్రస్తుతం కోడూరు, చిట్వేలి, పెనగలూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట మండలాలు రాజంపేట రెవెన్యూ డివిజన్ నుండి విడిపోయి తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలోకి చేరాయని, దీనివల్ల ప్రజలకు పరిపాలనాపరంగా దూరం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఐదు మండలాల పరిధితో మడకశిర, బనగానపల్లె రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తున్న తరుణంలో, అదే తరహాలో రైల్వే కోడూరును కూడా డివిజన్‌గా ప్రకటించాలని కోరారు.ఐదు మండలాల ప్రజలకు రైల్వే కోడూరు కేంద్ర బిందువుగా ఉంటుందని, తద్వారా పరిపాలన సౌలభ్యంగా మారుతుందని సూచించారు.వెంటనే స్పందించి రైల్వే కోడూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నూతన ఆంగ్ల సంవత్సరాన్ని ఘనంగా స్వాగతించిన ఎన్డీఏ కూటమి శ్రేణులు – ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుకు శుభాకాంక్షలు

నూతన ఆంగ్ల సంవత్సరాన్ని ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ను పలకరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వివిధ గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు స్వగ్రామమైన ఐతవరం గ్రామానికి గురువారం భారీగా తరలివచ్చారు. నేరుగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, సామాజిక మాధ్యమాల ద్వారా కూడా తమ అభిమానాన్ని చాటుకున్నారు.అందరినీ ఆప్యాయంగా స్వాగతించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు, పేరు పేరునా పలకరిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 సంవత్సరం ప్రజలందరికీ సంతోషం, శ్రేయస్సు కలిగించాలని ఆకాంక్షించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అన్నారు. పేదల సంక్షేమంతో పాటు ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మైలవరం నియోజకవర్గ పరిధిలోని విజయవాడ రూరల్, ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీ, జి.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం మండలాల నుంచి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ను కలిశారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో నూతన సంవత్సర శుభాకాంక్షల వెల్లువ

నందిగామ పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయం నూతన సంవత్సర శుభాకాంక్షలతో కళకళలాడింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎన్డీఏ కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యాలయానికి తరలివచ్చి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయానికి వచ్చిన ఎన్డీఏ కుటుంబ సభ్యులు, నియోజకవర్గ ప్రజలు, అధికారులు, పార్టీ శ్రేణులకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరం ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, అభివృద్ధి, సంక్షేమం కలగజేయాలని ఆకాంక్షించారు. కూటమి పాలనలో ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు

నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.నందిగామ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో నూతన సంవత్సర వేడుకలు కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు కేకును కట్ చేసి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు.నియోజకవర్గంలోని నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రముఖులు జగన్మోహన్ రావును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాలు వెల్లివిరియాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన భగవంతుని ప్రార్థించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మనుబోలు–చెర్లోపల్లి టిడిపి నాయకులు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మరియు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గార్లను మనుబోలు రాజా గౌడ్, కాగితాలపురి వెంకటరమణారెడ్డి, చెర్లోపల్లి నీటి సంఘం ఉపాధ్యక్షులు పొన్నూరు అశోక్, టిడిపి సీనియర్ నాయకులు కలికి వేణుగోపాల్ రెడ్డి, కుడితిపల్లి గోపిరెడ్డి ప్రసాద్ తదితర కార్యకర్తలు, అభిమానులు మర్యాదపూర్వకంగా కలుసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని శాలువాతో సత్కరించి ఘనంగా అభినందించారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

E-పేపర్

నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలి: ఫాదర్ జోసెఫ్ పాలడుగు ఆకాంక్ష

పెద్ద అవుటపల్లి(ఉంగుటూరు మండలం): జనవరి 1 పున్నమి ప్రతినిధి నూతన సంవత్సరం 2026 సందర్భంగా ఉంగుటూరు మండల ప్రజలకు మరియు భక్తులకు పెద్ద అవుటపల్లి ష్రైన్ రెక్టర్ ఫాదర్ జోసెఫ్ పాలడుగు (ఫాదర్ జోసెఫ్ పాలడుగు ఓఎఫ్ఎం క్యాప్.) తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ​ఈ సందర్భంగా ఆయన ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేస్తూ, గడిచిన కాలంలోని బాధలను, ఆందోళనలను మర్చిపోయి.. సరికొత్త ఆశలతో, ఉత్సాహంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. 2026వ సంవత్సరం సరికొత్త అవకాశాలకు వేదిక కావాలని, ప్రతి ఒక్కరూ తమ అంచనాలను అందుకునేలా కృషి చేయాలని కోరారు. ​ప్రేమ, ఆప్యాయతలతో ముందుకు సాగాలి: మన చుట్టూ ఉన్న వారందరినీ సంతోషపరుస్తూ, నలుగురికి ఉపయోగపడేలా జీవించడమే అసలైన నూతన సంవత్సర వేడుక అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, సుఖసంతోషాలతో కూడిన ఉజ్వల భవిష్యత్తును గడపాలని ఆయన ఆశీర్వదించారు.

ఖమ్మం

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర నాయకులు గల్లా సత్యనారాయణ

ఖమ్మం, జనవరి: (పున్నమి ప్రతినిధి) నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్యనారాయణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026 సంవత్సరం ప్రజలందరికీ శాంతి, ఆరోగ్యం, సుఖసంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. దేశాభివృద్ధి, రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకెళ్తోందని పేర్కొన్నారు. కొత్త సంవత్సరం యువతకు నూతన అవకాశాలు కల్పిస్తూ సార్థకంగా మారాలని కోరుకుంటున్నట్లు గ తెలియజేసారు.

వనపర్తి

కాలము కరిగిపోతుంది

*క్యాలెండర్ మారుతుంది కాలం కరిగిపోతుంది* *జ్ఞాపకాలు మిగిలిపోతాయి* *క్యాలెండర్ మారుతుంది కాలం కరిగిపోతుంది నిన్నటి జ్ఞాపకాలు మనసులో తేలియాడుతాయి. ఈరోజు బరువు బాధ్యతలు భుజాలపై నిలుస్తాయి, రేపటి భవిష్యత్తు చింత చెంతనే ఉంటుంది,* *గడిచిన రోజులు నేర్పిన పాఠాలు మిగిలిన రోజులకు దారి దీపాలవుతాయి* *కాలం ఆగదు మన ఆలోచనలు రేపటి కొత్త ఆశను సిద్ధం చేస్తాయి,* *ఆశే మన మనసుకు ఇంధనం …అదే మన ప్రయాణానికి దిక్సూచి..* *డాక్టర్ ఎం ఎన్ విజయకుమార్,* *కవి, రచయిత,* *పాలమూరు జిల్లా*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.