Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

96వ వార్డులో కూటమి విజయోత్సవ ర్యాలీ వరుసగా ఐదోసారి కార్పొరేటర్‌గా గంధం శ్రీనివాసరావు విజయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
96వ వార్డులో కూటమి విజయోత్సవ ర్యాలీ వరుసగా ఐదోసారి కార్పొరేటర్‌గా గంధం శ్రీనివాసరావు విజయం

పెదగంట్యాడ (పున్నమి ప్రతినిధి): జీవీఎంసీ 96వ వార్డు కార్పొరేటర్‌గా వరుసగా ఐదోసారి విజయం సాధించిన గంధం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వార్డు పరిధిలో విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. నడుపూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన భారీ బైక్ ర్యాలీ వార్డులోని ప్రధాన వీధుల గుండా ఉత్సాహంగా సాగింది.

ఈ ర్యాలీలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. వివిధ ప్రాంతాల్లో స్థానిక ప్రజలు గంధం శ్రీనివాసరావుకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా 80వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని గంధం శ్రీనివాసరావుకు అభినందనలు తెలిపారు. జనసేన నాయకులు ముమ్మన మురళి, 96వ వార్డు ఇన్‌చార్జి ఆర్మీ గోవిందు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు జిత్తుక అప్పలరాజు, కార్యదర్శి కూన వెంకట్రావు, నాయకులు శివ, భార్గవ్, శ్రీధర్ కుమార్, సుదర్శన్, పంచదార్ల ఉగ్రం, పీత రమణ, ఉమ, రోహిత్, బొడ్డు సత్యారావు తదితరులు పాల్గొన్నారు.

96వ వార్డులో కూటమి విజయోత్సవ ర్యాలీ వరుసగా ఐదోసారి కార్పొరేటర్‌గా గంధం శ్రీనివాసరావు విజయం

96వ వార్డులో కూటమి విజయోత్సవ ర్యాలీ వరుసగా ఐదోసారి కార్పొరేటర్‌గా గంధం శ్రీనివాసరావు విజయం

96వ వార్డులో కూటమి విజయోత్సవ ర్యాలీ వరుసగా ఐదోసారి కార్పొరేటర్‌గా గంధం శ్రీనివాసరావు విజయం

96వ వార్డులో కూటమి విజయోత్సవ ర్యాలీ వరుసగా ఐదోసారి కార్పొరేటర్‌గా గంధం శ్రీనివాసరావు విజయం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *