కడప నగరంలో సంస్కృత వాంగ్మయం ఆధారంగా ఉచిత జ్ఞాన బోధ తరగతులు నిర్వహిస్తున్నట్లు పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి శంకర్ తెలిపారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం రిటైర్డ్ లెక్చరర్ పి. నాగమునిరెడ్డి ఆధ్వర్యంలో ఈ తరగతులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
తరగతుల వివరాలు:
– చిరునామా: చలమారెడ్డిపల్లి, ఎంఎస్‌ఆర్ హిల్ వ్యాలీ, 12వ రోడ్, ఇంటి నంబర్ 111
– రోజు: ప్రతి శనివారం
– సమయం: సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు
– అర్హత: 15 సంవత్సరాలు పైబడిన వారు
– తరగతులు: ఉచిత సంస్కృత జ్ఞాన బోధ తరగతులు
సంస్కృత భాషపై ఆసక్తి ఉన్నవారు క్రింది నంబర్లకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని డాక్టర్ పసుపులేటి శంకర్ తెలిపారు.
– 9849459046
– 9110519606
– 9490872112


