Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆదిలాబాదు

సర్ ప్రక్రియ తక్షణమే రద్దు చేయాలి – ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సర్ ప్రక్రియ తక్షణమే రద్దు చేయాలి – ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్

వార్త ముఖ్యాంశాలు

  • ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి మేస్రం భాస్కర్, అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సుమారు పదమూడు కోట్ల ఓటర్ల పేర్లను తొలగించే చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
  • ఓటు హక్కు భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన అత్యంత కీలకమైన ప్రజాస్వామ్య హక్కు అని, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిస్తే ప్రజాస్వామ్య ప్రక్రియకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
  • ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన పౌరులు తమ ఓటు హక్కును కోల్పోకుండా ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి మేస్రం భాస్కర్, అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సుమారు పదమూడు కోట్ల ఓటర్ల పేర్లను తొలగించే చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఓటు హక్కు భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన అత్యంత కీలకమైన ప్రజాస్వామ్య హక్కు అని, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిస్తే ప్రజాస్వామ్య ప్రక్రియకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన పౌరులు తమ ఓటు హక్కును కోల్పోకుండా ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల పేర్లను తొలగించే ముందు సంబంధిత వ్యక్తులకు తగిన సమాచారం అందించాలని, అభ్యంతరాలు తెలియజేసేందుకు అవకాశం కల్పించాలని, తొలగింపులకు సంబంధించిన వివరాలను బహిరంగంగా వెల్లడించాలని కోరారు. ఓటు హక్కు కోల్పోయినవారు తిరిగి తమ హక్కును పొందేందుకు సరళమైన విధానాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజలకు ఎన్నికల ప్రక్రియపై విశ్వాసం కల్పించాల్సిన ఎన్నికల సంఘం ప్రతి అర్హుడికి ఓటు హక్కు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. విద్యార్థి, యువజన సంఘాల జాతీయ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలను అడ్డుకునేందుకు వివిధ రాష్ట్రాల్లో విద్యార్థి, యువజన సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతులను నిర్బంధాలతో అణచివేయలేరని స్పష్టం చేశారు. ఎన్ని నిర్బంధాలు విధించినా తమ పోరాటాన్ని ఆపలేరని, ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను రద్దు చేసే వరకు, ఓటర్ల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకునే వరకు, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని మేస్రం భాస్కర్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై సమీక్ష నిర్వహించాలని, అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నరేష్, యోగేష్, ప్రవీణ్, నవీన్, రాకేష్, విట్టల్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *