Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

🛕 నవంబర్ 2026 శ్రీవారి సేవ కోటా విడుదలకు తేదీ ఖరారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
🛕 నవంబర్ 2026 శ్రీవారి సేవ కోటా విడుదలకు తేదీ ఖరారు

వార్త ముఖ్యాంశాలు

  • నవంబర్ 2026 నెలకు సంబంధించిన శ్రీవారి సేవ ఆన్‌లైన్ కోటాను టీటీడీ సెప్టెంబర్ 28న విడుదల చేయనుంది.
  • తిరుమల, తిరుపతి ప్రాంతాలకు సంబంధించిన జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ కోటా సెప్టెంబర్ 28, 2026న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది.
  • జనరల్ శ్రీవారి సేవకులు:తిరుమల, తిరుపతిలో తమ సేవ బుకింగ్ తేదీ రోజునే సంబంధిత ప్రదేశంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

తిరుమల, సెప్టెంబర్ 25:

నవంబర్ 2026 నెలకు సంబంధించిన శ్రీవారి సేవ ఆన్‌లైన్ కోటాను టీటీడీ సెప్టెంబర్ 28న విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతి ప్రాంతాలకు సంబంధించిన జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ కోటా సెప్టెంబర్ 28, 2026న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది.

📌 రిపోర్టింగ్ వివరాలు

జనరల్ శ్రీవారి సేవకులు:
తిరుమల, తిరుపతిలో తమ సేవ బుకింగ్ తేదీ రోజునే సంబంధిత ప్రదేశంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

పరకామణి సేవకులు:
తమ సేవ బుకింగ్ తేదీకి ఒక రోజు ముందు, తిరుమలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య రిపోర్ట్ చేయాలి.

సేవకుల కోసం ప్రొఫైల్ క్రియేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉన్నట్లు సమాచారం.

🛕 స్థానిక శ్రీవారి సేవ కోటా

హైదరాబాద్, భువనేశ్వర్, విశాఖపట్నం, బెంగళూరు, వొంటిమిట్ట ప్రాంతాల్లోని స్థానిక శ్రీవారి ఆలయాలకు సంబంధించిన నవంబర్ 2026 జనరల్ శ్రీవారి సేవ ఆన్‌లైన్ కోటా సెప్టెంబర్ 28న సాయంత్రం 4 గంటలకు విడుదల కానుంది.

ఈ ఆలయాల సేవకు స్థానికులు (LOCALS) మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. స్థానిక శ్రీవారి సేవకు వచ్చే సేవకులకు టీటీడీ తరఫున వసతి లేదా రవాణా సౌకర్యం ఉండదు.

సేవ బుకింగ్ తేదీన సంబంధిత ఆలయ ప్రాంగణంలోని రిపోర్టింగ్ ఇన్‌చార్జ్‌ల వద్ద సేవకులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

🙏 ఓం నమో వేంకటేశాయ 🙏

Leave a comment

Your email address will not be published. Required fields are marked *