Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పర్యటన ప్రజలకు అండగా ఉంటాం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పర్యటన ప్రజలకు అండగా ఉంటాం

వార్త ముఖ్యాంశాలు

  • కాకినాడ - కిర్లంపూడి - సెప్టెంబర్ 25 కిర్లంపూడి మండలం వేలంక, వీరవరం గ్రామలలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంట పొలాలు, లోతట్టు ప్రాంతాల్లోని నివాస గృహాలు నీట మునిగాయి.
  • బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న ఈ వర్షాల నేపథ్యంలో జగ్గంపేట శాసనసభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ గురువారం ఎమ్మార్వో, ఎండిఓ అధికారులతో కలిసి వేలంక, వీరవరం గ్రామాలలో జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మోకాళ్ళు లోతు…
  • నీట మునిగిన వరి పొలాలను, వరద నీటిలో చిక్కుకున్న ఇళ్లను స్వయంగా పరిశీలించి బాధితులతో మాట్లాడారు.ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, వరద ప్రభావిత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కాకినాడ – కిర్లంపూడి – సెప్టెంబర్ 25
కిర్లంపూడి మండలం వేలంక, వీరవరం గ్రామలలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంట పొలాలు, లోతట్టు ప్రాంతాల్లోని నివాస గృహాలు నీట మునిగాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న ఈ వర్షాల నేపథ్యంలో జగ్గంపేట శాసనసభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ గురువారం ఎమ్మార్వో, ఎండిఓ అధికారులతో కలిసి వేలంక, వీరవరం గ్రామాలలో జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మోకాళ్ళు లోతు వరద నీటిలోకి దిగి స్వయంగా వరద బాధితులను పరామర్శిస్తూ కురుస్తున్న భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నీట మునిగిన వరి పొలాలను, వరద నీటిలో చిక్కుకున్న ఇళ్లను స్వయంగా పరిశీలించి బాధితులతో మాట్లాడారు.ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, వరద ప్రభావిత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తడిసిన గోడలకు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, విద్యుత్ ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, పంట నష్టపోయిన రైతులను, ఇళ్లు ముంపునకు గురైన బాధితులను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, వీరవరం సొసైటీ చైర్మన్ తోట గాంధీ, తూము కుమార్, గండే కాశి ఎంపీడీవో హరికృష్ణ, ఎమ్మార్వో తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *