Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

🛕 తిరుమలలో భారీ భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 20–24 గంటలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
🛕 తిరుమలలో భారీ భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 20–24 గంటలు

వార్త ముఖ్యాంశాలు

  • తిరుమల, సెప్టెంబర్ 27, 2026: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది.
  • సెప్టెంబర్ 26న మొత్తం 82,181 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
  • 37,633 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ద్వారా ₹3.94 కోట్ల కానుకలు వచ్చాయి.

తిరుమల, సెప్టెంబర్ 27, 2026: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సెప్టెంబర్ 26న మొత్తం 82,181 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 37,633 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ద్వారా ₹3.94 కోట్ల కానుకలు వచ్చాయి. 4.89 లక్షల లడ్డూలు విక్రయించగా, 2.82 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారు. అశ్విని ఆసుపత్రిలో 3,893 మందికి వైద్య సేవలు అందించారు. సెప్టెంబర్ 27న తిరుమలలో భారీ రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం శిలాతోరణం వద్దకు బయట లైన్ కొనసాగుతోంది. SSD టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి సుమారు 20 నుంచి 24 గంటల సమయం పడుతోంది. భక్తులు రద్దీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమ దర్శన ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని సూచిస్తున్నారు. 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 గోవిందా.. గోవిందా!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *