వార్త ముఖ్యాంశాలు
- కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 5(పున్నమి న్యూస్): జిల్లాలో 2026-2027 సంవత్సరం నకుగాను 7 ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ ల పరిదిలో గల 38 మద్యం షాపులు నిర్వహించుకొనుటకు 8వ తేదీన లాటరీ నిర్వహించడం జరుగుతుందని ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ కృష్ణకుమారి తెలిపారు.జిల్లా కలక్టర్ వారు…
కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 5(పున్నమి న్యూస్):
జిల్లాలో 2026-2027 సంవత్సరం నకుగాను 7 ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ ల పరిదిలో గల 38 మద్యం షాపులు నిర్వహించుకొనుటకు 8వ తేదీన లాటరీ నిర్వహించడం జరుగుతుందని ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ కృష్ణకుమారి తెలిపారు.జిల్లా కలక్టర్ వారు మద్యం షాపులు కొరకు గత నెల 24 న గజిట్ ను విడుదల చేశారని అన్నారు.మద్యం షాపులపై ఆశక్తి గల వారినుండి దరఖాస్తులను 3 లక్షల రూపాయిలు నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజు, 1000/- రూపాయిలు నాన్ రిఫండబుల్ ప్రోసెసింగ్ ఫీజు ను చలానాలు రూపంలో గాని, డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో గాని కట్టి, ఆన్లైన్ ద్వారా గాని, ఆఫ్ లైన్ ద్వారా గాను, హైబ్రిడ్ పద్ధతిలో గాని 6వ తేదీ లోపుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఇతర సమాచారం కొరకు గజిట్ ను జిల్లాలో గల అన్ని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ లలో అందుబాటులో ఉంచడమైనదని అన్నారు.8న ఉదయం 8.00 గంటలకు కాకినాడ కలక్టరేట్ కాంపౌండ్ లోగల విధాన గౌతమి హాల్ నందు లాటరీ విధానంలో మద్యం షాపుల ఎంపిక జరుగుతుందన్నారు.దరఖాస్తు దారులు అందరూ ఆరోజు ఒక గంట ముందుగా రావాలని కోరారు.