వార్త ముఖ్యాంశాలు
- ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య, వాటర్ సప్లై కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంతెన కాంతారావు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ కు వినతిపత్రం అందజేశారు.
- ఈ సందర్భంగా సిర్ర దేవేందర్ మాట్లాడుతూ, సిడిఎంఏ సర్క్యులర్ ప్రకారం ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 375 మంది పారిశుద్ధ్య కార్మికులు, 167 మంది వాటర్ సప్లై కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు.
- కార్మికులు ప్రతినెలా వేతనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి లేకుండా, వారికి సకాలంలో జీతాలు చెల్లించి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆదుకోవాలని కమిషనర్‌ను కోరారు.
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య, వాటర్ సప్లై కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంతెన కాంతారావు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిర్ర దేవేందర్ మాట్లాడుతూ, సిడిఎంఏ సర్క్యులర్ ప్రకారం ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 375 మంది పారిశుద్ధ్య కార్మికులు, 167 మంది వాటర్ సప్లై కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. కార్మికులు ప్రతినెలా వేతనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి లేకుండా, వారికి సకాలంలో జీతాలు చెల్లించి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆదుకోవాలని కమిషనర్‌ను కోరారు. అదేవిధంగా, పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ మొత్తాలను కూడా త్వరితగతిన కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీలోపు వేతనాలు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే, వారి హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని సిర్ర దేవేందర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో యూనియన్ సలహా దారులు చంద్రశేఖర్, జిల్లా డిప్యుటీ ప్రధాన కార్యదర్శి నారాయణ రెడ్డి, నరేందర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.