Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

21వ డివిజన్ అభివృద్ధికి కృషి : కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
21వ డివిజన్ అభివృద్ధికి కృషి : కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

నెల్లూరు నగరంలోని 21వ డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల, జనసేన నాయకుడు కిషోర్ గునుకుల తెలిపారు. సోమవారం డివిజన్‌లో పర్యటించి మూడు ప్రధాన సమస్యలను పరిశీలించారు. చెక్కల కాలువ బ్రిడ్జి పునర్నిర్మాణం, రివాల్ట్ వాల్ పక్కన ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటు, గుర్రాల మడుగు సంఘం వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. ఈ సమస్యలను మంత్రి పొంగూరు నారాయణ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాల స్ఫూర్తితో ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రశాంత్ గౌడ్, నరహరి, విశ్వ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Uploaded Video:

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *