నందలూరు
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన చమర్తి
నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నీ ఇద్దరికీ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను రాజంపేట తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు అందజేశారు. ఆదివారం రాజంపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆరవపల్లె గాంధీనగర్ కు చెందిన దండు సుశీల. అలాగే అల్లబాకస్ లు అనారోగ్య బాధలతో ముఖ్యమంత్రి సహాయనిధి కి నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ సహకారంతో దరఖాస్తు చేసుకున్నారు. వీరిద్దరి యొక్క దరఖాస్తులను రాజంపేట తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్ రాజు గారికి అందజేయడం జరిగింది. స్పందించిన ఆయన ముఖ్యమంత్రి సహాయనిధి నుండి నిధులు విడుదల చేయించి బాధితులు ఇద్దరికీ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధితులు చమర్తి జగన్మోహన్ రాజుకి ధన్యవాదాలు తెలిపారు.


