ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తూ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ASI)లుగా ఉద్యోగోన్నతి పొందిన 11 మంది పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. కమిషనరేట్ కార్యాలయంలో SD జలీల్, J రవి, SK ఖాసిం అలీ, K వెంకటేశ్వర రావు, K చెన్నారావు, S శ్రీనివాసరావు, B పిచ్చయ్య, G హరి, S వెంకట కోటిరెడ్డి, R కాళహస్తి, B పెద రాజేందర్‌లకు ఉన్నతి చిహ్నాన్ని అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగోన్నతి పొందిన అధికారులు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు బదిలీపై వెళ్లనున్నారు. కార్యక్రమంలో అదనపు DCP బొజ్జ రామానుజం, సంఘం అధ్యక్షుడు హేమనాద్ పాల్గొన్నారు.
