Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

బాల్య వివాహ రహిత భారత దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. SCOPE

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బాల్య వివాహ రహిత భారత దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. SCOPE

బాల్య వివాహ రహిత భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
**బాలల హక్కుల పరిరక్షణే SCOPE NGO లక్ష్యం*
బాల్య, అకాల మరియు బలవంతపు వివాహాల నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని (ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ అఫ్ చైల్డ్ , ఎర్లీ అండ్ ఫోర్స్డ్ మ్యారేజ్ ) పురస్కరించుకొని స్కోప్ ఎన్ జి ఓ ఆధ్వర్యంలో జనగామ జిల్లాలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గడ్డం మనోజ్ కుమార్ ప్రసంగిస్తూ బాల్య వివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు వివరించారు. ప్రతి బాలికకు విద్య, సమాన అవకాశాలు కల్పించి, బాల్య వివాహాలకు దూరంగా ఉంచడం ద్వారా బాల్య వివాహ రహిత సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు.
బాల్య వివాహ నిరోధక చట్టం – 2006పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, బాల్య వివాహాలను అరికట్టడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ శాఖలు సమిష్టిగా బాధ్యత తీసుకోవాలని సూచించారు.
**చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ ** లక్ష్య సాధనలో భాగంగా 2030 వరకు జిల్లాలోని ప్రతి గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్కోప్ సంస్థ ప్రతినిధులు కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ యూనిట్ సిబ్బంది కుమార్,రంజిత్, చీఫ్ లీగల్ డెఫన్స్ కౌన్సిల్ మంచాల రవీందర్,మిషన్ శక్తి సిబ్బంది హేమలత,స్కోప్ సంస్థ సిబ్బంది లావణ్య, అశోక్, తరుణ్, అజిత్, వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు మరియు వివిధ పాఠశాల, కళాశాలల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొని బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతిజ్ఞతో అవగాహన కల్పించారు.

బాల్య వివాహ రహిత భారత దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. SCOPE

Leave a comment

Your email address will not be published. Required fields are marked *