Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పీఎం కిసాన్ కోసం రైతులకు ప్రత్యేక ఈకేవైసీ డ్రైవ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పీఎం కిసాన్ కోసం రైతులకు ప్రత్యేక ఈకేవైసీ డ్రైవ్

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు మండలం భైరవరం సచివాలయం పరిధిలోని భైరవరం, తురకపల్లి, జంగాలపల్లి, రాచవారిపల్లి గ్రామాల్లో రైతులకు పీఎం కిసాన్ నగదు ప్రయోజనం అందేలా ప్రత్యేక ఈకేవైసీ డ్రైవ్ నిర్వహించారు.
  • మండల వ్యవసాయ అధికారులు ఎన్.
  • సుబ్బారెడ్డి, ఎన్.

దుత్తలూరు మండలం భైరవరం సచివాలయం పరిధిలోని భైరవరం, తురకపల్లి, జంగాలపల్లి, రాచవారిపల్లి గ్రామాల్లో రైతులకు పీఎం కిసాన్ నగదు ప్రయోజనం అందేలా ప్రత్యేక ఈకేవైసీ డ్రైవ్ నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారులు ఎన్. సుబ్బారెడ్డి, ఎన్. మదన్ మోహన్, ఏఈఓ సుస్మితతో పాటు గ్రామ వ్యవసాయ శాఖ సహాయకులు సుహాఫ్, చంద్రశేఖర్, రామకృష్ణారెడ్డి, మీరహ్మద్ ఆధ్వర్యంలో రైతుల ఈకేవైసీ ప్రక్రియ చేపట్టారు. పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని కోరారు. డ్రైవ్‌లో పలువురు రైతులు పాల్గొని ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు. అధికారులు రైతులకు అవసరమైన సూచనలు, సహాయాన్ని అందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *