రాపూరు మండలం పెంచలకోన శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మూడో రోజు విశేష పూజలు నిర్వహించారు. వేద, దివ్య ప్రబంధ పారాయణాలతో పాటు ప్రత్యేక హోమాలు, పూర్ణాహుతి, శాత్తుమొరై కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. సాయంత్రం మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుచ్చి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పరిసరాలు భక్తుల రాకతో సందడిగా మారాయి. పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.

పెంచలకోనలో ఘనంగా పవిత్రోత్సవ వేడుకలు