Wednesday, 9 September 2026
  • Home  
  • నిజం గెలిచింది.. న్యాయం నిలిచింది – చంద్రబాబుకు సంఘీభావంగా టీడీపీ శ్రేణుల కొవ్వొత్తుల ప్రదర్శన
- తిరుపతి

నిజం గెలిచింది.. న్యాయం నిలిచింది – చంద్రబాబుకు సంఘీభావంగా టీడీపీ శ్రేణుల కొవ్వొత్తుల ప్రదర్శన

– ‘నిజం గెలిచింది’ కార్యక్రమంలో 53 కొవ్వొత్తులతో సంఘీభావం – సత్యం, న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని వెల్లడి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘నిజం గెలిచింది’ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా, రైల్వే కోడూరులో టీడీపీ శ్రేణులు కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలిపారు. రాఘవరాజుపురంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 53 కొవ్వొత్తులను వెలిగించి చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. అన్యాయాన్ని ఎదురించి న్యాయం కోసం సాగించిన పోరాటానికి ప్రతీకగా కొవ్వొత్తుల వెలుగులు నిలిచాయని నాయకులు పేర్కొన్నారు. న్యాయంపై విశ్వాసంతో సాగిన పోరాటంలో చివరకు నిజం గెలిచిందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని చంద్రబాబుకు సంపూర్ణ సంఘీభావం తెలిపారు.

– ‘నిజం గెలిచింది’ కార్యక్రమంలో 53 కొవ్వొత్తులతో సంఘీభావం

– సత్యం, న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని వెల్లడి

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘నిజం గెలిచింది’ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా, రైల్వే కోడూరులో టీడీపీ శ్రేణులు కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలిపారు. రాఘవరాజుపురంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 53 కొవ్వొత్తులను వెలిగించి చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. అన్యాయాన్ని ఎదురించి న్యాయం కోసం సాగించిన పోరాటానికి ప్రతీకగా కొవ్వొత్తుల వెలుగులు నిలిచాయని నాయకులు పేర్కొన్నారు. న్యాయంపై విశ్వాసంతో సాగిన పోరాటంలో చివరకు నిజం గెలిచిందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని చంద్రబాబుకు సంపూర్ణ సంఘీభావం తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.