వార్త ముఖ్యాంశాలు
- తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాలెం మండలం పాండూరు సిపిఐ శాఖ సమావేశం ఎస్ మురళి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి అంబాకం చిన్ని రాజ్ మాట్లాడుతూ పాదరకుప్పం రెవెన్యూ లోని సొత్రియం భూములను సాగు చేస్తున్న అర్హులైన గిరిజనులు రైతులకు పట్టాలు…
- అలాగే రాష్ట్రంలో పరిపాలిస్తున్న ఎన్ డి ఏ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి పట్టాలి ఇచ్చి పక్కా గృహ నిర్మాణం చేపడతామని ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు రాష్ట్రంలో ఒక్క ఇంటి పట్టా…
- అయితే ఉచిత బస్సు తప్ప ఇంకా ఎలాంటి హామీ కూడా నెరవేర్చలేదని ఇలా ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారానికి వచ్చిన చేసిన వాగ్దానాలు అమలు చేయడంలో రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదని చిన్ని రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాలెం మండలం పాండూరు సిపిఐ శాఖ సమావేశం ఎస్ మురళి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి అంబాకం చిన్ని రాజ్ మాట్లాడుతూ పాదరకుప్పం రెవెన్యూ లోని సొత్రియం భూములను సాగు చేస్తున్న అర్హులైన గిరిజనులు రైతులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని చిన్ని రాజ్ డిమాండ్ చేశారు.
అలాగే రాష్ట్రంలో పరిపాలిస్తున్న ఎన్ డి ఏ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి పట్టాలి ఇచ్చి పక్కా గృహ నిర్మాణం చేపడతామని ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు రాష్ట్రంలో ఒక్క ఇంటి పట్టా ఒక ఇల్లు కూడా కట్టించిన దాఖలాలు కనబడలేదని సూపర్ సిక్స్ పేరుతో 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు 15 వేల రూపాయలు ఇస్తామని నిరుద్యోగులకు ప్రతినెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని అర్హులైన పేదలకు పెన్షన్ స్కీం వెంటనే అమలు చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది . అయితే ఉచిత బస్సు తప్ప ఇంకా ఎలాంటి హామీ కూడా నెరవేర్చలేదని ఇలా ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారానికి వచ్చిన చేసిన వాగ్దానాలు అమలు చేయడంలో రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదని చిన్ని రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
సోత్రీయo భూములను అనర్హులు స్థానికేతరులు ధనవంతులు రాజకీయ పలుకుబడి గల వాళ్లు కబ్జా చేస్తుంటే రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లు ఉన్నారని అదే స్థానికంగా ఉన్న రైతులు గిరిజనులు 40 సంవత్సరాల నుండి సాగు చేస్తున్న వారికి రైతు వారి పట్టాలు ఇవ్వడం గానీ కనీసం సాగు రాయడం గాని చేయడం లేదని వారికి వెంటనే రైతు వారి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చంద్ర మురళి ధనుంజయులు చెల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.