వార్త ముఖ్యాంశాలు
- హుకుంపేట, అక్టోబర్ 3: హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ పరిధిలోని పామురాయి గ్రామానికి 20 ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
- సమస్య పరిష్కారానికి పీఎం-జన్మన్ పథకం ద్వారా రూ.1.26 కోట్ల అంచనా వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు.
- ఏపీ ఆర్టీసీ రీజినల్ చైర్మన్, టీడీపీ ఇన్‌చార్జి డా.
హుకుంపేట, అక్టోబర్ 3: హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ పరిధిలోని పామురాయి గ్రామానికి 20 ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కారానికి పీఎం-జన్మన్ పథకం ద్వారా రూ.1.26 కోట్ల అంచనా వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఏపీ ఆర్టీసీ రీజినల్ చైర్మన్, టీడీపీ ఇన్‌చార్జి డా. ఎస్. దొన్నుదొర కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల ఇన్‌చార్జి శతక బొంజుబాబు, బాకూరు వెంకటరమణ, సూర్యకాంతమ్మ, బి. మోహన్, పి. చిరంజీవి, కే. కామరాజు, పి. కామేశ్వరరావు, టి. సంతోష్, జనసేన నాయకుడు పి. సతీష్ తదితరులు పాల్గొన్నారు.