Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డిగ్రీ కళాశాలకు మేకపాటి సహకారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
డిగ్రీ కళాశాలకు మేకపాటి సహకారం

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నూతన ప్రధాన ప్రవేశద్వారం ఏర్పాటు చేసేందుకు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సహకారం అందించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.
  • ఎల్.
  • నారాయణస్వామి తెలిపారు.

ఉదయగిరి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నూతన ప్రధాన ప్రవేశద్వారం ఏర్పాటు చేసేందుకు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సహకారం అందించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. ఎల్. నారాయణస్వామి తెలిపారు. కళాశాల ఆవరణలో ప్రస్తుతం రూ.5 కోట్ల వ్యయంతో అదనపు గదుల నిర్మాణ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరమ్మతులకు గురైన ప్రధాన ప్రవేశద్వారానికి బదులుగా మరో ప్రాంతంలో కొత్త ఎంట్రన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని మేకపాటి రాజమోహన్‌రెడ్డి అందించేందుకు ముందుకు వచ్చినట్లు ప్రిన్సిపల్ వెల్లడించారు. కొత్త ప్రవేశద్వారం ఏర్పాటుతో కళాశాల ప్రాంగణానికి మరింత సౌకర్యవంతమైన, ఆకర్షణీయమైన రూపం కలగనుందని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *