Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నేడు విడుదల కానున్న మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నేడు విడుదల కానున్న మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్

వార్త ముఖ్యాంశాలు

  • - నెల్లూరు మేయర్ అభ్యర్థి విషయంలో కూటమిలో ఇంకా కుదరని ఏకాభిప్రాయం - తర్జనభర్జనల్లోనే కూటమి పార్టీలు ఇప్పటికే మునిసిపల్ ఎన్నికల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి ఉండగా, ఈ నెల 14వ తేదీ బుధవారం రాష్ట్రంలోని మునిసిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల…
  • షెడ్యూల్ విడుదలైతే ఎన్నికల ప్రక్రియ మరింత వేగంగా ముందుకు సాగనుంది.
  • ఇప్పటికే ఆయా స్థానిక అధికారులు ఎన్నికలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసి ఉంచారు.

– నెల్లూరు మేయర్ అభ్యర్థి విషయంలో కూటమిలో ఇంకా కుదరని ఏకాభిప్రాయం
– తర్జనభర్జనల్లోనే కూటమి పార్టీలు

ఇప్పటికే మునిసిపల్ ఎన్నికల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి ఉండగా, ఈ నెల 14వ తేదీ బుధవారం రాష్ట్రంలోని మునిసిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ విడుదలైతే ఎన్నికల ప్రక్రియ మరింత వేగంగా ముందుకు సాగనుంది. ఇప్పటికే ఆయా స్థానిక అధికారులు ఎన్నికలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసి ఉంచారు. పోలింగ్ బూత్‌లను సిద్ధంగా ఉంచారు. ఆయా పోలింగ్ బూత్‌లకు కావాల్సిన ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.

నెల్లూరు నగర మేయర్ అభ్యర్థిత్వానికి సంబంధించి ఇంకా కూటమి పార్టీలలో ఏకాభిప్రాయం కుదరలేదు. తర్జనభర్జనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లు తెలియవస్తోంది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ తన పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిగా ఆనం విజయకుమార్ రెడ్డిని ప్రకటించి ఉండగా, కూటమి మాత్రం ఇంకా అధికారికంగా ఎవరి పేరునూ ప్రకటించలేదు. అసలు నెల్లూరు మేయర్ స్థానానికి కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న టీడీపీ పోటీ చేస్తుందా, లేక మరో భాగస్వామి అయిన బీజేపీకి ఈ సీటును కేటాయిస్తారా అన్న విషయంపై కూడా ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది. రాష్ట్రంలో బీజేపీ తిరుపతి, నెల్లూరు మేయర్ స్థానాలను కోరుతుండగా, అందులో నెల్లూరుపై గట్టి పట్టు పట్టి ఉన్నట్లు తెలియవస్తోంది. ఈ ఆలోచనలకు తెర తొలగాలంటే మరికొద్ది రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది.

– కార్పొరేటర్ కూటమి అభ్యర్థులు దాదాపు ఓ కొలిక్కి
– వైసీపీకి ఇంకా కొలిక్కి రాని కార్పొరేటర్ అభ్యర్థులు

ఇదిలా ఉండగా, గతంలో 54 డివిజన్లుగా ఉన్న నెల్లూరు కార్పొరేషన్‌ను ఇటీవల జరిగిన వార్డుల పునర్విభజన ప్రక్రియలో 72 డివిజన్లుగా మార్చారు. మేయర్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరగనుండగా, 72 డివిజన్లకు ఇటు కూటమి, అటు వైసీపీ ఇద్దరూ 72 మంది అభ్యర్థులను నిలబెట్టాల్సి ఉంది. అయితే నెల్లూరు నగరంలో కూటమి తరఫున పోటీ చేసేందుకు ఎక్కువ మంది అభ్యర్థులు ఉత్సాహం చూపుతుండగా, ఇప్పటికే ఒక్కో డివిజన్ నుంచి ఆయా పార్టీలు ఇద్దరు, ముగ్గురి పేర్లను పరిశీలనలో పెట్టుకొని సిద్ధంగా ఉన్నట్లు తెలియవస్తోంది. అయితే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ మాత్రం ఈ విషయంలో ఇంతవరకు ఒక అడుగు వెనకే ఉన్నట్లు సమాచారం.

కూటమికి ఆర్థిక, అంగబలాలు ఉన్న అభ్యర్థులు క్యూ లైన్లలో నిలిచి ఉండగా, వైసీపీకి ఇప్పటివరకు ఆ పరిస్థితులు పెద్దగా కనిపించడం లేదని తెలియవస్తోంది. అయితే కొంతమంది ఆశావహులు మాత్రం వైసీపీ టికెట్ల కోసం కూడా అభ్యర్థనలను కొనసాగిస్తున్నట్లు సమాచారం. అయితే ఆర్థిక, అంగబలాలు, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, ప్రజల్లో అభిమానం ఉన్న వ్యక్తులను మాత్రమే ఆయా పార్టీలు అభ్యర్థులుగా ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది.

ప్రస్తుతం ఉన్న వాతావరణంలో ఒక్కో డివిజన్ అభ్యర్థి కనీసం 40 నుంచి 50 లక్షలు ఖర్చు చేసుకుంటేనే విజయ తీరాల అంచుల్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులు మంచినీళ్ల ప్రాయంలా డబ్బులు ఖర్చు చేసి ఉన్నారు. ఇప్పటి స్థానిక ఎన్నికల పరిస్థితుల్లో ఆ పరిస్థితులు లేకపోయినా, ప్రజలు మాత్రం ఆ సార్వత్రిక ఎన్నికల ఖర్చులనే ప్రామాణికంగా తీసుకొని అలాగే జరుగుతుందని ఆశిస్తున్నారు. మరి ఆయా పార్టీల అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలబడి ఎలా ప్రజల హృదయాలను గెలుచుకొని, వారిని పోలింగ్ బూత్‌ల వైపు తమకు అనుకూలంగా ఎలా నడిపిస్తారో వేచి చూడాల్సిందే.
-గత చరిత్రతో టికెట్ ల కోసం ఆశ వహుల వేట
-ఆయారాం గయారాంల పట్ల డేగ కన్ను వేయాలి
-జంపు జిలానీల పై ఆలోచనలు చేయాలి
గతంలో జరిగిన మునిసిపల్ ఎన్నికల సందర్భంలో అప్పటిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నుంచి టిక్కెట్లు సాధించి ఎన్నికల బరిలో తుది వరకు నిలవకుండానే మధ్యలో పోటీ అభ్యర్థులతో బేర సారాలు చేసుకొని లక్షల్లో లబ్ది పొందిన చరిత్ర అప్పటిలో ఉంది . కనుకనే అప్పటిలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ 54 డివిషన్లలో 15 నుంచి 20 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నా ఒక్కటి కూడా గెలవకుండా 54 డివిజన్లను అప్పటి అధికార వైసీపీ పరం చేసింది . కాకపోతే అప్పుడు టీడీపీ నేతలు కొంత మంది అప్పటి అధికార వైసీపీ కి అమ్ముడు పోయారన్న విమర్శలు ఉన్నాయి . అయితే ఈ రాజకీయ చరిత్రను బాగా గుర్తుపెట్టుకోని ఉన్న ఇప్పటి వైసీపీ నేతలు కొందరు ఎలాగైనా సరే వైసీపీ డివిజన్ కార్పొరేటర్ టికెట్ సంపాదిస్తే అప్పటిలా బేర సారాలు కొనసాగించి లక్షల లబ్ది పొందవచ్చని ఆలోచనలు కూడా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం కాకపోతే కాలం మారింది , చరిత్రమాత్రం అలానే ఉంది . అప్పటిలో టీడీపీ నేతలు ఈ బేర సారాలు కొనసాగించి లక్షలలో కోట్లలో లబ్ది పొందగా ఆ చరిత్రను పునరావృత్తం చేయడానికి ఇప్పటి ప్రతిపక్షంలో కొందరు వైసీపీ నేతలు కూడా మనస్సులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి చెప్తూ టికెట్ ల వేటలో నిమగ్నమై ఉన్నట్లు సమాచారం .కనుక వైసీపీ అగ్రనేతలు టిక్కెట్లు ఇచ్చే విషయంలో ఈ దఫా అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది . అవసరమైతే టిక్కెట్లు పొందే నేతల నుంచి న్యాయపరంగా చట్టపరంగా బాండ్లు రాయించుకోవాల్సిన ముందు చూపు వ్యవహారాలను కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది . అలాగే కూటమి పార్టీలు కూడా తాము టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకునే వ్యక్తులు 5 ఏళ్ళ పాటు తమ పార్టీ లోనే ఉండే విధంగా బాండ్లు న్యాయ పరంగా చట్టపరంగా రాయించుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే రేపటి రోజున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీకి జరగరానిది జరిగి అధికారం కోల్పోతే ఇప్పుడు కూటమి తరపున గెలిచిన కార్పొరేటర్లు అప్పుడు జంపు జిలానీలుగా మారే అవకాశాలు లేకపోలేదు అలాగే ఇటు కూటమి అటు వైసీపీ రెండు ప్రధాన పార్టీ లు కూడా అభ్యర్థులకు ఆయా పార్టీ ల నుంచి ఖర్చులకోసం ఇచ్చే లక్షలాది పార్టీ నిధులను క్షేత్ర స్థాయిలో ఓటర్లకు చేరే విధంగా చర్యలు తీస్కొని ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది . లేకపోతే పార్టీ లు ఇచ్చే నిధులు కూడా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది . ఇందుకు ఉదాహరణగా చెప్పాలి అంటే గత ఎన్నికలలో ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేసిన విజయసాయి రెడ్డి ఇచ్చిన కోట్ల రూపాయలను క్షేత్ర స్థాయిలో ఓటర్లకు చేరకుండానే , మధ్యలో ఉన్న మహాశయులు మింగేసిన అనుభవాలను కూడా మనం చూసి ఉన్నాము .అప్పటిలో వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి పార్టీ నిధులుగా ఎన్నికల ఖర్చులకని ఛోటా నేతలకు కోట్లు పంపిస్తే ఆ కోట్లను దిగమింగి సొంత ఖజానాలో నింపుకొని , కోట్లకు ఓట్లు రాబట్టని విధానాలను నెల్లూరు ప్రజలు అనుభవంగా చూసి ఉన్నారు . కనుక ఈ ఎన్నికల్లో అలంటి ఆయారాం గయారాం లను దృష్టిలో పెట్టుకొని ఆయా పార్టీల అగ్ర నేతలు తాము టిక్కెట్లు ఇచ్చే అభ్యర్థులు భవిష్యత్తులో పార్టీ లు మారకుండా ఇచ్చిన నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *