Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఛీ..ఛీఛీ…!
  • ఒకటి,రెండుకు వెల్లాలంటే కష్టమే!
  • మహిళ అధికారుల భాద వర్ణనాతీతం..

ఛీ..ఛీఛీ…!

ఒకటి,రెండుకు వెల్లాలంటే కష్టమే!

మహిళ అధికారుల భాద వర్ణనాతీతం..

శిధిలావస్థలో మరుగుదొడ్లు..

పొదలకూరు: కొన్నేళ్ల క్రితం అధికారులంతా వేకువనే రోడ్డెక్కేవారు. ఎవరైనా చెంబుతో కనిపిస్తే చాలు చెలరేగిపోయేవారు. ఆరుబయట మల, మూత్ర విసర్జన చేసేవారిపై కన్నెర్ర చేసేవారు. మరోసారి కనిపించారో ఖబడ్డార్.. అని హెచ్చరించేవారు. మరుగుదొడ్లు నిర్మించుకోండని ఉపదేశించేవారు. స్వచ్ఛభారత్ పై అలవోకగా ప్రసంగించేవారు. ఇప్పుడు అవన్నీ పక్కన పడేసి.. పనులన్నీ మానేసి ఊరూవాడా తిరుగుతున్నారు. మరుగుదొడ్ల లక్ష్యం పూర్తికి రేయింబవళ్లు శ్రమించేవారు. ఊరందరికీ మరుగుదొడ్ల ఉపయోగాలు వివరించే అధికారుల కార్యాలయాల్లో ఈ దృశ్యం దారుణంగా ఉంది. ఉన్నతాధికారుల కార్యాలయాల్లో తప్ప మిగిలిన సిబ్బంది మరుగుదొడ్లు లేవు.. ఏ చెట్టోపుట్టో చూసుకోవలసిన పరిస్థితి. మహిళా ఉద్యోగుల పరిస్థితి పరమ దారుణం. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనులపై వచ్చే ప్రజలకు మరుగుదొడ్ల సమస్య వేధిస్తోంది. ఒకే చోట అన్ని శాఖల భవనాలు ఉన్నాయని సంతోషించాలో, ఆవరణలో మరుగుదొడ్ల సౌకర్యం లేనందుకు విచారించాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఉపాధి హామీ, స్వచ్ఛభారత్ పథకాల పేరుతో ఊరూరా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించామని చెబుతున్నారే గానీ ఇంత గెలిచి, రచ్చ గెలవాలన్న మాటే మరిచారు.. ప్రభుత్వ కార్యాలయాల వద్ద మరుగుదొడ్ల ఊసే లేదు. ప్రభుత్వ భవనాలన్నీ దాదాపు ఒకేచోట ఉన్నాయి. సోమవారం నుంచి శనివారం వరకు వివిధ పనులపై ప్రజలు ఆయా కార్యాలయాలకు నిత్యం అర్జీలు ఇచ్చేందుకు వందలాది మంది వస్తుంటారు. ఈ కార్యాలయాల వద్ద మరుగుదొడ్లు లేకపోవడం తో అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లేనిపక్షంలో ఇంటికి వెళ్లేంతవరకు ఉగ్గబడుతున్నారు.అధికారులు వెంటనే స్పందించి మరగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *