Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

భాకరపేట బెటాలియన్‌లో వైభవంగా దీక్షాంత్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

సిద్ధవటం మండలంలోని భాకరపేట సమీపంలో ఉన్న ఏపీఎస్పీ 11వ బెటాలియన్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసు క్యాడెట్ల దీక్షాంత్ పరేడ్ శనివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరై క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్‌ను సమీక్షించారు.కడప జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి,ఎస్పీ నచికేత్ విశ్వనాథ్,11వ బెటాలియన్ కమాండెంట్ కె.ఆనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతీయ గీతం అనంతరం శిక్షణార్థులు క్రమశిక్షణతో మార్చ్‌పాస్ట్ నిర్వహించి జాతీయ పతాకానికి సెల్యూట్ చేశారు.ప్రజలకు భరోసా కల్పించాలి పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు భరోసా కల్పించేలా విధులు నిర్వహించాలని మంత్రి సవిత సూచించారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వంతో పనిచేయాలన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను విధుల్లో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.ప్రతిభావంతులకు పురస్కారాలు
దీక్షాంత్ పరేడ్‌లో శిక్షణార్థులు పోలీసు విధులపై ప్రమాణ స్వీకారం చేశారు. శిక్షణ సమయంలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన క్యాడెట్లకు మంత్రి సవిత ట్రోఫీలు, పురస్కారాలు అందజేశారు. అనంతరం క్యాడెట్ల స్లో మార్చ్, త్రీ చీర్స్, ఫొటో సెషన్ నిర్వహించారు. కార్యక్రమానికి పోలీసు అధికారులు, సిబ్బంది, శిక్షణార్థుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై క్యాడెట్లను అభినందించారు.

భాకరపేట బెటాలియన్‌లో వైభవంగా దీక్షాంత్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *