వార్త ముఖ్యాంశాలు
- విశాఖపట్నం పున్నమి ప్రతినిధి 46వ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో DVS భాస్కర్ రాజు గారి పతకాల పంట!
- నెల్లూరులో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించిన 46వ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలలో రిటైర్డ్ ADCP శ్రీ DVS భాస్కర్ రాజు గారు అద్భుత ప్రతిభ కనబరిచి మూడు పతకాలు సాధించారు.ఈ పోటీలలో 80 సంవత్సరాల వయస్సు విభాగంలో పాల్గొన్న ఆయన 3…
- పోలీస్ శాఖలో విశేష సేవలందించి పదవీ విరమణ పొందినప్పటికీ, క్రీడలపై ఉన్న మక్కువతో మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటూ పతకాలు సాధించడం ఎంతో అభినందనీయం.
విశాఖపట్నం పున్నమి ప్రతినిధి
46వ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో DVS భాస్కర్ రాజు గారి పతకాల పంట!
నెల్లూరులో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించిన 46వ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలలో రిటైర్డ్ ADCP శ్రీ DVS భాస్కర్ రాజు గారు అద్భుత ప్రతిభ కనబరిచి మూడు పతకాలు సాధించారు.ఈ పోటీలలో 80 సంవత్సరాల వయస్సు విభాగంలో పాల్గొన్న ఆయన 3 కిలోమీటర్ల నడక పోటీలో స్వర్ణ పతకం, జావెలిన్ త్రోలో కాంస్య పతకం, డిస్కస్ త్రోలో రజత పతకం సాధించి విశేష ప్రతిభ చాటుకున్నారు.
పోలీస్ శాఖలో విశేష సేవలందించి పదవీ విరమణ పొందినప్పటికీ, క్రీడలపై ఉన్న మక్కువతో మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటూ పతకాలు సాధించడం ఎంతో అభినందనీయం.
ఈ విజయాల ద్వారా ఆయన తన క్రీడా ప్రతిభను మరోసారి చాటుకోవడమే కాకుండా, వయస్సు అనేది క్రీడలకు అడ్డంకి కాదని నిరూపించారు.
ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు, క్రీడాభిమానులు DVS భాస్కర్ రాజు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.