Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ఇడుపులపాయలో టీడీపీకి షాక్.. వైఎస్సార్‌సీపీలోకి వలసలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఇడుపులపాయలో టీడీపీకి షాక్..
  • వైఎస్సార్‌సీపీలోకి వలసలు పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 26 కడప జిల్లా ఇడుపులపాయలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
  • ఇడుపులపాయ పంచాయతీ పరిధిలోని మారుతి నగర్‌లో టీడీపీకి చెందిన పలువురు కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరడంతో స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇడుపులపాయలో టీడీపీకి షాక్.. వైఎస్సార్‌సీపీలోకి వలసలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 26

కడప జిల్లా ఇడుపులపాయలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇడుపులపాయ పంచాయతీ పరిధిలోని మారుతి నగర్‌లో టీడీపీకి చెందిన పలువురు కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరడంతో స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

గండి ఆలయ మాజీ చైర్మన్ కావలి కృష్ణతేజ ఆధ్వర్యంలో టీడీపీని వీడి పలువురు కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఇడుపులపాయలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమక్షంలో వారు వైఎస్సార్‌సీపీలో చేరారు.

ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇడుపులపాయలో చోటుచేసుకున్న ఈ చేరికలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులను మరింత సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని వైఎస్సార్‌సీపీ నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఇడుపులపాయ వైఎస్సార్‌సీపీ శ్రేణులు పోతిరెడ్డి శ్రావణ్ కుమార్, పోతిరెడ్డి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *