Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నారాయణపేట

5 న కున్సి గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
5 న కున్సి గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

కున్సి, సెప్టెంబర్ 3: కున్సి గ్రామంలో సెప్టెంబర్ 5న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకార్చన నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి శ్రీ వేణుగోపాల స్వామి గుడి వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో పాఠశాల విద్యార్థులు రాధాకృష్ణ వేషధారణలో పాల్గొననున్నారు. ప్రత్యేకంగా ఎద్దుల బండిపై శ్రీకృష్ణుని ఊరేగింపు నిర్వహించనున్నారు.
అనంతరం సాయంత్రం 5:30 గంటలకు ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించనున్నారు. కున్సి గ్రామ నారాయణ సేన, గ్రామ యువకుల ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. గ్రామ భజన బృందంతో పాటు పరిసర గ్రామాల భజన బృందాలకు ప్రత్యేక ఆహ్వానం పలికారు. రాధాకృష్ణ వేషధారణలో పాల్గొనే చిన్నారులకు బహుమతులు అందజేయనున్నారు. గ్రామ ప్రజలు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

5 న కున్సి గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *