Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

తోగరాముడిలో రోడ్డుకు అడ్డంగా ఉన్న ముళ్ల చెట్లు తొలగింపు – టీడీపీ నాయకులు నూటం చంద్రశేఖర్ చొరవ*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
తోగరాముడిలో రోడ్డుకు అడ్డంగా ఉన్న ముళ్ల చెట్లు తొలగింపు – టీడీపీ నాయకులు నూటం చంద్రశేఖర్ చొరవ*

వార్త ముఖ్యాంశాలు

  • తోగరాముడి సూళ్లూరుపేట 26:* తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం తోగరాముడి గ్రామంలో ప్రధాన రహదారికి తీవ్ర అంతరాయం కలిగిస్తున్న సమస్యకు తెలుగుదేశం పార్టీ నాయకులు నూటం చంద్రశేఖర్ తన చొరవతో పరిష్కారం చూపారు.
  • తోగరాముడి హాస్పిటల్ నుండి చలివేంద్రం వరకు చెరువు కట్ట మీద ఉన్న రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పెద్ద పెద్ద చెట్లు, ముళ్ల పొదలు రోడ్డుపైకి వచ్చి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారాయి.
  • ముఖ్యంగా స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు వెళ్లేటప్పుడు చెట్ల కొమ్మలు తగిలి ప్రమాదాలు జరిగే పరిస్థితి నెలకొంది.

తోగరాముడి సూళ్లూరుపేట 26:*

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం తోగరాముడి గ్రామంలో ప్రధాన రహదారికి తీవ్ర అంతరాయం కలిగిస్తున్న సమస్యకు తెలుగుదేశం పార్టీ నాయకులు నూటం చంద్రశేఖర్ తన చొరవతో పరిష్కారం చూపారు.

తోగరాముడి హాస్పిటల్ నుండి చలివేంద్రం వరకు చెరువు కట్ట మీద ఉన్న రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పెద్ద పెద్ద చెట్లు, ముళ్ల పొదలు రోడ్డుపైకి వచ్చి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారాయి. ముఖ్యంగా స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు వెళ్లేటప్పుడు చెట్ల కొమ్మలు తగిలి ప్రమాదాలు జరిగే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని గ్రామస్తులు టీడీపీ నాయకులు నూటం చంద్రశేఖర్ దృష్టికి తీసుకువచ్చారు.

వెంటనే స్పందించిన చంద్రశేఖర్ గారు తన *సొంత నిధులతో JCB* ను ఏర్పాటు చేసి, చెరువు కట్ట మీద రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లు, పిచ్చి మొక్కలను మొత్తం తొలగించి రోడ్డును క్లియర్ చేయించారు. దీంతో ఇప్పుడు బస్సులు, ఇతర వాహనాలు సజావుగా వెళ్లేందుకు మార్గం సుగమం అయ్యింది.

ఈ సందర్భంగా తోగరాముడి పంచాయతీ ప్రజలు, గ్రామ పెద్దలు నూటం చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యలపై ఇలా సొంత ఖర్చులతో ముందుకు వచ్చి పని చేయడం అభినందనీయమని కొనియాడారు.

*- తోగరాముడి పంచాయతీ తరపున ధన్యవాదములు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *