Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • గూటూరు మురళీ కన్నబాబు సమక్షంలో గుల్లా షేక్ ఖాజా రసూల్, అబ్దుల్ మునాఫ్ పార్టీలో చేరిక ఆత్మకూరు, నవంబర్ 27 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
  • కరటంపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు గుల్లా షేక్ ఖాజా రసూల్, అబ్దుల్ మునాఫ్ తమ అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు.
  • నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు గూటూరు మురళీ కన్నబాబు సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకొని టీడీపీలో చేరికను ప్రకటించారు.ఈ సందర్భంగా గూటూరు మురళీ కన్నబాబు వారికి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు.

కరటంపాడులో వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నాయకుల చేరిక!

గూటూరు మురళీ కన్నబాబు సమక్షంలో గుల్లా షేక్ ఖాజా రసూల్, అబ్దుల్ మునాఫ్ పార్టీలో చేరిక

ఆత్మకూరు, నవంబర్ 27 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి):

ఆత్మకూరు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కరటంపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు గుల్లా షేక్ ఖాజా రసూల్, అబ్దుల్ మునాఫ్ తమ అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు గూటూరు మురళీ కన్నబాబు సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకొని టీడీపీలో చేరికను ప్రకటించారు.ఈ సందర్భంగా గూటూరు మురళీ కన్నబాబు వారికి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. టీడీపీ సిద్ధాంతాలు, కూటమి ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, గౌరవం ఉంటాయని తెలిపారు.

అనంతరం గుల్లా షేక్ ఖాజా రసూల్, అబ్దుల్ మునాఫ్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరినట్లు వెల్లడించారు. నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు గూటూరు మురళీ కన్నబాబు నాయకత్వంలో కరటంపాడు గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములవుతామని పేర్కొన్నారు.వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకులు తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరడం కరటంపాడు గ్రామ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నూతనంగా పార్టీలో చేరిన నాయకుల అనుచరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *