Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిజామాబాద్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్,

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్,

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్‌లోని తన అధికారిక నివాసంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలందరికీ మంత్రి 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఘన నివాళులు అర్పించి, వారి త్యాగాలను మంత్రి స్మరించుకున్నారు.

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో దేశాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం వంటి రాజ్యాంగ విలువలను కాపాడుతూ.. బలమైన, ఆరోగ్యవంతమైన, అభివృద్ధి చెందిన తెలంగాణతో పాటు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *