Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

టిడిపి ఇన్చార్జ్ మోకా ఆనంద సాగర్ ను. సన్మానించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • టిడిపి ఇన్చార్జి మోకా ఆనంద్ సాగర్ నుసత్కరించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పి గన్నవరం నుండి సెప్టెంబర్ 29 పున్నమి ప్రతినిధి డాక్టర్ బి.ఆర్.
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పి.గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా నియమితులైన మోకా ఆనంద్ సాగర్ ను పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జిగా పార్టీ బాధ్యతలు…
  • ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,యువ నాయకులు నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.కూటమి నాయకులు,కార్యకర్తలు అందరం సమన్వయంతో కలిసి పనిచేస్తామని,ఎలాంటి విభేదాలు లేదా సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

టిడిపి ఇన్చార్జి మోకా ఆనంద్ సాగర్ ను
సత్కరించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

పి గన్నవరం నుండి సెప్టెంబర్ 29 పున్నమి ప్రతినిధి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పి.గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా నియమితులైన మోకా ఆనంద్ సాగర్ ను పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జిగా పార్టీ బాధ్యతలు అప్పగించాలని కోరుకుంటున్న నేపథ్యంలో మోకా ఆనంద్ సాగర్ ని టీడీపీ ఇన్‌చార్జిగా నియమించడం సంతోషకరమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,యువ నాయకులు నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.కూటమి నాయకులు,కార్యకర్తలు అందరం సమన్వయంతో కలిసి పనిచేస్తామని,ఎలాంటి విభేదాలు లేదా సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి నాయకులు ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *