Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

23న కార్పొరేషన్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
23న కార్పొరేషన్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

వార్త ముఖ్యాంశాలు

  • ఈ నెల 23వ తేదీన నెల్లూరు నగర కార్పొరేషన్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరగనుంది.
  • మేయర్‌గా పొలుబోయిన రూప్ కుమార్ యాదవ్ చేత, అలాగే నూతనంగా ఆయా డివిజన్ల నుంచి గెలుపొందిన కార్పొరేటర్ల చేత ఎన్నికల అధికారి అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
  • నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని ఏపీజే అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరగనుంది.

ఈ నెల 23వ తేదీన నెల్లూరు నగర కార్పొరేషన్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరగనుంది.
మేయర్‌గా పొలుబోయిన రూప్ కుమార్ యాదవ్ చేత, అలాగే నూతనంగా ఆయా డివిజన్ల నుంచి గెలుపొందిన కార్పొరేటర్ల చేత ఎన్నికల అధికారి అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని ఏపీజే అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరగనుంది.

ఇదే సందర్భంగా డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా జరగనుంది. మొత్తం 72 డివిజన్లు కాగా, అందులో 69 డివిజన్లలో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఒకచోట వైసీపీ, రెండు స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలుపొందారు. దీంతో డిప్యూటీ మేయర్ ఎంపిక లాంఛనప్రాయమే కానుంది. కూటమి నేతలు సూచించిన అభ్యర్థే డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది.

అయితే డిప్యూటీ మేయర్ పదవికి ఎవరిని సూచిస్తారో ఇంతవరకు అంతుపట్టలేదు. నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన రూప్ కుమార్ యాదవ్ మేయర్‌గా విజయం సాధించిన నేపథ్యంలో డిప్యూటీ మేయర్ పదవిని రూరల్ నియోజకవర్గానికి కేటాయిస్తారా? అన్న విషయంపై చర్చ జరుగుతోంది.

అయితే ఓసీ జనరల్ స్థానంలో బీసీ అయిన రూప్ కుమార్ యాదవ్‌ను నిలబెట్టి కూటమి విజయ దుందుభి మోగించిన నేపథ్యంలో డిప్యూటీ మేయర్ పదవిని ఓసీలకు కేటాయిస్తారా? లేక ముస్లిం మైనారిటీలకు కేటాయిస్తారా? అన్న విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయి.

కూటమిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న జనసేన, బీజేపీలలో ఎవరికైనా కేటాయిస్తారా? అన్న చర్చ కూడా జరుగుతోంది. అలాగే మేయర్ పురుషుడు కనుక డిప్యూటీ మేయర్ పదవిని మహిళకు కేటాయించే అవకాశం కూడా ఉంటుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏదేమైనా డిప్యూటీ మేయర్ ఎంపికలో మున్సిపల్ మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలదే తుది నిర్ణయమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ పదవి కోసం జనసేన, బీజేపీలు కూడా తమ వంతు ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *