Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

20న నెల్లూరు–తుని మధ్య తుపాను ముప్పు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
20న నెల్లూరు–తుని మధ్య తుపాను ముప్పు

వార్త ముఖ్యాంశాలు

  • బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సోమవారం సాయంత్రానికి తుపానుగా, మంగళవారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
  • ఇది మరింత బలపడి నవంబర్ 20 మధ్యాహ్నం నెల్లూరు–తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.
  • ఆ సమయంలో గంటకు 120–130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గాలి వేగం గరిష్ఠంగా 145 కిలోమీటర్లకు చేరవచ్చని పేర్కొంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సోమవారం సాయంత్రానికి తుపానుగా, మంగళవారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది మరింత బలపడి నవంబర్ 20 మధ్యాహ్నం నెల్లూరు–తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆ సమయంలో గంటకు 120–130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గాలి వేగం గరిష్ఠంగా 145 కిలోమీటర్లకు చేరవచ్చని పేర్కొంది. సోమవారం ఉదయం 8.30 గంటలకు వాయుగుండం విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. కోస్తాంధ్ర, యానాంలో నవంబర్ 16, 17 తేదీల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 18న కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురవవచ్చు. అదే రోజు రాయలసీమలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *