వార్త ముఖ్యాంశాలు
- ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ నియామకాలకు 100 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర, జిల్లా ప్రధాన కార్యదర్శులు కిల్లో సురేంద్ర, పొద్దు బాలదేవ్ లు డిమాండ్ చేశారు.
- మంగళవారం వారు అరకులోయ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
- ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ నియామకాలకు 100 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర, జిల్లా ప్రధాన కార్యదర్శులు కిల్లో సురేంద్ర, పొద్దు బాలదేవ్ లు డిమాండ్ చేశారు. మంగళవారం వారు అరకులోయ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. చట్టం అమల్లోకి వచ్చే వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు నిలిపివేయాలని, 1/70 చట్టం పరిరక్షణకు సుప్రీంకోర్టులో వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అరకు మండల కార్యదర్శి జి.బుజ్జిబాబు పాల్గొన్నారు.