ముమ్మిడివరం. పున్నమి ప్రతినిధి
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా స్థానిక శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మంటపంలో రాజకీయ నాయకులు నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి. రవివర్మ “OG” గెటప్‌లో పాల్గొని కేక్ కటింగ్ వేడుకల్లో పాల్గొనడం సివిల్ సర్వీస్ ప్రవర్తనా నియమావళికి పూర్తి విరుద్ధం. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రజాసేవ చేయాల్సిన అధికారి ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలా డ్రెస్ కోడ్ ధరించి ప్రత్యక్షంగా పాల్గొనడం అత్యంత శోచనీయం.
సర్వీస్ రూల్స్‌ను ఉల్లంఘించి మున్సిపల్ కమిషనర్ పి. రవివర్మపై తక్షణమే సస్పెన్షన్ వేటు వేయాలని జిల్లా కలెక్టర్ గారు మరియు ఉన్నతాధికారులు ఈ ఘటనపై వెంటనే స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



