Saturday, 26 September 2026
  • Home  
  • బానిస సంకెళ్లను తెంచిన వీరవనిత చాకలి ఐలమ్మ ​- మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్
- వరంగల్

బానిస సంకెళ్లను తెంచిన వీరవనిత చాకలి ఐలమ్మ ​- మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ధైర్యసాహసాలకు ప్రతీక చాకలి ఐలమ్మ అని నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి పెండెం శ్రీలక్ష్మీరామానంద్ అన్నారు. ​చిట్యాల చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పంబి వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ—భూమి, భుక్తి, బహుజన ఆత్మగౌరవం కోసం పోరాడిన ఐలమ్మ స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, బహుజనుల హక్కుల సాధనకు కృషి చేయడమే ఆమెకు నిజమైన నివాళి అని తెలిపారు. ​ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు ఓర్సు తిరుపతి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ, జిల్లా అధికార ప్రతినిధి ఎర్ర యాకుబ్ రెడ్డి, సొసైటీ చైర్మన్ బొబ్బల రమణారెడ్డి, కౌన్సిలర్లు బత్తిని రాజేందర్, మాదాసి రవి, ఏపూరి శ్రీనివాస్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ధైర్యసాహసాలకు ప్రతీక చాకలి ఐలమ్మ అని నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి పెండెం శ్రీలక్ష్మీరామానంద్ అన్నారు.
​చిట్యాల చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పంబి వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ—భూమి, భుక్తి, బహుజన ఆత్మగౌరవం కోసం పోరాడిన ఐలమ్మ స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, బహుజనుల హక్కుల సాధనకు కృషి చేయడమే ఆమెకు నిజమైన నివాళి అని తెలిపారు.
​ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు ఓర్సు తిరుపతి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ, జిల్లా అధికార ప్రతినిధి ఎర్ర యాకుబ్ రెడ్డి, సొసైటీ చైర్మన్ బొబ్బల రమణారెడ్డి, కౌన్సిలర్లు బత్తిని రాజేందర్, మాదాసి రవి, ఏపూరి శ్రీనివాస్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.