Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

5 ఎంఎల్‌డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పరిశీలన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
5 ఎంఎల్‌డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పరిశీలన

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు, ఆగస్టు 17 (పున్నమి): ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని యూపీఎస్సీ అరుంధతివాడలో ఉన్న 5 ఎంఎల్‌డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను హెల్త్ సూపర్వైజర్, సిబ్బంది పరిశీలించారు.
  • ప్లాంట్‌లో నీటి శుద్ధి ప్రక్రియ, నిర్వహణ, నీటి నిల్వ, సరఫరా విధానాలను తనిఖీ చేశారు.
  • అనంతరం నీటి ట్యాంకును పరిశీలించి పరిశుభ్రత, నీటి నిల్వ, పరిసరాల పారిశుధ్యాన్ని తనిఖీ చేశారు.

ఆత్మకూరు, ఆగస్టు 17 (పున్నమి): ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని యూపీఎస్సీ అరుంధతివాడలో ఉన్న 5 ఎంఎల్‌డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను హెల్త్ సూపర్వైజర్, సిబ్బంది పరిశీలించారు. ప్లాంట్‌లో నీటి శుద్ధి ప్రక్రియ, నిర్వహణ, నీటి నిల్వ, సరఫరా విధానాలను తనిఖీ చేశారు. అనంతరం నీటి ట్యాంకును పరిశీలించి పరిశుభ్రత, నీటి నిల్వ, పరిసరాల పారిశుధ్యాన్ని తనిఖీ చేశారు. ప్రజలకు నాణ్యమైన తాగునీరు నిరంతరంగా అందేలా సిబ్బందికి సూచనలు చేశారు.

ప్రజలకు నీటి కొరత లేకుండా మున్సిపల్ కమిషనర్ గంగ ప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని హెల్త్ సిబ్బంది తెలిపారు. ప్రతిరోజూ ప్లాంట్‌ను పరిశీలిస్తూ నీటి సరఫరాపై సూచనలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎస్. సుధాకర్, హెల్త్ అసిస్టెంట్ జి. రవీందర్ రెడ్డి, శ్రీరాములు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *