Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

SBI ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
SBI ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం

వార్త ముఖ్యాంశాలు

  • నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి) నిర్మల్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ ప్రాథమిక పాఠశాలలో ఎస్బీఐ ఆదిలాబాద్ రీజినల్ కార్యాలయం ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ఎస్బీఐ రీజినల్ హెచ్‌ఆర్ మేనేజర్ (మానవ వనరులు) బాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
  • తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వ్యర్థాలను పునర్వినియోగం చేయడం, పర్యావరణాన్ని పరిరక్షించడం వంటి అంశాలను వివరించారు.

నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి)
నిర్మల్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ ప్రాథమిక పాఠశాలలో ఎస్బీఐ ఆదిలాబాద్ రీజినల్ కార్యాలయం ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్బీఐ రీజినల్ హెచ్‌ఆర్ మేనేజర్ (మానవ వనరులు) బాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వ్యర్థాలను పునర్వినియోగం చేయడం, పర్యావరణాన్ని పరిరక్షించడం వంటి అంశాలను వివరించారు. ఎల్‌డీఎం ఉత్పల్ కుమార్ ధాం మాట్లాడుతూ విద్యతో పాటు పరిశుభ్రత, బాధ్యత, పర్యావరణ పరిరక్షణ వంటి మంచి అలవాట్లను చిన్ననాటి నుంచే అలవర్చుకోవాలని సూచించారు. పాఠశాలలో నేర్చుకున్న మంచి అలవాట్లను ఇంట్లోనూ పాటిస్తూ ఇతరులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ కమలాకర్ మాట్లాడుతూ పరిశుభ్రమైన విద్యాలయంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను మెరుగ్గా అభ్యసించవచ్చని తెలిపారు. కథలు, ఆటల ద్వారా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించారు. అనంతరం హెచ్ఆర్ మేనేజర్ బాలకృష్ణ విద్యార్థులతో “నా చెత్త – నా బాధ్యత, పరిశుభ్రమైన పాఠశాల – ఆరోగ్యకరమైన సమాజం” అనే సందేశంతో పరిశుభ్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం మనోరమ, ఉపాధ్యాయులు అనితాదేవి, అశ్విని, అపర్ణ, ఎస్బీఐ సిబ్బంది శివరాం, సిఎస్పి మిత్ర సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *