తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం చిలమత్తూరు గ్రామం ఘనంగా వినాయక చవితి వేడుకలు జరిగాయి ప్రతి గ్రామంలో ప్రతిష్టతకంగా చేసుకొనే వినాయక వేడుకలకు పోలీసుల భద్రతా వలయం
వినాయక చవితి నిమజ్జనంలో పురస్కరించుకుని చిలమత్తూరు గ్రామాల్లో పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. పండుగ వేడుకలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరిగేలా శ్రీ సిటీ ఎస్ఐ ప్రియాంక పర్యటించి పరిస్థితులను పరిశీలించారు.
ఎస్ఐ ప్రియాంక భద్రతా ఏర్పాట్లను స్వయంగా తనిఖీ చేశారు. వినాయక బొమ్మ వద్ద భక్తులు, నిర్వాహకులు పాటించాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండమని సూచించారు.
గ్రామాల్లో రాత్రివేళ పోలీసు సిబ్బందితో కలిసి పర్యటిస్తూ శాంతిభద్రతల పరిస్థితిని ఎస్ఐ ప్రియాంక పర్యవేక్షించారు. పండుగ కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలకు ప్రాధాన్యం ఇచ్చారు.
వినాయక చవితి వేడుకలను ప్రజలందరూ సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్ఐ ప్రియాంక . పండుగ సమయంలో పోలీసులకు ప్రజలు, సహకరించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆమె పేర్కొన్నారు.
పండుగ సందర్భంగా గ్రామాల్లో పోలీసుల పర్యవేక్షణ కొనసాగుతుందని, ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.



