Thursday, 12 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి నివాళులు

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి ఉదయగిరిలో SMGR వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో యాజమాన్యం పూలమాలలు వేసి నివాళులుర్పoచారు కళాశాల ఆసోసియేట్ డీన్ డాక్టర్ జి కృష్ణరెడ్డి పేద పిల్లలు విద్యాభి హృద్దికి మేకపాటి కుటుంబం ఎంతో సహాయం చేశారని కొనియాడారు దాదాపు 100 ఎకరాల పైగా స్థలాన్ని అందించిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. Uploaded Video:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి నుంచి చెన్నై కి డైరెక్ట్ బస్

ఉదయగిరి నుంచి చెన్నై కి సూపర్ లగ్జరీ సర్వీస్ ను ప్రారంభిస్తున్నట్లు RTC డిఎం రమేష్ కుమార్ తెలిపారు రాత్రి 9:30 గంటలకు బస్ బయలుదేరుతుందన్నారు ఆత్మకూర్, నెల్లూర్ సూళ్లూరుపేట మీదుగా చెన్నై కి ఉదయం 4 గంటలకు చేరుతుందన్నారు తిరిగి చెన్నై నుంచి ఉదయం 10:30 నిమిషాలకు బయలుదేరి సాయంత్రం 3:30 నిమిషాలకు ఉదయగిరి వస్తుందన్నారు కావున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నూతన సంవత్సరం రోజు కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే

సీతారామపురం మండలంలో గోనువారిపల్లిలో నూతన సంవత్సరం వేడుకలు జరిగాయి ఈ వేడుకలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు ఆయన కేక్ కట్ చేసి ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు ఆయన మాట్లాడుతూ ఉదయగిరి అభివృద్ధికి సంబంధించిన తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఈ వేడుకలలో ఎమ్మెల్యే పలువురు నాయకులుకు కేక్ కట్ చేసి తినిపించారు. Uploaded Video:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నూతన సంవత్సరం రోజు కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే

సీతారామపురం మండలంలో గోనువారిపల్లిలో నూతన సంవత్సరం వేడుకలు జరిగాయి ఈ వేడుకలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు ఆయన కేక్ కట్ చేసి ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు ఆయన మాట్లాడుతూ ఉదయగిరి అభివృద్ధికి సంబంధించిన తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఈ వేడుకలలో ఎమ్మెల్యే పలువురు నాయకులుకు కేక్ కట్ చేసి తినిపించారు. Uploaded Video:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉపాధ్యాయులకు లంచ్ బ్యాగులు పంపిణీ

సీతారామపురం జనవరి (పున్నమి ప్రతినిధి) సీతారామపురం మండలంలోని యుటిఎఫ్ శాఖకు చెందిన ఉపాధ్యాయులకు గురువారం గోనువారి పల్లి కి చెందిన టిడిపి యువ నాయకుడు కుర్రా రత్తయ్య సీతారామపురం మండల కేంద్రంలోని యుటిఎఫ్ కార్యాలయంలో లంచ్ బ్యాగులను అందించారు. ముందుగా నూతన సంవత్సర కేక్ ను కట్ చేసి ఉపాధ్యాయులకు పంచిపెట్టి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా యుటిఎఫ్ జిల్లా కౌన్సిలర్ ఎడమ తిరుపతయ్య మాట్లాడుతూ సీతారామపురం మండలంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి గుర్తింపు పొందిన కుర్ర రత్తయ్య కు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ టిడిపి మండల కన్వీనర్లు కప్పా ప్రభాకర్ రాజు, వెంగలశెట్టి వెంకటేశ్వర్లు, సొసైటీ అధ్యక్షుడు సోమనబోయిన రాజశేఖర్, మండల టిడిపి యూత్ అధ్యక్షుడు పసుపులేటి వికాస్ బాబు, యుటిఎఫ్ నాయకులు గొడ్లవీటి వెంకటేశ్వర్లు, అన్నంగి ప్రసాదు, డివిఆర్, పవిత్ర కుమారి, మురళి, నరసింహ రాజు, మహేష్, ముజిబా బేగం, నాయకులు షేక్ బాబు, ఏనుగుల సుబ్బరాయుడు, బండి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అనారోగ్య బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేత

సీతారామపురం జనవరి (పున్నమి ప్రతినిధి) సీతారామపురం మండలంలోని బోడ సిద్ధాయ పల్లి గ్రామానికి చెందిన సవరం పద్మావతి అనే మహిళ పక్షవాతంతో మంచాన పడిన విషయాన్ని తెలుసుకుని బాదిత కుటుంబాన్ని ఆదుకునేందుకు సోంపల్లి టిడిపి నాయకుడు నేదురుపల్లి రవి సహకారంతో సీతారామపురం సొసైటీ డైరెక్టర్ పెనుబడి రఘురాములు రెండు నెలలకు సరిపడా నిత్యవసర సరుకులను బాధిత కుటుంబానికి అందజేశారు. గత నాలుగు సంవత్సరాల నుండి సీతారామపురం మండలంలో సేవా కార్యక్రమాలను చేస్తున్న పెనుబడి రఘురాములు ను స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ గొల్లపల్లి భాస్కర్, జనసేన మండల ప్రధాన కార్యదర్శి నేదురుపల్లి రమేష్, టిడిపి నాయకులు నేదురుపల్లి రవి,జోడు ఓబయ్య, బూత్ కన్వీనర్ బందుగుల రమణయ్య, బూత్ ప్రచార కార్యదర్శి భూతపాటి వెంకటరమన, గ్రామ కమిటీ మెంబర్ బత్తల రవి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రోడ్డుపై గుండుపల్లె గ్రామస్తుల నిరసన

సీతారామపురం జనవరి (పున్నమి ప్రతినిధి ) సీతారామపురం మండలంలోని గుండుపల్లి గ్రామం మీదుగా వెళ్లిన 167 బి జాతీయ రహదారి పనుల బాధ్యులు గుండుపల్లె గ్రామానికి జరిగిన నష్ట నివారణ చర్యలను భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గుండుపల్లె గ్రామస్తులు గురువారం 167 బి జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుండుపల్లె గ్రామం మీదుగా 167 బి జాతీయ రహదారి వెళ్లి నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయని అయితే నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు గుండుపల్లె గ్రామంలోకి సర్వీసు రోడ్డు ను ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడంతో గ్రామస్తులు గ్రామంలోకి రాకపోకలు జరపడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అదేవిధంగా గుండుపల్లి గ్రామంలోని వీధులలో ప్రవహిస్తున్న మురుగునీటి కాలువపై జాతీయ రహదారి నిర్మాణ పనులు జరిపారని మురుగు కాలువ ను మళ్లించి మరొక కాలువకు కలిపి మురుగునీటిని గ్రామం బయటకి వెళ్లేలా చర్యలు చేపడతామని చెప్పి పంట పొలాలలోకి మురుగునీరు వెళ్లేలా కాలువలను ఏర్పాటు చేశారని అందువల్ల మురుగు నీరు పొలాల్లోకి చేరడంతో పంటలు పండించేందుకు అనుకూలంగా లేదని వాపోతున్నారు. పొలాలలోకి వెళ్లేందుకు సైతం దారిని కల్పించకుండా పట్టించుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గుండుపల్లి గ్రామ ప్రజల సమస్యలను పట్టించుకోని గుండుపల్లి గ్రామంలోకి సర్వీస్ రోడ్డు, మురుగు నీటిని పంట పొలాల్లోకి కాకుండా బయటకు వెళ్లేలా కాలువలను నిర్మించాలని, అదేవిధంగా పొలాలకు వెళ్లేందుకు జాతీయ రహదారి నుండి పొలాల్లోకి వెళ్లేందుకు దారిని కల్పించాలని గ్రామస్తులు రైతులు కోరుతున్నారు.

E-పేపర్

మేడిపల్లి నక్కర్త గ్రామ సర్పంచ్ నూతనంగా ఎన్నికైన ముచ్చర్ల సుగుణ సంపత్ లకు ఘన సన్మానం

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని మేడిపల్లి నక్కర్త గ్రామ సర్పంచ్ నూతనంగా ఎన్నికైన ముచ్చర్ల సుగుణ సంపత్ కు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

చిత్తూరు

ఏం.టి.ఎస్.ఉపాధ్యాయుల సమస్యలు త్వరలో పరిష్కరిస్తాం – ఎన్.టి.ఏ. రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం… !) ఏం.టి.ఎస్.ఉపాధ్యాయుల సమస్యలు త్వరలో పరిష్కరిస్తాం !)ఎన్.టి.ఏ. రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు రాష్ట్ర, జిల్లాలోని ఉపాద్యాయులు సమస్యలు నిరంతర పరిష్కారం కోసం అవిశ్రాంతంగా తమ సంఘం కృషి చేస్తున్నదని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రెడ్డి రమేష్ అన్నారు.నూతన ఆంగ్ల సంవత్సరం…2026 ప్రారంభం సందర్భంగా గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎన్.టి.ఏ. ప్రతినిధులు బృందం శుభాకాంక్షలు తెలిపి ఆయనను దుశాలువలు కప్పి,భోకేలను అందించి ఘనంగా సన్మానించింది.నోబుల్ టీచర్స్ అసోసియేషన్ …2026 సంవత్సరపు కేలండర్,డైరీలను జిల్లా విద్యాశాఖ అధికారిచే ఆవిష్కరింపజేశారు.అనంతరం కార్యాలయం వెలుపల రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రెడ్డి రమేష్ పత్రికలవారితో మాట్లాడుతూ….. ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగకరంగా మంచి సమాచారంతో రాష్ర్ట శాఖా తరఫున ముద్రించిన నోబుల్ టీచర్స్ అసోసియేషన్ కేలండర్ – 2026 చాలా బాగుందని కితాబిచ్చారు. జిల్లా అధ్యక్షులు డాక్టర్ జయప్రకాష్ నాయుడు,జిల్లా ప్రధాన కార్యదర్శి చందనం రామయ్య లు మాట్లాడుతూ…… నోబుల్ టీచర్స్ అసోసియేషన్ తరఫున ఈ ప్రభుత్వానికి అనేక రకాల ఉపాద్యాయుల సమస్యలు తెలుపడం తెలిసిందేనన్నారు.సమస్యలు పరిష్కరించుకోవడంలోనూ తమ సంఘం తనదైన శైలిలో ప్రత్యేకతలు చూపుతుందన్నారు.రాష్ట్రంలోని ఉపాద్యాయుల పలు పెండింగ్ సమస్యలతో పాటు ఎం.టి.ఎస్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు.త్వరలో 1998 ఏం.టి.ఎస్. ఉపాద్యాయులకు మేలుచేసే ఒకటి రెండు అంశాలు తమ దృష్టిలో వుందన్నారు.సాధ్యమైనంత అతి తక్కువ కాలంలో పరిష్కరింప బడుతుoదని విశ్వసించారు.ఈ కార్యక్రమంలో ఎన్.టి.ఏ.రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వర కుమార్,జిల్లా ఉపాధ్యక్షులు ఏ.ఆర్.కుమార్, జిల్లా ఫైనాన్స్ కార్యదర్శి బాబు రెడ్డి, జిల్లా కార్యదర్శి రుక్మాంగద, కుప్పం డివిజన్ కన్వీనర్ శ్రీరాములు, చిత్తూరు నగరం అధ్యక్షురాలు దేవకి తదితరులు పాల్గొన్నారు.

చిత్తూరు

జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులను మర్యాద పూర్వకంగా కలిసిన ఎన్.టి.ఎ రాష్ట్ర, జిల్లా నాయకులు

జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులను మర్యాద పూర్వకంగా కలిసిన ఎన్.టి.ఎ రాష్ట్ర, జిల్లా నాయకులు నూతన ఆంగ్ల సంవత్సరం… 2026 ప్రారంభం సందర్భంగా గురువారం నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా చిత్తూరు ఏంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు, చిత్తూరు ఎం.ఎల్.ఎ గురజాల జగన్ మోహన్ నాయుడు,ఆయన తండ్రి చెన్న కేశవులు నాయుడు, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీ మోహన్, డీ.ఈ.ఓ రాజేంద్ర ప్రసాద్ లను కలసి పుష్పగుచ్ఛాలు అందించి దుషాలువలు కప్పి ఘనంగా సన్మానించారు.తమకు వినతులు రూపంలో అందించే ఉపాధ్యాయులు సమస్యలు పట్ల సత్వరం పరిష్కoపజేయడానికి తాము సిద్ధంగా వున్నట్లు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులకు తెలిపారు.ఈ పాటికే ఉపాద్యాయుల పలు సమస్యలు సాధనలో నోబుల్ టీచర్స్ అసోసియేషన్ అగ్రభాగాన నిలిచిందని ప్రజాప్రతినిధులు ఎన్.టి.ఎ.నాయకులను ప్రశంసించారు. అదేవిధంగా నూతన సంవత్సరం క్యాలెండర్,డైరీలు, టేబుల్ క్యాలెండర్ లు ఎంపీ, ఎం.ఎల్.ఏ లు చేతుల మీదుగా ఆవిష్కరింప జేశారు. కార్యక్రమంలో నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రెడ్డి రమేష్, కార్యదర్శి రాజేశ్వర కుమార్, జిల్లా అధ్యక్షులు డాక్టర్ జయప్రకాష్ నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి చందనం రామయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఏ.ఆర్.కుమార్, జిల్లా ఫైనాన్స్ కార్యదర్శి బాబు రెడ్డి, జిల్లా కార్యదర్శి రుక్మాంగద, కుప్పం డివిజన్ కన్వీనర్ శ్రీరాములు, చిత్తూరు నగరం అధ్యక్షురాలు దేవకి తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.